MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kgf9ac18aa6-0746-453d-a1eb-4c8486179b92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kgf9ac18aa6-0746-453d-a1eb-4c8486179b92-415x250-IndiaHerald.jpgజపాన్‍లో మన ఇండియన్ సినిమాలు ఒక రేంజ్ లో దుమ్మురేపుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా జపనీస్ మార్కెట్‍లో సూపర్ గా అదరగొట్టింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ వెర్షన్‍లో ఏకంగా రూ.100కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.ఈ సినిమా జపనీస్ మార్కెట్‍లో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇక ఇప్పుడు జపాన్‍లో నేడు (జూలై 14) కేజీఎఫ్ చాప్టర్ 1అలాగే కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలు ఒకేసారి జపనీస్‍ వెర్షన్‍లో విడుదలయ్యాయి. అయితే, రామ్‍చరణ్ నటించిన రంగస్థలం KGF{#}Rocky;Japan;RRR Movie;Rangasthalam;KGF;March;News;Rajamouli;sukumar;Tollywood;Mass;ram pothineni;Director;Cinema;Indianజపాన్లో KGF ని మించిపోయిన రంగస్థలం?జపాన్లో KGF ని మించిపోయిన రంగస్థలం?KGF{#}Rocky;Japan;RRR Movie;Rangasthalam;KGF;March;News;Rajamouli;sukumar;Tollywood;Mass;ram pothineni;Director;Cinema;IndianFri, 14 Jul 2023 19:26:14 GMTజపాన్‍లో మన ఇండియన్ సినిమాలు ఒక రేంజ్ లో దుమ్మురేపుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా జపనీస్ మార్కెట్‍లో సూపర్ గా అదరగొట్టింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ వెర్షన్‍లో ఏకంగా రూ.100కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.ఈ సినిమా జపనీస్ మార్కెట్‍లో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇక ఇప్పుడు జపాన్‍లో నేడు (జూలై 14) కేజీఎఫ్ చాప్టర్ 1అలాగే కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలు ఒకేసారి జపనీస్‍ వెర్షన్‍లో విడుదలయ్యాయి. అయితే, రామ్‍చరణ్ నటించిన రంగస్థలం సినిమా కూడా ఇదే రోజు అక్కడి థియేటర్లలో జపనీస్ భాషలోకి వచ్చింది. ఈ క్రమంలో ఆ సినిమా కలెక్షన్‍లపై అందరి దృష్టి పడింది.జపాన్‍లో కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 కంటే రంగస్థలం సినిమాకే చాలా ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్‍లు జరిగాయని సమాచారం తెలుస్తోంది. దీంతో జపాన్‍లో మొదటి రోజు రంగస్థలం సినిమా ఎక్కువ కలెక్షన్‍లను సాధించే అవకాశం కనిపిస్తోంది. రాకీ భాయ్‍తో పోలిస్తే చిట్టిబాబుకు ఫస్ట్ డే కలెక్షన్లు ఎక్కువగా వచ్చే ఛాన్స్ స్పష్టంగా ఉంది.


 ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్‍చరణ్ గ్లోబల్ స్టార్‌గా మారాడు. దీంతో రంగస్థలం సినిమా జపాన్ మార్కెట్‍లోనూ దుమ్మురేపే ఛాన్స్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్‍లో కూడా అద్భుతంగా ఆడటంతో రామ్ చరణ్‍కు అక్కడ ఫుల్ క్రేజ్ ఏర్పడింది.టాలీవుడ్ స్టార్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమా 2018 మార్చి 30 వ తేదీన విడుదలై కల్ట్ క్లాసిక్‍గా నిలిచింది. చిట్టిబాబుగా ఈ సినిమాలో రామ్‍చరణ్ పాత్ర ప్రశంసలు దక్కించుకుంది. గ్రామీణ నేపథ్యంలో ఈ మాస్ యాక్షన్ డ్రామాను సుకుమార్ ఓ దృశ్యక్యావ్యంగా చాలా చక్కగా మలిచాడు. దీంతో రంగస్థలం సినిమా టాలీవుడ్‍లో 2018 లో పలు రికార్డులను బద్దలుకొట్టింది. అప్పట్లోనే ఏకంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్‍లను రాబట్టి ఈ సినిమా సంచలనం సృష్టించింది. మరి, ఇప్పుడు జపాన్ మార్కెట్‍లో ఈ సినిమా ఎంత వరకు కలెక్షన్‍లను రాబడుతుందో చూడాలి. రంగస్థలంలోని ఎమోషన్ జపనీయులకు నచ్చితే ఈ సినిమాకి ఖచ్చితంగా పంట పండుతుందని బాక్సాఫీస్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



RRR Telugu Movie Review Rating

జపాన్లో KGF ని మించిపోయిన రంగస్థలం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>