Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chamkeela-from-dasara-rustic-melodious-track293f1824-292d-487a-bcf5-c3a72804c464-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chamkeela-from-dasara-rustic-melodious-track293f1824-292d-487a-bcf5-c3a72804c464-415x250-IndiaHerald.jpgన్యాచురల్ స్టార్ నాని ఈ ఇయర్ మొదట్లోనే దసరా అంటూ ఒక ఊర మాస్ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇదివరకు ఎప్పుడూ నాని ఇలాంటి ఊర మాస్ పాత్ర చేయలేదు. కెరీర్ లో ఫస్ట్ టైం మాస్ రోల్ అది కూడా ఒక కొత్త డైరెక్టర్ మీద నమ్మకంతో నాని దసరా చేశాడు. అయితే నాని నమ్మకాన్ని నిలబెట్టుకునేలా దసరా దుమ్ముదులిపేసింది. సినిమా తో నాని తన బాక్సాఫీ స్టామినాNani{#}Jersey;Hello;Shruti Haasan;Nani;Mass;Blockbuster hit;srikanth;kirti;Mahanati;Dussehra;Vijayadashami;Heroine;Director;Cinemaసెంటిమెంట్ తో నాని.. దసరా తర్వాత బిగ్ రిస్క్..!సెంటిమెంట్ తో నాని.. దసరా తర్వాత బిగ్ రిస్క్..!Nani{#}Jersey;Hello;Shruti Haasan;Nani;Mass;Blockbuster hit;srikanth;kirti;Mahanati;Dussehra;Vijayadashami;Heroine;Director;CinemaTue, 11 Jul 2023 13:20:00 GMTన్యాచురల్ స్టార్ నాని ఈ ఇయర్ మొదట్లోనే దసరా అంటూ ఒక ఊర మాస్ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇదివరకు ఎప్పుడూ నాని ఇలాంటి ఊర మాస్ పాత్ర చేయలేదు. కెరీర్ లో ఫస్ట్ టైం మాస్ రోల్ అది కూడా ఒక కొత్త డైరెక్టర్ మీద నమ్మకంతో నాని దసరా చేశాడు. అయితే నాని నమ్మకాన్ని నిలబెట్టుకునేలా దసరా దుమ్ముదులిపేసింది. సినిమా తో నాని తన బాక్సాఫీ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేశాడు. నాని కి కూడా సరైన కథ పడితే ఎలా విజృంభిస్తాడో దసరా ప్రూవ్ చేసింది. ఈ సినిమాలో నానికి ఈక్వల్ గా మరోసారి తన నటనతో మెప్పించి మహానటి అనిపించుకుంది కీర్తి సురేష్.

మొదటి సినిమానే శ్రీకాంత్ ఓదెల తన టాలెంట్ చూపించాడు. దసరా హిట్ తర్వాత నాని మళ్లీ అదే మార్క్ మాస్ సినిమా చేస్తాడని అనుకోగా తిరిగి తన రెగ్యులర్ ఫార్మెట్ లో సినిమా చేస్తున్నాడు. శౌర్యువ్ అనే కొత్త దర్శకుడితో నాని సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వైరా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. సినిమా లో మృణాల్ ఠాకూర్, శృతి హాసన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాలో నాని ఫాదర్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తుంది. నాని 30వ సినిమాలో ఒక చిన్న పాప పాత్ర కూడా హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది.

నాని 30వ సినిమా కు టైటిల్ గా హాయ్ నాన్న, హాయ్ డాడీ, హలో డాడీ, హలో నాన్న టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. వీటిలో ఏదో ఒకటి త్వరలో ఫైనలైజ్ చేస్తారని తెలుస్తుంది. జెర్సీ సినిమాలో కూడా నాని తండ్రి పాత్రలో కనిపించాడు. ఇప్పుడు మరోసారి అలాంటి సెంటిమెంట్ సినిమాతోనే వస్తున్నాడు. దసరా తర్వాత ఇలాంటి సినిమా రిస్క్ అని తెలిసినా కథ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందని నాని నమ్మడం వల్ల ఈ సినిమా చేస్తున్నాడు. నాని 30వ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ ఫిక్స్ చేశారు.





RRR Telugu Movie Review Rating

వేదాంత స్పూర్తి తో పబ్ సాంగ్ !

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>