PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/why-pawan-took-volunteers-for-varahi-yatra22168c22-0f54-4200-8d8f-916946843a22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/why-pawan-took-volunteers-for-varahi-yatra22168c22-0f54-4200-8d8f-916946843a22-415x250-IndiaHerald.jpgఇదంతా గమనించిన తర్వాత పవన్లో మార్పొ వస్తుందని అనుకుంటే మరింతగా రెచ్చిపోతున్నారు. తాను రెచ్చిపోవటమే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాలంటీర్లను మరింతగా రెచ్చగొడుతున్నారు. రు. 5 వేలిచ్చి వాలంటీర్ల పేరుతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటున్నదని, ఊడిగం చేయింకుకుంటు వాలంటీర్ల బతుకులను ప్రభుత్వం నాశనంచేసిందని, ఉద్యోగాల ఊసెత్తకుండా 4 ఏళ్ళు నాశనంచేసింది వాస్తవం కాదా అంటు నిలదీశారు. వాలంటీర్ల ఉద్యోగాలతో ఎవరి బతుకులు మారదని మండిపోయారు. pawan janasenna varahi{#}twitter;monday;Janasena;sunday;Government;Pawan Kalyanగోదావరి : వాలంటీర్లను పవన్ తీసుకోవచ్చా ?గోదావరి : వాలంటీర్లను పవన్ తీసుకోవచ్చా ?pawan janasenna varahi{#}twitter;monday;Janasena;sunday;Government;Pawan KalyanWed, 12 Jul 2023 03:00:00 GMT


ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వాలంటీర్లుగా పనిచేస్తున్న వ్యవస్ధపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంతగా విషంచిమ్ముతున్నారో అందరు చూస్తున్నదే. ఏలూరులో మాట్లాడుతు వాలంటీర్ల ద్వారానే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని పవన్ చేసిన ఆరోపణ సంచలనంగా మారింది. ఆదివారం రాత్రి పవన్ చేసిన ఆరోపణలకు సోమవారం ఉదయం నుండి వాలంటీర్లు మండిపోతున్నారు. చాలాచోట్ల పవన్ దిష్టిబొమ్మలను తగలబెట్టి, చెప్పులతో కొట్టి, సోషల్ మీడియాలో డైరెక్టుగా పవన్ని అమ్మనాబూతులు తిడుతు వార్నింగులు ఇస్తున్నారు.





ఇదంతా గమనించిన తర్వాత పవన్లో మార్పొ వస్తుందని అనుకుంటే మరింతగా రెచ్చిపోతున్నారు. తాను రెచ్చిపోవటమే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాలంటీర్లను మరింతగా రెచ్చగొడుతున్నారు. రు. 5 వేలిచ్చి వాలంటీర్ల పేరుతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటున్నదని, ఊడిగం చేయింకుకుంటు వాలంటీర్ల బతుకులను ప్రభుత్వం నాశనంచేసిందని, ఉద్యోగాల ఊసెత్తకుండా 4 ఏళ్ళు నాశనంచేసింది వాస్తవం కాదా అంటు నిలదీశారు. వాలంటీర్ల ఉద్యోగాలతో ఎవరి బతుకులు మారదని మండిపోయారు.





ఒకసారి పవన్ చెప్పింది కూడా నిజమే అనుకుందాం. మరి వారాహియాత్ర మొదలు పెట్టకముందు నుండి ట్విట్టర్ ఖాతాలో వాలంటీర్లుగా పనిచేసేందుకు యూత్ కావాలని పదేపదే పవన్ ఎందుకని విజ్ఞప్తిచేశారు. తన విజ్ఞప్తికి స్పందించి వాలంటీర్లుగా పనిచేసేందుకు యూత్ ముందుకొచ్చినట్లు పవన్ ప్రకటించారు. వాలంటీర్ల సేవపేరుతో జనసేన పార్టీలోను, వారాహియాత్రలోను పనిచేయించుకుంటున్న యూత్ భవిష్యత్తును పవన్ నాశనం చేస్తునట్లు కాదా ? ఇంకా ప్రభుత్వమన్నా ప్రతి వాలంటీర్ కు రు. 5 వేల గౌరవవేతనం ఇస్తోంది. ఊరికే కూర్చోబెట్టి నిరుద్యోగ భృతిపేరుతో డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి బాధ్యతలు అప్పగించి రు. 5 వేలు చెల్లిస్తోంది.





మరి జనసేనకు, వారాహియాత్రలో వాలంటీర్లుగా పనిచేసినందుకు యూత్ కు పవన్ ఎంత డబ్బులు చెల్తిస్తున్నారు ? డబ్బులు ఇవ్వకుండానే వాలంటీర్లతో పనిచేయించుకోవటం పవన్ కు ఊడిగం చేయించుకుంటున్నట్లు అనిపించలేదా ?  తన పార్టీకి వాలంటీర్లుగా యూత్ సేవలను ఉపయోగించుకుంటే తప్పులేనిది ప్రభుత్వం తరపున వాలంటీర్లుగా యూత్ పనిచేస్తుంటే  పవన్ ఎందుకు తప్పుపడుతున్నారు ? అంటే, వాలంటీర్ల వ్యవస్ధ వల్ల ప్రతిపక్షాలకు కోలుకోలేని దెబ్బ పడుతుందని పవన్ భయపడుతున్నట్లు అర్ధమవుతోంది.  వాలంటీర్ల వ్యవస్ధపై తాను మాట్లాడలేని మాటలను చంద్రబాబునాయుడే తెరవెనుకుండి పవన్ తో మాట్లాడిస్తున్నారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.




RRR Telugu Movie Review Rating

12 రోజుల్లో "సామజవరగమన" సినిమాకు వరల్డ్ వైడ్ గా దక్కిన కలెక్షన్లు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>