MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli2e285546-2ed3-4be4-a32b-a79b93791452-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli2e285546-2ed3-4be4-a32b-a79b93791452-415x250-IndiaHerald.jpgరాజమౌళి ‘మహాభారతం’ అత్యంత భారీ స్థాయిలో తీస్తే చూడాలని ఎంతోమంది కోరుకుంటున్నారు. వాస్తవానికి జక్కన్న కూడ తనకు ‘మహాభారతం’ తీసే ఉద్దేశ్యం ఉంది అంటూ గతంలో చెప్పాడు. అయితే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో తనకు తెలియదు అంటూ గతంలో క్లారిటీ ఇచ్చాడు. తాను తీసే ప్రతి సినిమాకు టెక్నాలజీని విపరీతంగా వాడుకునే రాజమౌళి ‘మహాభారతం’ తీస్తే అది చరిత్ర అవుతుందని అందరి భావన.రాజమౌళి సినిమాలకు కథలు అందించే రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈవిషయం పై ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేశాడుrajamouli{#}Writer;history;Rajamouli;Hollywood;Telugu;media;prasad;Cinemaరాజమౌళి మహాభారతం పై విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన లీకులు !రాజమౌళి మహాభారతం పై విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన లీకులు !rajamouli{#}Writer;history;Rajamouli;Hollywood;Telugu;media;prasad;CinemaFri, 14 Jul 2023 13:13:15 GMTరాజమౌళి ‘మహాభారతం’ అత్యంత భారీ స్థాయిలో తీస్తే చూడాలని ఎంతోమంది కోరుకుంటున్నారు. వాస్తవానికి జక్కన్న కూడ తనకు ‘మహాభారతం’ తీసే ఉద్దేశ్యం ఉంది అంటూ గతంలో చెప్పాడు. అయితే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో తనకు తెలియదు అంటూ గతంలో క్లారిటీ ఇచ్చాడు. తాను తీసే ప్రతి సినిమాకు టెక్నాలజీని విపరీతంగా వాడుకునే రాజమౌళి ‘మహాభారతం’ తీస్తే అది చరిత్ర అవుతుందని అందరి భావన.


రాజమౌళి సినిమాలకు కథలు అందించే రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈవిషయం పై ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేశాడు. ‘మహాభారతం’ సినిమా రాజమౌళి తీయాలి అంటే కనీసం ఆ మూవీని మూడు భాగాలుగా తీయాలి అని ఈమూడు భాగాలు తీయడానికి 15 సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యయంలేదు అంటూ కామెంట్స్ చేశాడు.


ప్రస్తుతం రాజమౌళి వయసు 50 సంవత్సరాలు ఇప్పుడు జక్కన్న  మహేష్ తో తీస్తున్న సినిమా పూర్తి కావడానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఆతరువాత ‘ఆర్ ఆర్ ఆర్ 2’ తీయవాలసి ఉంది ఇవన్నీ పూర్తి అవ్వడానికి మరో 5 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి రాజమౌళికి 55 సంవత్సరాలు వస్తాయి. అప్పుడు ‘మహాభారతం’ మొదలు పెడితే అది పూర్తి అయ్యే సమయానికి రాజమౌళికి 70 సంవత్సరాలు వస్తాయి.


దీనితో జక్కన్న ‘మహాభారతం’ తీయడం అన్నది ఒక కలగా మారుతుందని కొందరి అభిప్రాయం. దీనికితోడు ‘మహాభారతం’ మూవీని హాలీవుడ్ రేంజ్ లో తీయాలి కాబట్టి ఆమూవీకి వేల కోట్లలలో పెట్టుబడి అవసరం. అలాంటి పరిస్థితులలో ‘మహాభారతం’ ప్రాజెక్ట్ ను ఒక బడా హాలీవుడ్ నిర్మాణ సంస్థ మాత్రమే నిర్మించ గలుగుతుంది. ఇన్ని ఆటంకాలు ఉన్న ఈ మూవీ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కడం జరిగే పనేనా అన్నది చాలామంది సందేహం. అయినప్పటికీ రాజమౌళి ‘మహాభారతం’ తీస్తే చూడాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి కోరిక నెరవేరేది ఎప్పుడో..





RRR Telugu Movie Review Rating

నాయకుడు రివ్యూ: హీరో పెద్ద మైనస్.. వరస్ట్ యాక్టర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>