Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/asiacupd17cea43-0f3d-4f93-83bb-6bb622259366-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/asiacupd17cea43-0f3d-4f93-83bb-6bb622259366-415x250-IndiaHerald.jpgఈ ఏడాది క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా పండగ వాతావరణం నెలకొనబోతుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. అయితే ఇక ఈ రెండు టోర్నిల విషయంలో మాత్రం గత కొంతకాలం నుంచి గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సంబంధాలపై నిషేధం కొనసాగిస్తున్న పాకిస్తాన్.. భారత్లలో ఈ రెండు టోర్నిలు జరగబోతున్నాయ్. ముఖ్యంగా పాకిస్తాన్లో జరిగే ఆసియా కప్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే భద్రతా కారణాల తాము పాకిస్తాన్ పర్యటనకు ఆసియా కప్ కోసం వెళ్లలేము అంటూ ఇప్పటికే బీసీసీఐAsiacup{#}Cricket;World Cup;Pakistan;BCCI;vedhika;India;Sri Lankaహైబ్రిడ్ మోడల్ లో ఆసియా కప్.. క్లారిటీ వచ్చేసింది?హైబ్రిడ్ మోడల్ లో ఆసియా కప్.. క్లారిటీ వచ్చేసింది?Asiacup{#}Cricket;World Cup;Pakistan;BCCI;vedhika;India;Sri LankaThu, 13 Jul 2023 07:26:20 GMTఈ ఏడాది క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా పండగ వాతావరణం నెలకొనబోతుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. అయితే ఇక ఈ రెండు టోర్నిల విషయంలో మాత్రం గత కొంతకాలం నుంచి గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సంబంధాలపై నిషేధం కొనసాగిస్తున్న పాకిస్తాన్.. భారత్లలో ఈ రెండు టోర్నిలు జరగబోతున్నాయ్. ముఖ్యంగా పాకిస్తాన్లో జరిగే ఆసియా కప్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే భద్రతా కారణాల తాము పాకిస్తాన్ పర్యటనకు ఆసియా కప్ కోసం వెళ్లలేము అంటూ ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. తటస్థ వేదిక ఏర్పాటు చేస్తేనే ఆసియా కప్ లో కొనసాగుతాము అంటూ క్లారిటీ ఇచ్చేసింది.



 ఈ క్రమంలోనే ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు అసలు కష్టాలు మొదలయ్యాయి. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డును భారత్ ఆడే మ్యాచ్ల కోసం తటస్థ వేదికను ఏర్పాటు చేయడం కోసం ఒప్పించడానికి గత కొంతకాలం నుంచి ఆసియా క్రికెట్ కౌన్సిల్ చర్చలు జరుపుతూ ఉంది. ఈ క్రమంలోనే భారత్ ఆడే మ్యాచ్లను శ్రీలంక లేదా యూఏఈ వేదికగా నిర్వహించే అవకాశం ఉంది అంటూ ఎంతమంది క్రికెట్ విశేషములు కూడా అంచనా వేశారు. అయితే ఆసియా కప్ నిర్వహణ విషయంలో ఇక ఇటీవల ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఒక క్లారిటీకి వచ్చింది అనేది తెలుస్తుంది.  ఆసియా కప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆమోదం తెలిపిందట.



 పాకిస్తాన్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ లో భాగంగా నాన్ ఇండియా మ్యాచ్లు అన్నీ కూడా పాకిస్తాన్లో జరుగబోతున్నాయి. అంటే నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక ఈ నాలుగు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లు అన్నీ కూడా లాహోర్ వేదికగా జరగబోతున్నాయి అని చెప్పాలి. అయితే ఇక అటు ఇండియా ఆడబోయే మ్యాచ్లు మాత్రం శ్రీలంక వేదికగా జరగబోతున్నాయట. అయితే ఇండియా ఆడే మ్యాచ్ లతో పాటు మరికొన్ని మ్యాచ్లను కూడా శ్రీలంక వేదికగా నిర్వర్తించాలని.. ఇక హైబ్రిడ్ మోడల్ లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆమోదించినట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

అదానీపై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>