MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-tejaaa0d27d2-d691-4a3e-84ea-a44cc8ee2ccb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-tejaaa0d27d2-d691-4a3e-84ea-a44cc8ee2ccb-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి సాయి ధరమ్ తేజ్ ఆఖరుగా వీరుపాక్ష అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... కార్తీక్ దండు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇలా విరూపాక్ష లాంటి అద్భుతమైన విజయవంతమైన సినిమా తర్వాత ఈ యువ నటుడు "బ్రో" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు Sai teja{#}priya prakash varrier;sai dharam tej;thaman s;cinema theater;Yuva;Ketika Sharma;Amarnath K Menon;Karthik;Box office;teja;Pawan Kalyan;Heroine;Cinema"బ్రో" మూవీ సెకండ్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!"బ్రో" మూవీ సెకండ్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!Sai teja{#}priya prakash varrier;sai dharam tej;thaman s;cinema theater;Yuva;Ketika Sharma;Amarnath K Menon;Karthik;Box office;teja;Pawan Kalyan;Heroine;CinemaFri, 14 Jul 2023 04:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి సాయి ధరమ్ తేజ్ ఆఖరుగా వీరుపాక్ష అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... కార్తీక్ దండు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇలా విరూపాక్ష లాంటి అద్భుతమైన విజయవంతమైన సినిమా తర్వాత ఈ యువ నటుడు "బ్రో" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

ఈ సినిమాలో సాయి తేజ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హీరోగా కనిపించబోతున్నాడు. సముద్ర కని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ , కేతిక శర్మ ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ని జులై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం ఒక పాటను కూడా విడుదల చేసింది. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా లోని రెండవ పాటకు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ లోని రెండవ పాట అయినటు వంటి "జానవులే" సాంగ్ ను జూలై 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.


RRR Telugu Movie Review Rating

14 రోజుల్లో "సామజవరగమన" సినిమాకు వరల్డ్ వైడ్ గా దక్కిన కలెక్షన్లు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>