EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/breaking-newse43de1b8-015d-4b24-91d7-cd6d3cfd306c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/breaking-newse43de1b8-015d-4b24-91d7-cd6d3cfd306c-415x250-IndiaHerald.jpgమీడియా అనేది నిష్పాక్షికంగా, నిక్కచ్చిగా నిజం చెప్పే సాధనం లా ఉండాలి. కానీ పలు పార్టీల పల్లకిని మోసే వాహకంలా ఉండకూడదు. నిజం అనేది పట్టుకుంటే కాలుతుందని వదిలివేయడం మీడియా వ్యక్తులు చేయాల్సిన పని కాదు. ఇప్పుడున్న స్పీడ్ యుగంలో చాలా వరకు రాజకీయ వార్తల్లో ఫేక్ న్యూస్ లు ఎక్కువవుతున్నట్లుగా తెలుస్తుంది. తర్వాత ఆ న్యూస్ లు ఫేక్ అని తెలిసినా అప్పుడు నెపం పక్క వాళ్ళ మీదకి నెట్టేస్తారు కానీ తాము మాత్రం తప్పుడు వార్త ఇచ్చినట్లుగా ఒప్పుకోరు అని అంటున్నారు కొంత మంది. గతంలో టీవీ9, ఈటీవీ న్యూస్ వచ్చిన కొత్BREAKING NEWS{#}Telugu Desam Party;Cheque;TV9;Nijam;mediaఆ బ్రేకింగ్‌ న్యూస్‌లలో వాస్తవం ఎంత?ఆ బ్రేకింగ్‌ న్యూస్‌లలో వాస్తవం ఎంత?BREAKING NEWS{#}Telugu Desam Party;Cheque;TV9;Nijam;mediaTue, 11 Jul 2023 05:00:00 GMTమీడియా అనేది నిష్పాక్షికంగా, నిక్కచ్చిగా నిజం చెప్పే సాధనం లా ఉండాలి. కానీ పలు పార్టీల పల్లకిని మోసే వాహకంలా ఉండకూడదు. నిజం అనేది పట్టుకుంటే కాలుతుందని వదిలివేయడం మీడియా వ్యక్తులు చేయాల్సిన పని కాదు. ఇప్పుడున్న స్పీడ్ యుగంలో చాలా వరకు రాజకీయ వార్తల్లో ఫేక్ న్యూస్ లు ఎక్కువవుతున్నట్లుగా తెలుస్తుంది. తర్వాత ఆ న్యూస్ లు ఫేక్ అని తెలిసినా  అప్పుడు నెపం పక్క వాళ్ళ మీదకి నెట్టేస్తారు కానీ తాము మాత్రం తప్పుడు వార్త ఇచ్చినట్లుగా ఒప్పుకోరు అని అంటున్నారు కొంత మంది.


గతంలో టీవీ9, ఈటీవీ న్యూస్ వచ్చిన కొత్తలో అవి రెండు పోటాపోటీగా వార్తలను ప్రజెంట్ చేసుకుంటూ వచ్చేవి. అయితే అప్పుడు వీళ్ల సిద్ధాంతం ఏమిటంటే వార్తల్లో ఏవైనా స్క్రోలింగ్ వేసేటప్పుడు ఆ వార్తలో ఎంత నిజం ఉందో తెలుసుకొని వేయాలని అనుకునేవారు. ఈటీవీ ఈ విషయంలో ఈ సిద్ధాంతాన్నే బలంగా అనుసరించేది. అందుకే టీవీ9 న్యూస్ కన్నా, ఈటీవీ న్యూస్ కొంత లేట్ అయ్యేదని అంటారు తెలిసినవారు. కానీ.. ఈటీవీలో వచ్చిందంటే అది నిజమే..ఇక తిరుగులేదు అన్నట్టు ఉండేది.


అందుకే టీవీ9 త్వరగా పాపులర్ అయిందని అంటుంటారు వాళ్ళు. ఈటీవీ న్యూస్ కి గ్రౌండ్ లెవెల్ లో మంచి నెట్వర్క్ ఉంటుంది. అయితే ఒక వార్తని వీళ్ళు క్రాస్ చెక్ చేసుకుని ప్రజెంట్ చేసేసరికి లేట్ అవుతూ ఉండేదట. అందుకే ఎన్ని ఛానళ్లలో స్క్రోలింగ్‌ వచ్చినా.. ఈటీవీలో వస్తేనే దాన్ని కన్‌ఫామ్‌ చేసుకునేవాళ్లు.. ఇప్పుడు సోషల్ మీడియా కూడా  ఊపు అందుకోవడంతో ఒక వార్తలోని నిజానిజాలను పట్టించుకోకుండానే ప్రజెంట్ చేసేస్తున్నారు. ఎన్డీఏ తాజాగా తెలుగుదేశం ఇంకా వైఎస్ఆర్సిపి పార్టీలను ఆహ్వానించిందనే వార్త వచ్చింది.


అయితే దీనిపై గతంలో జర్నలిస్టుగా కూడా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డిని అడిగితే, మీరు వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది తెలుసుకోవడం లేదని అన్నారట ఆయన. తెలుగుదేశం అనుకూల మీడియా ఏ వార్తను ప్రజెంట్ చేస్తే దాన్నే బ్లైండ్ గా మిగిలిన వారు కూడా ప్రజెంట్ చేస్తున్నారు అంటూ  మీడియా వాళ్లకి క్లాస్ పీకారట ఆయన.



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో బోర్ కొట్టి అలాంటి పనులు చేస్తున్న అనసూయ..!?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>