MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgదేవిశ్రీ ప్రసాద్ తమన్ లపై మన టాప్ హీరోలకు మోజు తగ్గడంతో పరభాషా సంగీత దర్శకుల హవా మొదలైంది. ఆ లిస్టులో అనిరుద్ ముందు వరసలో ఉంటున్నాడు. ప్రస్తుతం దక్షణ భారత సినిమా రంగంలో అత్యధిక పారితోషికం తీసుకుంటూ చాల బిజీగా ఉంటున్న క్రేజీ సంగీత దర్శకుడు ఇతడు. ప్రస్తుతం ఇతడి చేతిలో అనేక భారీ సినిమాలు ఉన్నాయి. రజనీకాంత్ ‘జైలర్’ మూవీకి విజయ్ ‘లియో’ మూవీకి ఇతడు సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు సంబంధిస్తున్న రెండు పాటలు ఇప్పటికే విడుదలై మిలియన్ల వ్యూస్ వచ్చినప్పటికీ ఆపాటలకు సంబంధించిన ట్యూJUNIOR NTR{#}parasuram;Audio;Sangeetha;gautham new;gautham;koratala siva;Joseph Vijay;prasad;Jr NTR;News;Hero;Cinemaఅనిరుద్ తీరుపై టెన్షన్ లో జూనియర్ అభిమానులు !అనిరుద్ తీరుపై టెన్షన్ లో జూనియర్ అభిమానులు !JUNIOR NTR{#}parasuram;Audio;Sangeetha;gautham new;gautham;koratala siva;Joseph Vijay;prasad;Jr NTR;News;Hero;CinemaMon, 10 Jul 2023 13:26:34 GMTదేవిశ్రీ ప్రసాద్ తమన్ లపై మన టాప్ హీరోలకు మోజు తగ్గడంతో పరభాషా సంగీత దర్శకుల హవా మొదలైంది. ఆ లిస్టులో అనిరుద్ ముందు వరసలో ఉంటున్నాడు. ప్రస్తుతం దక్షణ భారత సినిమా రంగంలో అత్యధిక పారితోషికం తీసుకుంటూ చాల బిజీగా ఉంటున్న క్రేజీ సంగీత దర్శకుడు ఇతడు.  


ప్రస్తుతం ఇతడి చేతిలో అనేక భారీ సినిమాలు ఉన్నాయి. రజనీకాంత్ ‘జైలర్’ మూవీకి విజయ్ ‘లియో’ మూవీకి ఇతడు సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు సంబంధిస్తున్న రెండు పాటలు ఇప్పటికే విడుదలై  మిలియన్ల వ్యూస్ వచ్చినప్పటికీ ఆపాటలకు సంబంధించిన ట్యూన్స్ గొప్పగా లేవు అంటూ మ్యూజిక్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.



ఇప్పుడు ఈవిషయమే జూనియర్ అభిమానుల దృష్టి వరకు రావడంతో  వారు  తెగ టెన్షన్ పడుతున్నారు. దీనికి కారణం కొరటాల జూనియర్ ల కాంబినేషన్ లో తీస్తున్న ‘దేవర’ మూవీకి అనిరుద్ ను సంగీత దర్శకుడుగా పెట్టమని జూనియర్ కొరటాల పై ఒత్తిడి చేసి అతడిని సంగీత దర్శకుడుగా ఫిక్స్ చేసినట్లు వార్తలు ఉన్నాయి.


సినిమా పాటల కంపోజింగ్ పూర్తి స్థాయిలో మొదలవ్వలేదు అన్న వార్తలు ఉన్నాయి. దీనికి కారణం అనిరుద్ బిజీ అని అంటున్నారు. ఇంత బిజీ మధ్య అనిరుద్ జూనియర్ మూవీ పాటల విషయంలో శ్రద్ధపట్టకపోతే ఆమూవీ ఆడియో ఫెయిల్ అయి ‘దేవర’ మూవీ సక్సస్ పై ప్రభావితం చూపుతుందని తారక్ అభిమానుల భయం. గతంలో అనిరుద్ చేసిన‘అజ్ఞాతవాసి’ ‘గ్యాంగ్ లీడర్’ పాటలు ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు అదే తమ హీరో విషయంలో కూడ రిపీట్ అవుతుందేమో అని జూనియర్ అభిమానుల భయం. ప్రస్తుతం ఇతడి మ్యానియా కొనసాగుతూ ఉండటంతో తెలుగులో గౌతమ్ తిన్ననూరి తో ఒక సినిమా దర్శకుడు పరుశురామ్ తో మరో సినిమా కూడ చేస్తున్నాడు. తాను చేస్తున్న సినిమాలకు 3 కోట్ల భారీ పారితోషికం తీసుకునే అనిరుద్ తాను ట్యూన్ చేస్తున్న పాటల విషయంలో శ్రద్ధ చూపడంలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  





RRR Telugu Movie Review Rating

నయనతార కి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు..!?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>