Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/business-problem-for-superstar-movie3d372617-11ac-4e08-b086-bc742984fb59-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/business-problem-for-superstar-movie3d372617-11ac-4e08-b086-bc742984fb59-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనికాంత్ అంటే ఒకప్పుడు తెలుగులో ఒక రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆయన స్టైల్, లుక్ ఇలా అన్నిటికీ తమిళ ఆడియన్స్ తో ఈక్వల్ గా రజని సినిమాలను తెలుగులో ఎంకరేజ్ చేశారు. రజని సినిమా వస్తుంది అంటే తెలుగు స్టార్ హీరోలు సైతం కంగారు పడే పరిస్థితి కూడా కొన్నిసార్లు ఏర్పడింది. ఇక్కడ సినిమాలకు పోటీగా రజని సినిమాలు రిలీజై తెలుగు సినిమాలకు ఈక్వల్Rajanikanth Jailer{#}Dilip Kumar;Kabali;Rajani kanth;Telugu;Tamil;Cinemaసూపర్ స్టార్ సినిమా కొనే వాళ్లు లేరా..?సూపర్ స్టార్ సినిమా కొనే వాళ్లు లేరా..?Rajanikanth Jailer{#}Dilip Kumar;Kabali;Rajani kanth;Telugu;Tamil;CinemaTue, 11 Jul 2023 14:06:00 GMTసూపర్ స్టార్ రజనికాంత్ అంటే ఒకప్పుడు తెలుగులో ఒక రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆయన స్టైల్, లుక్ ఇలా అన్నిటికీ తమిళ ఆడియన్స్ తో ఈక్వల్ గా రజని సినిమాలను తెలుగులో ఎంకరేజ్ చేశారు. రజని సినిమా వస్తుంది అంటే తెలుగు స్టార్ హీరోలు సైతం కంగారు పడే పరిస్థితి కూడా కొన్నిసార్లు ఏర్పడింది. ఇక్కడ సినిమాలకు పోటీగా రజని సినిమాలు రిలీజై తెలుగు సినిమాలకు ఈక్వల్ గా వసూళ్లను రాబట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇదంతా ఒకప్పుడు జరిగిన మాట వాస్తవమే కానీ ప్రస్తుతం రజని సినిమా తెలుగులో బిజినెస్ కష్టాలు పడుతుందంటే నమ్మాల్సిందే.

నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో జైలర్ సినిమా చేస్తున్నాడు రజని. ఈ సినిమా ఆగష్టు 10న రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ నెల రోజులే ఉండగా తెలుగులో సినిమా రైట్స్ ఇంకా అమ్ముడు పోలేదని తెలుస్తుంది. తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ జైలర్ సినిమాను చాలా తక్కువ రేటుకి అడుగుతున్నారని తెలుస్తుంది. జైలర్ సినిమా నిర్మాతలు తెలుగులో ఈ సినిమా 12 కోట్ల దాకా ఇవ్వాలని కోట్ చేయగా తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ అందులో సగానికి అంటే 5, 6 కోట్లు మాత్రమే పెట్టడానికి ముందుకొచ్చారట.

తెలుగులో బడా డిస్ట్రిబ్యూటర్స్ సైతం రజని సినిమా కోసం రిస్క్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇందుకు కారణం ఏంటంటే కబాలి తర్వాత నుంచి రజని సినిమాలు పెద్దగా బాక్సాఫీస్ దగ్గర హడావిడి చేసింది లేదు. టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ చేశాయి కానీ సినిమాల విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అవుతూనే వస్తున్నారు. ఇక జైలర్ కి ముందే ఎలాంటి బజ్ లేదు అలాంటిది ఈ సినిమా ఎక్కువకి కొని లాస్ అవడం ఎందుకని ముందే జాగ్రత్త పడుతున్నారు. మరి జైలర్ సినిమా ఫైనల్ గా ఎంతకు క్లోజ్ అవుతుందో కానీ రజని సినిమా తెలుగు రైట్స్ విషయంలో జరుగుతున్న ఈ డిస్కషన్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని హర్ట్ అయ్యేలా చేస్తుంది.





RRR Telugu Movie Review Rating

వేదాంత స్పూర్తి తో పబ్ సాంగ్ !

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>