EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/francr4dda4ff6-00ba-40f9-929a-d75de5071fe0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/francr4dda4ff6-00ba-40f9-929a-d75de5071fe0-415x250-IndiaHerald.jpgయూరప్ దేశాలు శరణార్థులని అక్కున చేర్చుకుని వారికి ఉపాధి కల్పించాయి. కానీ ఇప్పుడు ఆ శరణార్ధులే ఆయా దేశాల్లో స్థిరపడిపోయి కల్లోలం సృష్టిస్తున్నారు. దీని వెనక మత మౌఢ్యం అనే పిచ్చి ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్, అఫ్గానిస్తాన్, అల్జీరియా, అర్మేనియా లాంటి దేశాల నుంచి యూరప్ వెళ్లిన అనేక మంది ఆ దేశాల్లో అలజడులు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లో తీవ్ర అల్లర్లు జరుగుతున్నాయి. ముస్లిం యువకుడిని సైన్యం కాల్చి చంపిందని ఫ్రాన్స్ లోని చాలా నగరాల్లో లూటీలు, అల్లర్లు, గొడవలు జరుగుతున్నాయి. ఏకంగా ఫ్రాFRANCR{#}prema;Armenia;Army;Love;France;Germany;Europe countries;Indiaవలస వచ్చిన వారే.. చిచ్చురేపుతున్నారు?వలస వచ్చిన వారే.. చిచ్చురేపుతున్నారు?FRANCR{#}prema;Armenia;Army;Love;France;Germany;Europe countries;IndiaMon, 10 Jul 2023 08:00:00 GMTయూరప్ దేశాలు శరణార్థులని అక్కున చేర్చుకుని వారికి ఉపాధి కల్పించాయి. కానీ ఇప్పుడు ఆ శరణార్ధులే ఆయా దేశాల్లో స్థిరపడిపోయి కల్లోలం సృష్టిస్తున్నారు. దీని వెనక మత మౌఢ్యం అనే పిచ్చి ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్, అఫ్గానిస్తాన్, అల్జీరియా, అర్మేనియా లాంటి దేశాల నుంచి యూరప్ వెళ్లిన అనేక మంది ఆ దేశాల్లో అలజడులు సృష్టిస్తున్నారు.


ప్రస్తుతం ఫ్రాన్స్ లో తీవ్ర అల్లర్లు జరుగుతున్నాయి. ముస్లిం యువకుడిని సైన్యం కాల్చి చంపిందని ఫ్రాన్స్ లోని చాలా నగరాల్లో లూటీలు, అల్లర్లు, గొడవలు జరుగుతున్నాయి. ఏకంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యువేల్ మెక్రాన్ యువత తల్లిదండ్రులకు సూచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూసుకోవాలని చెప్పారు. శాంతి నెలకొల్పడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.


ముఖ్యంగా తమ మతాన్ని కూడా అక్కడ ఆచరించాలని తమ మత పద్ధతులే యూరప్ దేశాల్లో విస్తరించాలని చేస్తున్న ప్రయత్నం అని చాలా మంది అక్కడి పౌరులు, అధికారులు ప్రస్తుతం గమనిస్తున్నారని ప్రపంచ మేధావులు చెబుతున్నారు. ఇది రాబోయే కాలంలో మరింత దారుణమైన పరిస్థితులకు దారి తీస్తాయని ఆందోళన చెందుతున్నారు. అల్లర్లు బెల్జియం, జర్మనీ లాంటి దేశాలకు కూడా పాకాయి. ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్న దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఇప్పుడు పాతుకుపోయి అలజడులు సృష్టిస్తున్నారు.


ఇన్ని రోజులు యూరప్ దేశాలపై ఉన్న ప్రేమ అని అక్కడి దేశస్థులు అనుకోవడం పొరపాటు అని గ్రహించాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా ఏళ్లుగా భారత్ లో శరణార్థులపై ఎందుకు కఠినంగా వ్యవహరిస్తారో ఇప్పుడు అర్థం అవుతుంది యూరప్ దేశాలకు. ఇలాంటి విధానాలతో పోతే రాబోయే రోజుల్లో యూరప్ దేశాలకు పతనం తప్పదు. మత మౌఢ్య పిచ్చితో అభివృద్ది చెందిన దేశాల్లో అల్లర్లు జరిగి వారు తీవ్రంగా నష్టపోతారు. అందుకే ఏ మతం వారు వచ్చినా ఆ దేశం అనుసరించే విధానాన్ని ప్రేమించడం ముందుగా నేర్పించగలిగితేనే అక్కడ శాంతి సాధ్యమవుతుంది.



RRR Telugu Movie Review Rating

సెల్ ఫోన్ చార్జర్.. మనిషి ప్రాణం తీసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>