EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/amith-sha72a28bf5-ad5c-4f4e-91be-3c63e47cf50f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/amith-sha72a28bf5-ad5c-4f4e-91be-3c63e47cf50f-415x250-IndiaHerald.jpgబీజేపీ సీనియర్ నేత, వ్యుహకర్త అమిత్ షా. ఆయన మహారాష్ట్రలో అదును చూసి శివసేనను చీల్చి బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఎన్సీపీలోని బడా నేత అయినా అజిత్ పవార్ కూడా బీజేపీ మద్దతు తెలిపేలా చేశారు. అజిత్ పవార్ కు మహా రాష్ట్ర డిప్యూటీ సీఎంగా నియమించి ఎన్సీపీలో చీలిక తెచ్చారు. మహారాష్ట్రలో 104 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ అక్కడ అధికారం చేపట్టే విషయంలో శివసేనతో గొడవ కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. తదనంతర పరిస్థితుల్లో శివసేనలోAMITH SHA{#}Amit Shah;TDP;Ajit Pawar;Maha;Assembly;Elections;Success;Jagan;Andhra Pradesh;CM;Amith Shah;Bharatiya Janata Partyతెలుగు రాష్ట్రాల్లో అమిత్‌షా పప్పులు ఉడకలేదా?తెలుగు రాష్ట్రాల్లో అమిత్‌షా పప్పులు ఉడకలేదా?AMITH SHA{#}Amit Shah;TDP;Ajit Pawar;Maha;Assembly;Elections;Success;Jagan;Andhra Pradesh;CM;Amith Shah;Bharatiya Janata PartyMon, 10 Jul 2023 07:00:00 GMTబీజేపీ సీనియర్ నేత, వ్యుహకర్త అమిత్ షా. ఆయన మహారాష్ట్రలో అదును చూసి శివసేనను చీల్చి బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఎన్సీపీలోని బడా నేత అయినా అజిత్ పవార్ కూడా బీజేపీ మద్దతు తెలిపేలా చేశారు. అజిత్ పవార్ కు మహా రాష్ట్ర డిప్యూటీ సీఎంగా నియమించి ఎన్సీపీలో చీలిక తెచ్చారు.


మహారాష్ట్రలో 104 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ అక్కడ అధికారం చేపట్టే విషయంలో శివసేనతో గొడవ కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. తదనంతర పరిస్థితుల్లో శివసేనలో చీలిక తెచ్చి ఏక్ నాథ్ షిండేను సీఎంగా చేసి బీజేపీ అధికారంలోకి తీసుకువచ్చారు.


అలాంటి అమిత్ షా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఆయన వ్యుహాలు పని చేయడం లేదా? ఇక్కడ ఉన్న సీఎం కేసీఆర్, జగన్ లు అంతటి బలవంతమైన నాయకులా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీ కానీ అమిత్ షా లాంటి నాయకులు పక్కా ప్రణాళికతోనే అధికార విషయంలో ముందు కెళతారని ఆయా రాష్ట్రాల ఎన్నికలు చెబుతున్నాయి. ముందుగా బీజేపీకి క్షేత్ర స్థాయిలో బలం పెంచుతారు. దాదాపు అధికారంలో మూడో వంతు స్థానాలైన బీజేపీ గెలుచుకునేలా చేయడం అమిత్ షా వ్యుహాం. అది గనక సక్సెస్ అయితే మిగతా ప్లాన్ ఎలా అమలు చేయాలో తెలుసు.


బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ లాంటి పార్టీలో ఆయా అధినేతలపై వ్యతిరేకత ఉన్న నేతలు ఉంటారు. వారిని బీజేపీకి దగ్గర చేయడంలో అమిత్ షా దిట్ట. ఇతర పార్టీలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలను దగ్గర తీసుకుని వారికి పదవుల ఆశ చూపి  ఎలాగైనా బీజేపీకి మద్దతిచ్చేలా చేయగల సత్తా ఉన్న నాయకుడని అమిత్ షాను రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. మరి తెలంగాణ, ఆంధ్రలో అమిత్ షా చేస్తున్న వ్యుహాం ఫలిస్తుందా.. 30 శాతం ఓట్లకు బీజేపీ ఎప్పుడు ఎదుగుతుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

సెల్ ఫోన్ చార్జర్.. మనిషి ప్రాణం తీసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>