NRIChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/tanaf82aea3c-0dd9-492c-bf68-d9f66426d78d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/tanaf82aea3c-0dd9-492c-bf68-d9f66426d78d-415x250-IndiaHerald.jpgతెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా లేదా ఉత్తర అమెరికా తెలుగు సంఘం అనేది 70 వేల వరకు సభ్యులు ఉన్న ఒక తెలుగు సంఘం. ఉత్తర అమెరికాలో ఉండేటువంటి తెలుగు ప్రజలతో, తెలుగు ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రజా సంఘం. తెలుగు వారి సంస్కృతిని, సాంస్కృతిక వారసత్వాన్ని విదేశాలలో కూడా రక్షించడానికి ఏర్పాటు చేసుకున్న సంఘం. అయితే తెలుగువారి గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఏర్పాటు చేసుకున్న ఈ సంఘం పైన ప్రపంచవ్యాప్తంగా ఒక దృష్టి ఉంటుంది. అలాంటి సందర్భంలో అలాంటి విశ్వవ్యాప్త సంఘంలో ఉండేవారు ఎంత హుందాగTANA{#}Nara Lokesh;Parents;Jr NTR;Telugu Desam Party;CBN;News;Telugu;American Samoaతానాలో తన్నులాట.. పరువు తీసేస్తున్నారుగా?తానాలో తన్నులాట.. పరువు తీసేస్తున్నారుగా?TANA{#}Nara Lokesh;Parents;Jr NTR;Telugu Desam Party;CBN;News;Telugu;American SamoaThu, 13 Jul 2023 09:30:00 GMTతెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా లేదా ఉత్తర అమెరికా తెలుగు సంఘం అనేది 70 వేల వరకు సభ్యులు ఉన్న ఒక తెలుగు సంఘం.  ఉత్తర అమెరికాలో ఉండేటువంటి  తెలుగు ప్రజలతో, తెలుగు ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రజా సంఘం. తెలుగు వారి సంస్కృతిని, సాంస్కృతిక వారసత్వాన్ని విదేశాలలో కూడా రక్షించడానికి ఏర్పాటు చేసుకున్న సంఘం.


అయితే తెలుగువారి గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఏర్పాటు చేసుకున్న ఈ సంఘం పైన ప్రపంచవ్యాప్తంగా ఒక దృష్టి ఉంటుంది. అలాంటి సందర్భంలో అలాంటి విశ్వవ్యాప్త  సంఘంలో ఉండేవారు ఎంత హుందాగా ఉండాలి. కానీ తాజాగా విదేశంలో ఉన్న ఈ తెలుగు వారి సంఘంలోనే తెలుగు వారు అయినటువంటి అక్కడి ప్రజలు ఇటీవల ఒకరినొకరు తన్నుకున్నట్లుగా సమాచారం.


తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారని తెలుస్తుంది. అయితే అలా జూనియర్ ఎన్టీఆర్ కి మద్దతు ఇస్తూ నినాదాలు చేయడం నచ్చనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో ఘర్షణకు దిగారని సమాచారం.


అయితే దీనివల్ల జూనియర్ ఎన్టీఆర్ కి ఎటువంటి నష్టం ఉండదు. నారా లోకేష్ కు, చంద్రబాబు నాయుడుకి కూడా ఎటువంటి నష్టం ఉండదు. కానీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ముతో తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు పంపిస్తూ ఉంటారు. తీరా అక్కడికి వెళ్లి కూడా మన వీధుల్లో కొట్టుకున్నట్లు తెలుగు వారి గొప్పతనాన్ని చాటి చెప్పేటువంటి గొప్ప సంఘాలలో కూడా ఇలా కొట్టుకోవడం ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి తెలుగు వారి సంతతికి ఈ సంఘం తరఫున నాణ్యమైన విద్యను అందిస్తుంటారు. అంతే కాకుండా వృద్ధులకు, వికలాంగులకు కూడా చేయూతనిస్తూ ఉంటారు తానా సభ్యులు. అటువంటి తానాలో తన్నుకోవడం తెలుగు వారికి ఎంత అవమానం అని అడుగుతున్నారు కొంతమంది.



RRR Telugu Movie Review Rating

ట్రోలర్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన యంగ్ హీరో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>