Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-643ee147-356c-421c-8a82-72be5f7383ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-643ee147-356c-421c-8a82-72be5f7383ae-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో మద్యం మత్తు ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇలా మద్యం మత్తు ఎన్నో కాపురాలను కూల్చేస్తున్న.. ఎంతో మంది జీవితాలను రాలిపోయేలా చేస్తున్న ఇక జనాల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. సంతోషం వచ్చిన దుఃఖం వచ్చిన.. పండగ జరిగిన.. జరిగిన చెడు కార్యం జరిగిన ఇలా ప్రతిదానికి మద్యం ఉండడం అనేది తప్పనిసరిగా మారిపోయింది. ఒకప్పుడు మద్యం తాగే వారిని కాస్త విచిత్రంగా చూసేవారు. ఏకంగా మద్యం తాగేవారు చెడ్డవారు అన్నట్లుగా భావించేవారు. కానీ ఇటీవల కాలంలో మద్యం తాగకుండా ఉన్నవారిని విచిత్Suicide {#}Naresh;allari naresh;jeedimetla;Santosham;Husband;Panchayati;Lakshmi Devi;Hyderabad;Wifeభర్త మద్యానికి బానిసయ్యాడని.. భార్య ఏం చేసిందో తెలుసా?భర్త మద్యానికి బానిసయ్యాడని.. భార్య ఏం చేసిందో తెలుసా?Suicide {#}Naresh;allari naresh;jeedimetla;Santosham;Husband;Panchayati;Lakshmi Devi;Hyderabad;WifeThu, 13 Jul 2023 13:00:00 GMTఇటీవల కాలంలో మద్యం మత్తు ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇలా మద్యం మత్తు ఎన్నో కాపురాలను కూల్చేస్తున్న.. ఎంతో మంది జీవితాలను రాలిపోయేలా చేస్తున్న ఇక జనాల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. సంతోషం వచ్చిన దుఃఖం వచ్చిన.. పండగ జరిగిన.. జరిగిన చెడు కార్యం జరిగిన ఇలా ప్రతిదానికి మద్యం ఉండడం అనేది తప్పనిసరిగా మారిపోయింది. ఒకప్పుడు మద్యం తాగే వారిని కాస్త విచిత్రంగా చూసేవారు. ఏకంగా మద్యం తాగేవారు చెడ్డవారు అన్నట్లుగా భావించేవారు. కానీ ఇటీవల కాలంలో మద్యం తాగకుండా ఉన్నవారిని విచిత్రంగా చూడటం చేస్తున్నారు.


 అయితే మద్యానికి ఒక లిమిట్ లో తాగడం వరకు ఓకే గాని.. కొంతమంది అయితే మద్యానికి బానిసగా మారిపోయి కుటుంబ బాధ్యతలను కూడా గాలికి వదిలేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వెరసి ఇలా మద్యం కారణంగానే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయ్ అని చెప్పాలి. ఎన్నో ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త మద్యానికి బానిసగా మారిపోయాడు. ఈ క్రమంలోనే భర్త తో మద్యం మాన్పించాలని ఆమె ఎంతగానో ప్రయత్నించింది.


 కానీ ఎంత చెప్పినా భర్త తీరులో మాత్రం మార్పు రాలేదు. దీంతో మనస్థాపం చెందిన భార్య చివరికి తనువు చాలించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస నగర్కు చెందిన నరేష్, లక్ష్మీ భార్యాభర్తలు. కాగా నరేష్ కూరగాయల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అయితే ఇటీవల కాలంలో మద్యానికి బానిసగా మారాడు. ఇక వ్యాపారం చేయగా వచ్చిన డబ్బుతో మద్యం సేవిస్తూ ఉండేవాడు. అయితే భార్యాభర్తల మధ్య ఇదే విషయంపై గొడవ జరుగుతూ ఉండేది. అయితే  పెద్దల మధ్య పంచాయతీ పెట్టిన నరేష్ తీరులో మార్పు రాలేదు. కాగా భర్త తీరుతో విసుగు చెందిన భార్య లక్ష్మి చివరికి ఆత్మహత్య చేసుకుంది.



RRR Telugu Movie Review Rating

ట్రోలర్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన యంగ్ హీరో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>