MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgగతవారం విడుదలైన ‘రంగబలి’ ఫ్లాప్ గా మారడంతో బాక్సాఫీస్ వెలవెల పోయింది. అయితే ఈవారం పరిస్థితి విభిన్నంగా ఉండవచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈవారం నాలుగు సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ ఆసినిమాలలో ఆనంద దేవరకొండ ‘బేబీ’ పై మాత్రమే అంచనాలు ఉన్నాయి.యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన పాటలు ట్రైలర్ బాగా హిట్ టాక్ రావడంతో ఈమూవీ ఊహించని హిట్ గా మారుతుంది అన్న అంచనాలు వస్తున్నాయి. అయితే ఈ చిన్న సినిమా ప్ర పంచవ్యాప్తంగా విడుదల అవుతున్న భారీ హాలీవుడ్ ANAND DEVARAKONDA{#}shankar;udhayanidhi stalin;Hollywood;Industry;Thriller;Winner;Darsakudu;Tom Banton;Tom Hooper;Devarakonda;Love Story;Director;Chitram;Cinemaహాలీవుడ్ మ్యానియాను బేబీ తట్టుగోగలదా !హాలీవుడ్ మ్యానియాను బేబీ తట్టుగోగలదా !ANAND DEVARAKONDA{#}shankar;udhayanidhi stalin;Hollywood;Industry;Thriller;Winner;Darsakudu;Tom Banton;Tom Hooper;Devarakonda;Love Story;Director;Chitram;CinemaWed, 12 Jul 2023 09:00:00 GMTగతవారం విడుదలైన ‘రంగబలి’ ఫ్లాప్ గా మారడంతో బాక్సాఫీస్ వెలవెల పోయింది. అయితే ఈవారం పరిస్థితి విభిన్నంగా ఉండవచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈవారం నాలుగు సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ ఆసినిమాలలో ఆనంద దేవరకొండ ‘బేబీ’ పై మాత్రమే అంచనాలు ఉన్నాయి.




యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన పాటలు ట్రైలర్ బాగా హిట్ టాక్ రావడంతో ఈమూవీ ఊహించని హిట్ గా మారుతుంది అన్న అంచనాలు వస్తున్నాయి. అయితే ఈ చిన్న సినిమా  ప్ర పంచవ్యాప్తంగా విడుదల అవుతున్న భారీ హాలీవుడ్ మూవీ ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకొనింగ్’ పార్ట్-1 తో పోటీగా విడుదల అవుతోంది. ఈసినిమా పై ప్రేక్షకులలో విపరీతమైన మ్యానియా ఉండటంతో ఈమూవీ టిక్కెట్స్ అడ్వాన్స్ బుకింగ్ లో హాట్ కేక్స్ లా అమ్మకం జరుగుతోంది.


మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇది కంప్లీట్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ. అయితే ఒక చిన్న లవ్ స్టోరీ సినిమా ఇంత భారీ యాక్షన్ మూవీతో పోటీపడి విజయం సాధించగలుగుతుందా అన్న సందేహాలు చాలామందికి ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో పోటీగా ‘మహావీరుడు’ అనే మూవీ వస్తోంది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం ఇది. దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా ఈమూవీలో నటిస్తోంది. ఈసినిమాలతో పాటు ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూడ విడుదల అవుతోంది. ఈమూవీ విడుదలకు ముందే వివాదాలకు చిరునామాగా మారింది. టామ్ క్రూస్ మ్యానియా ముందు ఈ చిన్న సినిమాలలో ఏ చిన్న సినిమా విజయం సాధించినా అది సంచలనమే అవుతుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న అంచనాల ప్రకారం ఈ అవకాశం ఆనంద దేవరకొండకు కలిగే ఆస్కారం ఉంది అంటున్నారు. దీనితో ఈవారం విజేత ఎవరు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో అనేక చర్చలు మొదలయ్యాయి..



RRR Telugu Movie Review Rating

సాయి పల్లవి పై దారుణమైన కామెంట్స్ చేసిన నాని..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>