DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ukrainee32204d-7674-41df-bf89-f6d23d87bee8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ukrainee32204d-7674-41df-bf89-f6d23d87bee8-415x250-IndiaHerald.jpgఉక్రెయిన్ దేశం ఇండియాపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఒక విషయమైతే రెండు ఉక్రెయిన్ అడుగుతున్న ఆయుధ సామగ్రి ఇవ్వకపోవడం. భారత్ రష్యాకు కూడా ఆయుధ సామగ్రి సాయం చేయడం లేదు. కానీ ఆయిల్ కొని ఆర్థికంగా లాభం చేకూరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా రష్యాకు సంబంధించిన ఎస్ఎఫ్బీ రక్షణ వ్యవహారాలకు సంబంధించిన కుట్రను ఉక్రెయిన్ బయట పెట్టింది. యుద్ధం ప్రారంభమయ్యాక అమెరికా, యూరప్ దేశాలకు చెందిన అనేక సంస్థలు రష్యా నుంచి తరలిపోయాయి. నిబంధనల ప్రకారం అవి వెళ్లిపోవడంతో రష్యాలో చైనా, ఇండియాకUKRAIN{#}Russia;Ukraine;Sucide;oil;Europe countries;war;India;Industriesభారత సంస్థలపై ఉక్రెయిన్ కుట్ర పన్నుతోందా?భారత సంస్థలపై ఉక్రెయిన్ కుట్ర పన్నుతోందా?UKRAIN{#}Russia;Ukraine;Sucide;oil;Europe countries;war;India;IndustriesTue, 11 Jul 2023 13:00:00 GMTఉక్రెయిన్ దేశం ఇండియాపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఒక విషయమైతే రెండు ఉక్రెయిన్ అడుగుతున్న ఆయుధ సామగ్రి ఇవ్వకపోవడం. భారత్ రష్యాకు కూడా ఆయుధ సామగ్రి సాయం చేయడం లేదు. కానీ ఆయిల్ కొని ఆర్థికంగా లాభం చేకూరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా రష్యాకు సంబంధించిన ఎస్ఎఫ్బీ రక్షణ వ్యవహారాలకు సంబంధించిన కుట్రను ఉక్రెయిన్ బయట పెట్టింది.


యుద్ధం ప్రారంభమయ్యాక అమెరికా, యూరప్ దేశాలకు చెందిన అనేక సంస్థలు రష్యా నుంచి తరలిపోయాయి. నిబంధనల ప్రకారం అవి వెళ్లిపోవడంతో రష్యాలో చైనా, ఇండియాకు చెందిన పరిశ్రమలు పెట్టడం ప్రారంభించారు. పరిశ్రమలు, వ్యాపార వాణిజ్య సంస్థలు విరివిగా పెడుతున్నారు. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలు ఎక్కడెక్కడయితే వదిలిపెట్టి వెళ్లిపోయారో.. ఆ ప్రాంతాల్లో పూర్తిగా చైనా, ఇండియా సంస్థలు వెలుస్తున్నాయి.


అయితే రష్యాలో నూతనంగా పెడుతున్న వ్యాపార సంస్థలపై ఉక్రెయిన్ సూసైడ్ బాంబులతో విరుచుకుపడాలని ప్రయత్నాలు చేస్తోందని రష్యా నిఘా వర్గాలు పసి గట్టాయి. ఇందుకు సంబంధించిన సూసైడ్ బాంబర్ ఒకరిని అరెస్టు చేశారు. రష్యా సెక్యూరిటీ విభాగం వెల్లడించిన విషయాలు పరిశీలిస్తే .. రష్యా ఆధీనంలో ఉన్న ఒక ఐలాండ్ ప్రాంతంలో చైనా, జపాన్, ఇండియాకు చెందిన పవర్ ప్లాంట్ లు ఉన్నాయని... వాటిని ధ్వంసం చేసేందుకు కుట్ర పన్నారు.


ముఖ్యంగా ఆ ప్రాంతంలో జపాన్, ఇండియా కు చెందిన పరిశ్రమలే ఎక్కువగా ఉన్నాయి. అందులో ఇండియాకు చెందిన పవర్ ప్లాంట్ లపై ఉక్రెయిన్ దాడి చేయాలని ప్లాన్ వేసినట్లు వెల్లడైంది. యుద్ధంలో ఇంతవరకు రెండు దేశాలు యుద్ధ విమానాలు, డ్రోన్లు, సైనికులు, ఆయుధాలతో ప్రస్తుతం వాటిని పక్కనబెట్టి రష్యాకు ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో ఉక్రెయిన్ వాటిని టార్గెట్ చేస్తోంది. ఇలా చేయడం వల్ల రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా చూడాలి.



RRR Telugu Movie Review Rating

వేదాంత స్పూర్తి తో పబ్ సాంగ్ !

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>