MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby7cfc3ce7-29c5-4f89-a16b-251d4d0310be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby7cfc3ce7-29c5-4f89-a16b-251d4d0310be-415x250-IndiaHerald.jpgఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లాంటి యువ నటులు నటించిన సినిమా బేబీ. నేడు విడుదల అయ్యింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.నేటి తరం యువతీయువకుల్లో చాలా మంది ఈజీగా ప్రేమలో పడుతున్నారు. అయితే ఆ ప్రేమని కేవలం ఒకరికి మాత్రమే పంచడం లేదు. ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్‌లో ఉంటూ చివరికి తమ జీవితాలను సులభంగా నాశనం చేసుకుంటున్నారు. ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే ఈ బేబీ. ప్రస్తుతం జరుగుతున్న వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలా ఈ సినిమాని రూపొందించారు దర్BABY{#}Kathanam;Girl;prema;Yuva;Manam;Chaitanya;Darsakudu;Director;Hero;Love;Telugu;Cinema;Heroineబేబీ రివ్యూ: ట్రైయాంగిల్ లవ్ స్టోరీ మెప్పించిందా?బేబీ రివ్యూ: ట్రైయాంగిల్ లవ్ స్టోరీ మెప్పించిందా?BABY{#}Kathanam;Girl;prema;Yuva;Manam;Chaitanya;Darsakudu;Director;Hero;Love;Telugu;Cinema;HeroineFri, 14 Jul 2023 14:16:00 GMTఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లాంటి యువ నటులు నటించిన సినిమా బేబీ. నేడు విడుదల అయ్యింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.నేటి తరం యువతీయువకుల్లో చాలా మంది ఈజీగా ప్రేమలో పడుతున్నారు. అయితే ఆ ప్రేమని కేవలం ఒకరికి మాత్రమే పంచడం లేదు. ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్‌లో ఉంటూ చివరికి తమ జీవితాలను సులభంగా నాశనం చేసుకుంటున్నారు. ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే ఈ బేబీ. ప్రస్తుతం జరుగుతున్న వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలా ఈ సినిమాని రూపొందించారు దర్శకుడు సాయి రాజేష్‌.స్కూల్స్, కాలేజీల్లో ఈతరం ప్రేమ కథలు ఎలా ఉంటున్నాయి ? తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న తప్పులు చివరకి ఎక్కడికి దారితీస్తున్నాయి? మన చుట్టూ ఉండే స్నేహితులు ఇంకా పరిస్థితుల ప్రభావం తెలియకుండానే మనపై ఎలా పడతాయి? వంటి విషయాలను కళ్లకు కట్టినట్లు చాలా చక్కగా చూపించారు.దీంతో పాటు ప్రతి వ్యక్తి తొలి ప్రేమను మర్చిపోలేరనే విషయాన్ని కూడా అంతర్లీనంగా చూపించారు.అయితే ఈ బేబీ కథ కొత్తది అని చెప్పలేం.రోజూ మనం వార్తల్లో చూస్తున్న, వింటున్న సంఘటనలే సినిమాలో కనిపిస్తాయి. ఇలాంటి ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు కానీ కాస్త భిన్నంగా కథనం సాగుతుంది.


ఆనంద్‌ విషాదకరమైన జీవితానికి సంబంధించిన సీన్‌తో ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత స్కూల్‌డేస్‌ లవ్‌స్టోరీ చాలా సహజంగా హృదయాలను ఎంతో హత్తుకునేలా సాగుతుంది. హీరో  పదో తరగతి ఫెయిల్‌ అవ్వడం.. హీరోయిన్  పై చదువుల కోసం ఓ పెద్ద కాలేజీలో చేరడంతో కథ మలుపు తీసుకుంటుంది.బస్తీ నుంచి వచ్చిన అమ్మాయి సిటీ కల్చర్‌కి అలవాటు పడడం, తోటి స్నేహితులను చూసి తన లైఫ్‌ స్టైల్‌ని కూడా మార్చుకోవడం.. అది ఆమె బస్తీ బాయ్ ఫ్రెండ్ కి నచ్చకపోవడం..ఇద్దరి మధ్య గొడవ రావడం.. ప్రతి సీన్‌ కూడా చాలా సహజంగా సాగుతుంది. తరువాత హీరోయిన్ కి కాలేజ్ అబ్బాయి పరిచయంతో ఈ ప్రేమకథ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీగా మారుతుంది. ఇంటర్వెల్‌ ముందు మద్యం మత్తులో ఆనంద్‌కి వైష్ణవి కాల్‌ చేసి అమ్మాయిల గురించి చెప్పే సంభాషణలు అయితే అదిరిపోతాయి.సెకండ్ హాఫ్ బాగానే ఉంటుంది. బట్ కొంచెం ల్యాగ్ అయ్యింది.ఇక మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సో సో గా ఉన్నాయి. ఆనంద్, వైష్ణవి, విరాజ్ తమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు. మొత్తానికి మూవీ పర్లేదు.. ప్రేక్షకుడిని బాగానే ఎంటర్టైన్ చేస్తుంది.



RRR Telugu Movie Review Rating

మ్యారేజ్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>