PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangsana-komatireddy-revanthe1f9034e-0507-4bd6-9a4f-4c51269d9818-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangsana-komatireddy-revanthe1f9034e-0507-4bd6-9a4f-4c51269d9818-415x250-IndiaHerald.jpgరైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతామని కోమటిరెడ్డి ప్రకటించారు. పీసీసీ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన రేవంతే సర్వం కాదని పీసీసీ అధ్యక్షుడి పోస్టన్నది చాలా చిన్నదన్నారు. కోమటిరెడ్డి చెప్పిందే వాస్తవమైతే మరి పీసీసీ అధ్యక్షుడు కాని కోమటిరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తామని ఎలా చెబుతున్నారు ? అసలు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభల్లో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్ళిన రేవంత్ కు తెలంగాణాలో ఉచిత విద్యుత్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ? telangsana komatireddy revanth{#}electricity;Siva Kumar;revanth;Hyderabad;Congress;CM;Party;American Samoa;Teluguహైదరాబాద్ : వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ మొదలైందా ?హైదరాబాద్ : వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ మొదలైందా ?telangsana komatireddy revanth{#}electricity;Siva Kumar;revanth;Hyderabad;Congress;CM;Party;American Samoa;TeluguWed, 12 Jul 2023 07:00:00 GMT


ఇద్దరు సీనియర్ నేతలే అయినా ఇద్దరికీ ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. అందుకనే బహిరంగంగా ఒకరి వ్యాఖ్యలను మరొకరు ఖండించుకుంటు చులకనైపోతున్నారు. వీళ్ళిద్దరు చులకనైపోయినా పర్వాలేదు పార్టీ పరువును రోడ్డుమీదకు తీసుకొచ్చి పడేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంట అమెరికాలో రేవంత్ మాట్లాడుతు రైతులకు ఉచిత విద్యుత్ అవసరంలేదని ప్రకటించారు. వెంటనే దానికి భిన్నంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతు గతంలో ఉచిత విద్యుత్ ఇవ్వటానికి తామెంత కష్టపడ్డమో రేవంత్ కు తెలీదంటు ఫైరయ్యారు.





రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతామని కోమటిరెడ్డి ప్రకటించారు. పీసీసీ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన రేవంతే సర్వం కాదని  పీసీసీ అధ్యక్షుడి పోస్టన్నది చాలా చిన్నదన్నారు. కోమటిరెడ్డి చెప్పిందే వాస్తవమైతే మరి పీసీసీ అధ్యక్షుడు కాని కోమటిరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తామని ఎలా చెబుతున్నారు ? అసలు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభల్లో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్ళిన రేవంత్ కు తెలంగాణాలో ఉచిత విద్యుత్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ?





అమెరికాకు వెళ్ళిన వ్యక్తి అక్కడికి తగ్గట్లుగా మాట్లాడాలంతే. అలాగే సీతక్కనే సీఎంను చేస్తామని మరో ప్రకటనచేశారు. సీతక్కను సీఎం చేసే అధికారం రేవంత్ కు ఎక్కడుంది. రేపటిరోజున రేవంత్ పరిస్ధితి ఏమిటో రేవంత్ కే తెలీదు. అలాంటిది ఎప్పుడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే సీతక్కును సీఎంను చేస్తామని రేవంత్ ప్రకటించటమే ఓవర్ యాక్షన్ చేసినట్లుంది.





రేవంత్ కు ఇంకా అధిష్టానం ఆలోచనలు అర్ధమైనట్లు లేదు. పీసీసీ అధ్యక్షుడిగా ఎంతటి బలమైన నేతున్నా అవసరం లేదనుకుంటే ఒకే నిముషంలో తీసవతల పడేస్తుంది. కర్నాటకలో పీసీసీ అధ్క్షుడు డీకే శివకుమార్ విషయంలో ఏమి జరిగిందో చూసి కూడా రేవంత్ కు బుద్ధి వచ్చినట్లు లేదు. ఎక్కడో రేవంత్ అన్న వ్యాఖ్యలను పట్టుకుని హైదరాబాద్ లో కోమటిరెడ్డి కంపు కంపు చేసేస్తున్నారు. నిజానికి అమెరికాలో రేవంత్ చేసిందే ఓవరాక్షన్ అనుకుంటే ఇక్కడ కోమటిరెడ్డి చేస్తున్నదీ ఓవర్ యాక్షనే. వీళ్ళిద్దరు మారరంతే అని అనుకుంటున్నారు మిగిలిన నేతలు.










RRR Telugu Movie Review Rating

12 రోజుల్లో "సామజవరగమన" సినిమాకు వరల్డ్ వైడ్ గా దక్కిన కలెక్షన్లు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>