Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/jaishwalc0f48b28-dc97-4c8a-847e-9deeb3f976a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/jaishwalc0f48b28-dc97-4c8a-847e-9deeb3f976a4-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు దేశవాళి క్రికెట్లో సెంచరీల మోత మోగించి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న యంగ్ బ్యాట్స్ మెన్ యశస్వి జైస్వాల్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కూడా తన బ్యాటింగ్ సత్తా ఏంటో నిరూపించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన జైస్వాల్ సెంచరీల మోత మోగించాడు. మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచాడు. చూడ్డానికి బక్క పలుచగా ఉన్న అతడు కొట్టే షాట్లు మాత్రం అందరిని అబ్బురపరిచాయి అని చెప్పాలి. అయితే ఇలా తన ప్రదర్శనతో సెలెక్టర్ల చూపును ఆకర్షింJaishwal{#}Rajasthan;England;West Indies;Yuva;Yashasvi Jaiswal;Athaduమొదటి మ్యాచ్ లోనే.. యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డ్?మొదటి మ్యాచ్ లోనే.. యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డ్?Jaishwal{#}Rajasthan;England;West Indies;Yuva;Yashasvi Jaiswal;AthaduFri, 14 Jul 2023 16:00:00 GMTమొన్నటి వరకు దేశవాళి క్రికెట్లో సెంచరీల మోత మోగించి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న యంగ్ బ్యాట్స్ మెన్ యశస్వి జైస్వాల్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కూడా తన బ్యాటింగ్ సత్తా ఏంటో నిరూపించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన  జైస్వాల్ సెంచరీల మోత మోగించాడు. మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచాడు. చూడ్డానికి బక్క పలుచగా ఉన్న అతడు కొట్టే షాట్లు మాత్రం అందరిని అబ్బురపరిచాయి అని చెప్పాలి. అయితే ఇలా తన ప్రదర్శనతో సెలెక్టర్ల చూపును ఆకర్షించి  వెంటనే టీమిండియాలోకి వచ్చేసాడు.


 ఈ క్రమంలోనే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా అటు టీమిండియా ఆడుతున్న టెస్ట్ సిరీస్ జడ్డులో చోటు దక్కించుకున్నాడు యశస్వి జైశ్వాల్. ఇక తుది జట్టులోకి కూడా వచ్చాడు. ఏకంగా రోహిత్ శర్మతో ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగాడు అని చెప్పాలి. అయితే సాధారణంగా కొత్త ఆటగాళ్లు మొదటి మ్యాచ్లో కాస్త ఒత్తిడికి లోనై తడబాటుకు గురవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ యశస్వి జైష్వాల్ లో మాత్రం అలాంటి తడబాటు ఎక్కడ కనిపించలేదు. మొదటి మ్యాచ్ లోనే ఏకంగా సెంచరీ మోత మోగించాడు .


 మొత్తంగా 154 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నో అరుదైన రికార్డులు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్లో అరంగేట్ర మ్యాచ్ లోనే ఎక్కువ బంతులు ఆడిన భారత ఆటగాడిగా నిలిచాడు యశస్వి జై శ్వాల్. గతంలో ఈ రికార్డు అజారుద్దీన్ పేరిట ఉండేది. ఈ మాజీ ప్లేయర్ తన తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ పై 322 బంతులను ఎదుర్కొన్నాడు. అయితే యశస్వి జైష్వాల్ 350 బంతులు ఎదుర్కొన్నాడు అని చెప్పాలి. ఈ యువ సంచలనం ఇంకా క్రీజులోనే ఉండడంతో ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడు అన్నది కూడా ఊహకందని విధంగా మారిపోయింది అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

జపాన్లో KGF ని మించిపోయిన రంగస్థలం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>