Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-f68029c3-8d03-4799-a1fa-6917a4c30f7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-f68029c3-8d03-4799-a1fa-6917a4c30f7a-415x250-IndiaHerald.jpgప్రేమ అనేది ఎన్నో మధురానుభూతులు సమ్మేళనం.. ఒక్కసారి ప్రేమలో పడిన తర్వాత.. ప్రేమికులు ఈ లోకాన్ని మరచిపోతూ ఉంటారు.. ఇక ఇలాంటి లవ్ స్టోరీ లతోనే ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే సినిమాల్లో లవ్ స్టోరీలు ఎంతో అందంగా ఉంటాయి. ఇవి నిజమే అనుకొని ఎంతో మంది యువతీ యువకులు ప్రేమలో పడాలని ఆశ పడుతూ ఉంటారు. కానీ ప్రేమలో పడిన తర్వాత మాత్రం ఇక ప్రాణం కంటే ప్రేమించిన వారు మోసం చేస్తే తట్టుకోలేక చివరికి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కనీ పెంచిన తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవడం లాంటివSuicide {#}Divya Bhatnagar;Tandur;Okka Kshanam;Love Story;Hyderabad;Father;prema;Parents;Love;policeప్రేమలో పడటమే.. అతని ప్రాణాలు తీసింది?ప్రేమలో పడటమే.. అతని ప్రాణాలు తీసింది?Suicide {#}Divya Bhatnagar;Tandur;Okka Kshanam;Love Story;Hyderabad;Father;prema;Parents;Love;policeThu, 13 Jul 2023 11:30:00 GMTప్రేమ అనేది ఎన్నో మధురానుభూతులు సమ్మేళనం.. ఒక్కసారి ప్రేమలో పడిన తర్వాత.. ప్రేమికులు ఈ లోకాన్ని మరచిపోతూ ఉంటారు.. ఇక ఇలాంటి లవ్ స్టోరీ లతోనే ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే సినిమాల్లో లవ్ స్టోరీలు ఎంతో అందంగా ఉంటాయి. ఇవి నిజమే అనుకొని ఎంతో మంది యువతీ యువకులు ప్రేమలో పడాలని ఆశ పడుతూ ఉంటారు. కానీ ప్రేమలో పడిన తర్వాత మాత్రం  ఇక ప్రాణం కంటే ప్రేమించిన వారు మోసం చేస్తే తట్టుకోలేక చివరికి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కనీ పెంచిన తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఇలా తమ కొడుకు బాగా చదువుకొని ప్రయోజకుడు అవుతాడు అనే తల్లిదండ్రులు భారీగా ఆశలు పెట్టుకుంటే ఇక వారి ఆశలను కొంతమంది అడియాశలు చేసేస్తున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ విఫలమైంది అన్న కారణంతో యువకుడు మనస్థాపం చెందాడు. జీవితం అక్కడితో ముగిసిపోయింది అని భావించాడు. బ్రతికి కూడా వృధా అని అనుకున్నాడు. దీంతో క్షణికావేశంలో తనువు చాలించాలి అని నిర్ణయించుకున్నాడు. చివరికి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ తన మీదే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల గురించి మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.


 ఈ విషాదకర ఘటన హైదరాబాద్ శివారులోని శంకర్పల్లి రైల్వే స్టేషన్లో వెలుగులోకి వచ్చింది. తాండూరు  అల్లాపూర్ కు చెందిన మహేష్ అనే 21 ఏళ్ళ వ్యక్తి మల్లారెడ్డి కాలేజీలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్నాడు. దివ్య అనే యువతీతో మహేష్ ప్రేమలో ఉన్నాడు. ఇటీవలే సదరు యువతీ మహేష్ను మోసం చేసింది. దీంతో ఎంతగానో మనస్థాపం చెందాడు మహేష్. ఇక ప్రేయసి మోసం చేసిన విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఇక ఇటీవల సెల్ఫీ వీడియో తీసి తల్లిదండ్రులకు పంపాడు. నన్ను క్షమించండి అమ్మ నాన్న అంటూ రైలు పట్టాలపై తలపెట్టి చివరికి ప్రాణాలు వదిలాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ట్రోలర్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన యంగ్ హీరో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>