PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababu-has-changed-his-strategye82f1ada-a172-4b1a-84c6-66e420a6d032-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababu-has-changed-his-strategye82f1ada-a172-4b1a-84c6-66e420a6d032-415x250-IndiaHerald.jpgజగన్ తన పరిపాలన గురించి బ్రహ్మాండమనే చెప్పుకుంటారు. అలాగే చంద్రబాబు కూడా తాను గొప్ప దార్శినికుడననే చెప్పుకుంటారు. పవన్ కూడా తాను ఆదర్శవంతమైన పాలనను అందిస్తాననే చెబుతున్నారు. అధికారం ఎవరికి అప్పగించాలన్నది అల్టిమేట్ గా డిసైడ్ చేయాల్సింది జనాలే కదా. జగన్ కు ఓట్లేసిన జనాలను చంద్రబాబు, పవన్ తప్పుపడుతున్నారు. అన్నం తినేవాడెవరు 2024 ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేయరని చంద్రబాబు చెప్పిన మాట అందరికీ గుర్తుండే ఉంటుంది. tdp chandrababu jagan{#}Reddy;Hyderabad;Jagan;CBN;Pawan Kalyanఅమరావతి : చంద్రబాబుకు అంత ధైర్యముందా ?అమరావతి : చంద్రబాబుకు అంత ధైర్యముందా ?tdp chandrababu jagan{#}Reddy;Hyderabad;Jagan;CBN;Pawan KalyanFri, 14 Jul 2023 07:00:00 GMT

మీడియాతో చిట్ చాట్ చేస్తు చంద్రబాబునాయుడు కొన్ని మాటలుచెప్పారు. అదేమిటంటే హైదరాబాద్ అభివృద్ధికి తానెంత కష్టపడింది ఇప్పటి తరానికి తెలీదట. కానీ తానెంత కష్టపడింది తనకు తెలుసట. అలాగే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతు ఇంత అవినీతి చేయమని జగన్ కు ఏసుప్రభువు చెప్పారా ? అని అడిగారు. లక్షల కోట్ల ప్రజాసంపద నాశనంచేసి, లక్షల కోట్లు అప్పుచేయమని ఖురాన్ చెప్పిందా అంటు నిలదీశారు.





అధికారంలో ఉండగా తానేంచేశానో ప్రజలు చూశారు..నాలుగేళ్ళుగా జగన్ పరిపాలన ఏమిటో ప్రజలు చూస్తున్నారు..యాత్రల్లో పవన్ కల్యాణ్ ఏమి చెబుతున్నారో వింటున్నారు. ఎవరేమిటో బేరీజు వేసుకుని జనాలే డిసైడ్ చేసుకుంటారు అన్నారు. చంద్రబాబు చెప్పింది నిజమే అయితే గతంలో అంటే 2014-19 మధ్య తన పరిపాలన నచ్చితేనే టీడీపీకి ఓట్లేయమని ఎందుకు అడగటంలేదు ?  బహిరంగసభల్లో జగన్ ఏమడుగుతున్నారు ? తన పాలన నచ్చితేనే ఓట్లేయమని కదా అడుగుతున్నారు. చంద్రబాబు కూడా తన పాలన నచ్చితేనే ఓట్లేయమని అడగ్గలరా ?





జగన్ తన పరిపాలన గురించి బ్రహ్మాండమనే చెప్పుకుంటారు. అలాగే చంద్రబాబు కూడా తాను గొప్ప దార్శినికుడననే చెప్పుకుంటారు. పవన్ కూడా తాను ఆదర్శవంతమైన పాలనను అందిస్తాననే చెబుతున్నారు. అధికారం ఎవరికి అప్పగించాలన్నది అల్టిమేట్ గా డిసైడ్ చేయాల్సింది జనాలే కదా. జగన్ కు ఓట్లేసిన జనాలను చంద్రబాబు, పవన్ తప్పుపడుతున్నారు.  అన్నం తినేవాడెవరు 2024 ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేయరని చంద్రబాబు చెప్పిన మాట అందరికీ గుర్తుండే ఉంటుంది.





ఒకవైపు జనాలను శాపనార్ధాలు పెడుతునే మరోవైపు ఎవరికి అధికారం ఇవ్వాలో డిసైడ్ చేసుకోవాల్సింది జనాలే అని చంద్రబాబు చెప్పటంలో అర్ధమేంటి ? తన పరిపాలన నచ్చితేనే టీడీపీకి ఓట్లేయమని జనాలతో చంద్రబాబు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. అంటే తనకు తెలుసు తన పాలనను జనాలు ఏనాడు మెచ్చుకోరని. జనాలు మెచ్చుకునే పాలన అందించటం  చంద్రబాబుకు చేతకాదు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలాగ మాట్లాడి అధికారంలోకి రాగానే మరోలాగ చేయటం చంద్రబాబుకు అలవాటే.




RRR Telugu Movie Review Rating

14 రోజుల్లో "సామజవరగమన" సినిమాకు వరల్డ్ వైడ్ గా దక్కిన కలెక్షన్లు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>