LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/basmati-ricec64393d3-35fd-4acc-9b2c-95ef7959af77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/basmati-ricec64393d3-35fd-4acc-9b2c-95ef7959af77-415x250-IndiaHerald.jpgబాస్మతీ రైస్ ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటితో ఎక్కువగా పులావ్, బిర్యానీ వంటి రుచికరమైన వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఈ బాస్మతీ బియ్యం పొడువుగా, సన్నగా, చక్కటి వాసనను కలిగి ఉంటాయి.బాస్మతీ బియ్యంతో వండిన వంటకాలు చక్కటి వాసనతో ఎంతో రుచిగా ఉంటాయి. మన దేశంలో మొత్తం 29 రకాల బాస్మతీ బియ్యం ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఈ బాస్మతి బియ్యం అనేది ఎగుమతిలో భారత దేశమే అగ్రగామిగా ఉంది.ఇక మన దేశంలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, జమ్ముకాశ్మీర్ వంటి రాష్ట్రాలBASMATI RICE{#}Vitamin;Heart;Cancer;Magnesium;Cholesterol;Shakti;Manamబాస్మతీ రైస్: హెల్త్ కి వెరీ నైస్?బాస్మతీ రైస్: హెల్త్ కి వెరీ నైస్?BASMATI RICE{#}Vitamin;Heart;Cancer;Magnesium;Cholesterol;Shakti;ManamThu, 13 Jul 2023 13:44:02 GMTబాస్మతీ రైస్ ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటితో ఎక్కువగా పులావ్, బిర్యానీ వంటి రుచికరమైన వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఈ బాస్మతీ బియ్యం పొడువుగా, సన్నగా, చక్కటి వాసనను కలిగి ఉంటాయి.బాస్మతీ బియ్యంతో వండిన వంటకాలు చక్కటి వాసనతో ఎంతో రుచిగా ఉంటాయి. మన దేశంలో మొత్తం 29 రకాల బాస్మతీ బియ్యం ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఈ బాస్మతి బియ్యం అనేది ఎగుమతిలో భారత దేశమే అగ్రగామిగా ఉంది.ఇక మన దేశంలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, జమ్ముకాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో బాస్మతీ బియ్యాన్ని చాలా ఎక్కువగా పండిస్తారు. ఈ బాస్మతీ బియ్యాన్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.వీటిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఒక కప్పు బాస్మతి బియ్యంలో 210 క్యాలరీల శక్తి, 0.5 కొవ్వులు, 46 గ్రాముల పిండి పదార్థాలు, 0.7 గ్రాముల ఫైబర్, 5 గ్రాముల ప్రోటీన్, విటమిన్ బి1 ఇంకా బి6, రాగి, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం అలాగే జింక్ వంటి పోషకాలు ఉంటాయి.ఈ బాస్మతీ బియ్యంలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి.


ఇంకా అలాగే ఈ బియ్యంలో గ్లూటెన్ ఉండదు. కాబట్టి గ్లూటెన్ ఫ్రీ ఆహారాలను తీసుకునే వారు, కొవ్వు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకునే వారికి ఇవి మంచి ఆహారమని చెప్పవచ్చు.ఇంకా అలాగే మధుమేహ వ్యాధి గ్రస్తులు కూడా బాస్మతి బాయ్యాన్ని తగిన మోతాదులో ఆహారంగా తీసుకోవచ్చు. బాస్మతీ బియ్యాన్ని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఈజీగా అదుపులో ఉంటాయి.ఇంకా అలాగే అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఇక బాస్మతి బియ్యాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా అంతే కాదండోయ్ ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మెదడు చాలా చురుకుగా పని చేస్తుంది.ఇంకా నాడీ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది.ఇంకా అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. బరువు తగ్గడంలో, శరీరానికి కావల్సిన శక్తిని అందించడంలో ఇంకా జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా బాస్మతీ బియ్యం మనకు సహాయపడుతుంది. ఈ విధంగా బాస్మతి బియ్యం మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.అయితే ఈ బాస్మతి బియ్యాన్ని పాలిష్ పట్టకుండా తీసుకోవడం వల్ల మాత్రమే మనం ఈ ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

ట్రోలర్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన యంగ్ హీరో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>