EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr02168268-5be3-4dd1-9d42-155932b8376f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr02168268-5be3-4dd1-9d42-155932b8376f-415x250-IndiaHerald.jpgతెలంగాణలో బీఆర్ఎస్ యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రకటించింది. ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి ప్రయాణిస్తున్నట్లు స్పష్టమైంది. దీంతో తెలంగాణలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ చెంత చేరకుండా ముందుగానే ప్లాన్ వేసుకుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో సీఎం కేసీఆర్ వ్యతిరేకంగా ఉంటామని హామీ ఇచ్చారని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ వైఖరి స్పష్టంగా అర్థమైంది. దీంతో ముస్లింల ఓట్లు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు పడటం ఖాయమని ఆ పార్టీ వర్గాలు అనుకుంటుKCR{#}MIM Party;CM;Bharatiya Janata Party;Congress;Partyయూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌.. కేసీఆర్‌కు లాభమా.. నష్టమా?యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌.. కేసీఆర్‌కు లాభమా.. నష్టమా?KCR{#}MIM Party;CM;Bharatiya Janata Party;Congress;PartyFri, 14 Jul 2023 05:00:00 GMTతెలంగాణలో బీఆర్ఎస్ యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రకటించింది. ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి ప్రయాణిస్తున్నట్లు స్పష్టమైంది. దీంతో తెలంగాణలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ చెంత చేరకుండా ముందుగానే ప్లాన్ వేసుకుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో సీఎం కేసీఆర్ వ్యతిరేకంగా ఉంటామని హామీ ఇచ్చారని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ వైఖరి స్పష్టంగా అర్థమైంది.


దీంతో ముస్లింల ఓట్లు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు పడటం ఖాయమని ఆ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ ను కూడా దెబ్బతీసినట్లవుతుంది. బీజేపీకి ఎలాగో ముస్లిం ఓట్లు పడటం తక్కువ కాబట్టి.. గంపగుత్తగా ముస్లింల ఓట్లను బీఆర్ఎస్ కు మళ్లించడంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశం కలిసొస్తుందని ఆ పార్టీ నాయకులు ఆనందంతో ఉన్నారు.


బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న హిందువులు తమకే ఓటు వేస్తారని, క్రిస్టియన్ల ఓట్లు కూడా వస్తాయని గులాబీ నేతలు అనుకుంటున్నారు. ఇదే విధానంతో కర్ణాటకలో ముస్లిం ఓట్లు జేడీఎస్ నుంచి చీలి కాంగ్రెస్ కు పడటంతో ఏక పక్ష విజయం సాధ్యమైంది. ఇలా అనేక రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని సీఎం కేసీఆర్ ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.


దేశ వ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలోని అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంచలనమే. ఈ సివిల్ కోడ్ పై ప్రజలకు చాలా వరకు అవగాహన లేదు. దీని వల్ల రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలు ఏమిటి? ఎలా స్పందించాలి. ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశాలపై ఆయా పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. బీఆర్ఎస్ మాత్రం తమ నిర్ణయాన్ని డేర్ గా ప్రకటించింది. బీజేపీ దీని గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు ఏం చెబుతుందో చూడాలి.





RRR Telugu Movie Review Rating

14 రోజుల్లో "సామజవరగమన" సినిమాకు వరల్డ్ వైడ్ గా దక్కిన కలెక్షన్లు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>