Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket4ebcbbf0-887d-4603-b0f5-c9d8661a9194-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket4ebcbbf0-887d-4603-b0f5-c9d8661a9194-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో క్రికెట్ తీరు మొత్తం మారిపోయింది. ఒకప్పుడుక్రికెట్ అంటే దేశవాళి మ్యాచ్లతో పాటు అటు అంతర్జాతీయ క్రికెట్లో జరిగే టెస్ట్, టి20 వన్డే మ్యాచ్లు మాత్రమే ఉండేవి. ఇక ఆటగాళ్లు ఎప్పుడూ ఇలాంటి మ్యాచ్లు మాత్రమే ఆడేవారు. కానీ ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ వచ్చిన తర్వాత దేశవాళి క్రికెట్లో ఆడటానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో కూడా చాలీచాలని వేతనాలు ఉండడంతో.. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కాస్తయినా రెస్ట్ తీసుCricket{#}narain;thursday;Cricket;INTERNATIONAL;sunilఒకే ప్లేయర్ 75 గంటల్లో 4 మ్యాచ్ లు.. అందుకే ఫ్రాంచైజీ క్రికెట్ వద్దనేది?ఒకే ప్లేయర్ 75 గంటల్లో 4 మ్యాచ్ లు.. అందుకే ఫ్రాంచైజీ క్రికెట్ వద్దనేది?Cricket{#}narain;thursday;Cricket;INTERNATIONAL;sunilThu, 13 Jul 2023 07:35:00 GMTఇటీవల కాలంలో క్రికెట్ తీరు మొత్తం మారిపోయింది. ఒకప్పుడుక్రికెట్ అంటే దేశవాళి మ్యాచ్లతో పాటు అటు అంతర్జాతీయ క్రికెట్లో జరిగే టెస్ట్, టి20 వన్డే మ్యాచ్లు మాత్రమే ఉండేవి. ఇక ఆటగాళ్లు ఎప్పుడూ ఇలాంటి మ్యాచ్లు మాత్రమే ఆడేవారు. కానీ ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ వచ్చిన తర్వాత దేశవాళి క్రికెట్లో ఆడటానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో కూడా చాలీచాలని వేతనాలు ఉండడంతో.. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే కాస్తయినా రెస్ట్ తీసుకోకుండా నిర్విరామంగా క్రికెట్ ఆడుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఎక్కువ మంది ఆటగాళ్లు అటు జాతీయ జట్టుకు అందుబాటులో ఉండలేక గాయాల బారిన పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇలా ఫ్రాంచైజీ క్రికెట్ హవా పెరిగిపోయిన నేపథ్యంలో ఎంతో మంది మాజీ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్కు ముప్పు వాటిల్లుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఫ్రాంచైజీ క్రికెట్ ద్వారా నిర్విరామంగా క్రికెట్ ఆడటం వల్ల ఇక అంతర్జాతీయ క్రికెట్లో ప్లేయర్లు పెద్దగా రాణించడం లేదు అంటూ అభిప్రాయపడుతున్నారు.


 అయితే ఫ్రాంచైజీ క్రికెట్ కారణంగా ప్లేయర్లు ఎంత బిజీగా గడుపుతున్నారు అన్న దానికి నిదర్శనంగా ఇప్పుడు సునీల్ నరైన్ షెడ్యూల్ మారింది. కేవలం 75 గంటల్లోనే 14,500 కిలోమీటర్లు ప్రయాణించి.. యూఎస్, యూకే లో నాలుగు టి20 మ్యాచ్ లు ఆడబోతున్నాడు నరైన్. గురువారం డల్లాస్ లో ప్రారంభమయ్యే ఎమ్మెల్సీ లో నరైన్ ఎల్ఏ నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. అనంతరం యూకే బయలుదేరి 15న టి20 బ్లాస్ట్ సెమీఫైనల్స్ లో సర్రే తరఫున ఆడుతున్నాడు. ఆ మ్యాచ్ గెలిస్తే అదే రోజు రాత్రి ఫైనల్స్ ఆడనున్నాడు. ఇక ఆ తర్వాత యూఎస్ చేరుకొని ఈనెల 16న ఎల్ఏకెఆర్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించి మ్యాచ్ ఆడనున్నాడు.



RRR Telugu Movie Review Rating

అదానీపై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>