MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjunf025b5ea-6012-4361-88f8-ad2453bfe271-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjunf025b5ea-6012-4361-88f8-ad2453bfe271-415x250-IndiaHerald.jpgత్రివిక్రమ్ శ్రీనివాస్ కు సెంటిమెంట్లు ఎక్కువ. అతడు దర్శకత్వం వహించే సినిమాల టైటిల్స్ నుండి ఎంపిక చేసుకునే హీరో హీరోయిన్స్ వరకు ఇలా అన్ని విషయాలాలోనూ త్రివిక్రమ్ సెంటిమెంట్స్ ను ఫాలో అవుతూ ఉంటాడు అని అంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా త్రివిక్రమ్ మహేష్ తో తీస్తున్న ‘గుంటూరు కారం’ విషయంలో కూడ అల్లు అర్జున్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘గుంటూరు కారం’ మూవీలో త్రివిక్రమ్ మహేష్ ను పూర్తి మాస్ హీరోగా చూపెడుతున్నాడు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ లటెస్ట్ షెడ్యూల్ వచalluarjun{#}Athadu;trivikram srinivas;Arjun;Allu Arjun;Heroine;Hero;Mass;srinivas;News;Cinemaమహేష్ కోసం రంగంలోకి దిగుతున్న అల్లు అర్జున్ సెంటిమెంట్ !మహేష్ కోసం రంగంలోకి దిగుతున్న అల్లు అర్జున్ సెంటిమెంట్ !alluarjun{#}Athadu;trivikram srinivas;Arjun;Allu Arjun;Heroine;Hero;Mass;srinivas;News;CinemaMon, 10 Jul 2023 09:00:00 GMTత్రివిక్రమ్ శ్రీనివాస్ కు సెంటిమెంట్లు ఎక్కువ. అతడు దర్శకత్వం వహించే సినిమాల టైటిల్స్ నుండి ఎంపిక చేసుకునే హీరో హీరోయిన్స్ వరకు ఇలా అన్ని విషయాలాలోనూ త్రివిక్రమ్ సెంటిమెంట్స్ ను ఫాలో అవుతూ ఉంటాడు అని అంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా త్రివిక్రమ్ మహేష్ తో తీస్తున్న ‘గుంటూరు కారం’ విషయంలో కూడ అల్లు అర్జున్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


‘గుంటూరు కారం’ మూవీలో త్రివిక్రమ్ మహేష్ ను పూర్తి మాస్ హీరోగా చూపెడుతున్నాడు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ లటెస్ట్ షెడ్యూల్ వచ్చేవారం నుండి తిరిగి ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్ లోని కొన్ని కీలక సన్నివేశాలు బిహెచ్ఈల్ కంపెనీ ప్రాంగణంలో తీయబోతున్నట్లు తెలుస్తోంది.


గతంలో త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో తీసిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి/ ‘జులై’ లోని కొన్ని కీలక సన్నివేశాలను బిహెచ్ఈల్ కంపెనీ ప్రాంగణ ప్రాంతంలో తీసినప్పుడు ఆమూవీలు రెండు సూపర్ హిట్ అయిన నేపధ్యంలో తిరిగి అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ త్రివిక్రమ్ మహేష్ తో తీస్తున్న ‘గుంటూరు కారం’ మూవీలోని కొన్ని సన్నివేశాలు ఇప్పుడు మళ్ళీ బీచ్ఈల్ కంపెనీ ప్రాంగణంలో తీస్తూ   ఉండటం  తో త్రివిక్రమ్ సెంటిమెంట్స్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అర్థం అవుతుంది.


ఇప్పటికే ఈసినిమా కథకు సంబంధించిన మార్పులు అదేవిధంగా హీరోయిన్ విషయంలో జరిగిన మార్పులు తరువాత ఇప్పుడు తిరిగి షూటింగ్ మొదలుపెట్టబోతున్న ఈమూవీ వేగంగా పూర్తి చేసి ఎట్టి పరిస్థితులలోనూ సంక్రాంతికి విడుదల చేసి తీరాలి అన్న పట్టుదలతో త్రివిక్రమ్ మహేష్ లు ఉన్నారు. ఈ మూవీ ప్రభాస్ భారీ బడ్జెట్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’ తో పోటీ పడుతున్న పరిస్థితులలో ‘గుంటూరు కారం’ సక్సస్ సాధించాలి అంటే ఈ మూవీ మేకింగ్ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగ కూడదు అన్న స్థిరనిర్ణయంలో త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది..





RRR Telugu Movie Review Rating

నయనతార కి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు..!?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>