Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral77a0c30f-b43b-4440-8b18-028ad3b49aff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral77a0c30f-b43b-4440-8b18-028ad3b49aff-415x250-IndiaHerald.jpgవైరల్: విమానంలో విండో సీటు కోసం కొట్లాట... నవ్వుకుంటున్న నెటిజనం! సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ మూలనో ఇలాంటి ఫన్నీ వీడియోలు ఎవరో ఒకరు షేర్ చేస్తూ నెటిజన్లను ఆనందింపజేస్తూ వుంటారు. గత కొన్నాళ్లుగా చూసుకుంటే బస్సులో విండో సీట్ కోసం కొట్టుకున్నట్టు విమానాల్లో కూడా విండో సీట్ విషయమై తరచూ గొడవలు జరుగుతుండడం మనం చూసాం. ఇలా ఇలాంటి ఘటనకు సంబందించిన వీడియోలు చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే విమానంలో ప్రయాణించేవారు దాదాపుగా చదువుకున్నవారే. అలాంటివారు ఒక్కోసారి విచక్షణా జ్ఞానం కోల్పోయి మరీ కొటViral{#}london;Manam;mediaవైరల్: విమానంలో విండో సీటు కోసం కొట్లాట... నవ్వుకుంటున్న నెటిజనం!వైరల్: విమానంలో విండో సీటు కోసం కొట్లాట... నవ్వుకుంటున్న నెటిజనం!Viral{#}london;Manam;mediaTue, 11 Jul 2023 13:15:00 GMT

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ మూలనో ఇలాంటి ఫన్నీ వీడియోలు ఎవరో ఒకరు షేర్ చేస్తూ నెటిజన్లను ఆనందింపజేస్తూ వుంటారు. గత కొన్నాళ్లుగా చూసుకుంటే బస్సులో విండో సీట్ కోసం కొట్టుకున్నట్టు విమానాల్లో కూడా విండో సీట్ విషయమై తరచూ గొడవలు జరుగుతుండడం మనం చూసాం. ఇలా ఇలాంటి ఘటనకు సంబందించిన వీడియోలు చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే విమానంలో ప్రయాణించేవారు దాదాపుగా చదువుకున్నవారే. అలాంటివారు ఒక్కోసారి విచక్షణా జ్ఞానం కోల్పోయి మరీ కొట్టుకున్న పరిస్థితులు ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

తాజాగా మాల్టా నుంచి లండన్ వెళ్తున్న ర్యాన్ ఎయిర్ విమానంలో విమానం విండో సీటు కోసం ఇద్దరు ప్రయాణికులు కొట్టుకున్నారు. మాల్టా నుంచి లండన్ వెళ్లడానికి ర్యాన్ ఎయిర్ విమానం సిద్ధంగా ఉంది. దాంతో ఒక్కొక్కరిగా ప్రయాణికులు విమానంలోకి చేరుకొని తమ సీట్లలో తాము కూర్చొంటున్నారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు వచ్చి తన సీటులో కూర్చున్నాడు. అయితే అతడి పక్కన ఉన్న విండో సీటు సీటులో కూర్చునేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించాడు. అయితే నడవ సీటులో కూర్చున్న వ్యక్తి విండో సీటు ప్రయాణికుడిని కిటికీ వైపుకి వెళ్లడానికి అనుమతించలేదనేది అసలు కారణం.

దీని గురించే ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కొద్దిసేపటికే ఈ సీటింగ్ ఏర్పాటుపై వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ముందుగా కొంత మంది ప్రయాణికులు వారిద్దరినీ శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకపోవడంతో తర్వాత సిబ్బంది కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ గొడవలో ఇద్దరూ ఒకరినొకరు చాలా దూషించుకుంటూ కొట్టుకున్నట్టు విజువల్స్ మనకు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. విమానంలో గొడవ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. ఇక అక్కడ కూడా మొదలుపెట్టారంట్రా? అంటూ ఈ గొడవపై నెటిజన్లు వ్యంగ్యంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
">



RRR Telugu Movie Review Rating

వేదాంత స్పూర్తి తో పబ్ సాంగ్ !

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>