EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/andhra-pradeshc48a9d48-c559-46ef-b001-bc7e1ef64b71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/andhra-pradeshc48a9d48-c559-46ef-b001-bc7e1ef64b71-415x250-IndiaHerald.jpgఆ మధ్య విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ జీఐఎస్‌ ఒప్పందాలన్నీ కార్యరూపం దాలుస్తున్నాయని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అంటున్నారు. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో రూ.13 లక్షల కోట్ల పెట్టబడులు పెట్టేందుకు, 6 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ఒప్పందాలు చేసుకున్నామని.. విద్యుత్‌ శాఖ నుంచి రూ.8 లక్షల కోట్లు, పరిశ్రమల శాఖ నుంచి రూ. 3.5 లక్షల కోట్లు, టూరిజం శాఖ నుంచి రూ. 20–25 వేల కోట్లు, ఎలక్ట్రానిక్స్, ఐటీ విభాగం నుంచి రూ. 60 వేల కోట్లు ఎంఓయూలు చేసుకున్నామనిANDHRA PRADESH{#}kadapa;Gandikota;Vishakapatnam;Telangana Chief Minister;contract;television;Ministerఏపీ ఆ రంగంలో దూసుకుపోతోందా.. నిజమేనా?ఏపీ ఆ రంగంలో దూసుకుపోతోందా.. నిజమేనా?ANDHRA PRADESH{#}kadapa;Gandikota;Vishakapatnam;Telangana Chief Minister;contract;television;MinisterTue, 11 Jul 2023 06:00:00 GMTఆ మధ్య విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ జీఐఎస్‌ ఒప్పందాలన్నీ కార్యరూపం దాలుస్తున్నాయని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అంటున్నారు. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో రూ.13 లక్షల కోట్ల పెట్టబడులు పెట్టేందుకు, 6 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ఒప్పందాలు చేసుకున్నామని.. విద్యుత్‌ శాఖ నుంచి రూ.8 లక్షల కోట్లు, పరిశ్రమల శాఖ నుంచి రూ. 3.5 లక్షల కోట్లు, టూరిజం శాఖ నుంచి రూ. 20–25 వేల కోట్లు, ఎలక్ట్రానిక్స్, ఐటీ విభాగం నుంచి రూ. 60 వేల కోట్లు ఎంఓయూలు చేసుకున్నామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెబుతున్నారు.


విశాఖ, తిరుపతి, కడప జిల్లాల్లో టూరిజం నుంచి గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో వివిధ ఎంఓయూలు చేసుకున్నామన్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌... ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ గారు నేడు ఒబెరాయ్‌ గ్రూప్‌తో జీఐఎస్‌లో చేసుకున్న ఒప్పందం మేరకు మూడు 5 స్టార్‌ ప్లస్‌ రిసార్ట్స్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారని తెలిపారు. గండికోట, తిరుపతి, అన్నవరాల్లో ఈ రిసార్ట్స్‌ రాబోతున్నాయని.. విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు వల్ల ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడుతోందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అంటున్నారు.


పెద్ద గ్రూపులు విశాఖ లాంటి ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి రావడం వల్ల ఈ ప్రాంత ఇమేజ్‌ మరింత పెరిగే అవకాశం ఉంటుందని.. అమెరికాలో గ్రాండ్‌ కానియన్‌ ప్రసిద్ధి చెందినట్లు, టూరిజంలో ఆ స్థాయిలో గండికోట ప్రాజెక్టు రాకతో భవిష్యతు మారనుందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వివరించారు. టెంపుల్‌ టూరిజంలో భాగంగాతిరుపతిలో కూడా ఈ గ్రూప్‌ రిసార్ట్స్‌ పెట్టడం మరింతగా వృద్ధికి దోహదపడుతుందన్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.. గతంలో జరిగిన ఒక సమావేశంలో అరకులో కూడా ఓబెరాయ్‌ గ్రూప్‌ కానీ, మేఫైర్‌ అనే సంస్థ ద్వారా పెట్టబడులు పెట్టేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారని గుర్తు చేశారు.

 
కడప జిల్లాలో వెయ్యి మందికి ఉపాధి కల్పించే విధంగా డిక్సన్‌ కంపెనీ టీవీ స్క్రీన్‌ ప్యానళ్లు తయారు చేసే పరిశ్రమను ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారని తెలిపిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.. ఇవన్నీ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో ఒప్పందాలు చేసుకున్నవేనని.. అవి కార్యరూపం దాల్చుతున్నాయని మంత్రి చెబుతున్నారు.





RRR Telugu Movie Review Rating

తమన్నా అందాల ఆరబోత గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియుడు విజయ్..!?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>