SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ind-vs-wifd95830a-e46f-48b6-9694-f47bc0d9e640-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ind-vs-wifd95830a-e46f-48b6-9694-f47bc0d9e640-415x250-IndiaHerald.jpgగడిచిన రెండు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లలో రన్నరప్‌తో సరిపెట్టుకున్న టీమ్‌ఇండియా.. 2023-25 సర్కిల్‌ స్టార్ట్ చేసేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా బుధవారం నాటి నుంచి వెస్టిండీస్‌తో రోహిత్‌ సేన మొదటి టెస్టు ఆడనుంది. అటు కుర్రాళ్లు ఇంకా ఇటు యువరక్తంతో నిండి ఉన్న భారత జట్టుకు.. అనుభవలేమితో కూడి ఉన్న వెస్టిండీస్‌ టీం ఏమాత్రం పోటీనిస్తుందో అనే విషయం ఆసక్తి కరంగా ఉంది.వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలై నెల రోజుల విశ్రాంతి తరువాత భారత జట్టు తిరిగి బIND vs WI{#}VIRAT KOHLI;Ravindra Jadeja;Australia;wednesday;Army;Kurradu;Yashasvi Jaiswal;Yevaru;IndiaIND vs WI: నేటి నుంచి ఫస్ట్ టెస్ట్.. గెలుపెవరిదో?IND vs WI: నేటి నుంచి ఫస్ట్ టెస్ట్.. గెలుపెవరిదో?IND vs WI{#}VIRAT KOHLI;Ravindra Jadeja;Australia;wednesday;Army;Kurradu;Yashasvi Jaiswal;Yevaru;IndiaWed, 12 Jul 2023 10:11:24 GMTగడిచిన రెండు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లలో రన్నరప్‌తో సరిపెట్టుకున్న టీమ్‌ఇండియా.. 2023-25 సర్కిల్‌ స్టార్ట్ చేసేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా బుధవారం నాటి నుంచి వెస్టిండీస్‌తో రోహిత్‌ సేన మొదటి టెస్టు ఆడనుంది. అటు కుర్రాళ్లు ఇంకా ఇటు యువరక్తంతో నిండి ఉన్న భారత జట్టుకు.. అనుభవలేమితో కూడి ఉన్న వెస్టిండీస్‌ టీం ఏమాత్రం పోటీనిస్తుందో అనే విషయం ఆసక్తి కరంగా ఉంది.వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలై నెల రోజుల విశ్రాంతి తరువాత భారత జట్టు తిరిగి బరిలోకి దిగేందుకు రెడీ అయ్యింది. వెస్టిండీస్‌ టూర్‌లో భాగంగా బుధవారం నాటి నుంచి ఇండియా తొలి టెస్టు ఆడనుంది.ఇక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనింగ్‌ చేయనుండగా.. సాధారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసే చతేశ్వర్‌ పుజారాపై వేటు పడటంతో అతడి స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. యంగ్ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ మొదటి సారి టెస్టు జట్టుకు ఎంపిక కాగా.. వీరిలో యశస్వికి ఫైనల్ జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఇక నాలుగో స్థానంలో విరాట్‌ కోహ్లీ ఇంకా ఆ తర్వాత అజింక్యా రహానే బ్యాటింగ్‌కు రానున్నారు. వికెట్‌ కీపర్‌గా ఆంధ్ర కుర్రాడు అయిన శ్రీకర్‌ భరత్‌తో ఇషాన్‌ కిషన్‌ పోటీపడుతున్నాడు.


ఆస్ట్రేలియాతో సిరీస్‌లో బరిలోకి దిగిన భరత్‌ వికెట్ల వెనుక వావ్  అనిపించుకున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఇక మరోసారి భరత్‌పైనే విశ్వాసం ఉంచే అవకాశం ఉంది. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా ఇంకా శార్దూల్‌ ఠాకూర్‌ ఆల్‌రౌండర్ల కోటాలో చోటు దక్కించుకోనుండగా.. ప్రధాన పేసర్‌ అయిన హైదరాబాదీ మహమ్మద్‌ సిరాజ్‌తో పాటు కొత్త బంతిని పంచుకునేది ఎవరో ఇంకా తేలాల్సి ఉంది.నవ్‌దీప్‌ సైనీ, జైదేవ్‌ ఉనాద్కట్‌ ఇంకా ముఖేశ్‌ కుమార్‌.. ఈ ప్లేస్‌ కోసం బాగా పోటీపడుతుండగా.. అయితే వీరిలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రం ముఖేశ్‌ వైపు మొగ్గుచూపేలా ఉంది.మరోవైపు ఫస్ట్ టెస్టు కోసం వెస్టిండీస్‌ 13 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో ఎక్కువ శాతం కొత్త ప్లేయర్లకు ఛాన్స్ దక్కింది.అంచనా ప్రకారం జట్ల విషయానికి వస్తే.. భారత్‌:రోహిత్‌ (కెప్టెన్‌), గిల్‌, యశస్వి, కోహ్లీ, రహానే, భరత్‌, జడేజా, అశ్విన్‌, శార్దూల్‌, సిరాజ్‌ ఇంకా ముఖేశ్‌ ఆడనున్నారు.వెస్టిండీస్‌:బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), టగ్‌నరైన్‌ చందర్‌పాల్‌, రైమాన్‌, బ్లాక్‌వుడ్‌, చేజ్‌, జోషువా, రాకీమ్‌ కార్న్‌వాల్‌, హోల్డర్‌, గాబ్రియల్‌, అల్జారీ జోసెఫ్‌ ఇంకా కిమారో రోచ్‌ ఆడనున్నారు.



RRR Telugu Movie Review Rating

సాయి పల్లవి పై దారుణమైన కామెంట్స్ చేసిన నాని..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>