DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/harish-rao53a11a16-9270-4793-83b5-e5cdf764c9bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/harish-rao53a11a16-9270-4793-83b5-e5cdf764c9bb-415x250-IndiaHerald.jpgతెలంగాణలో హరీష్ రావ్ కి స్వామి భక్తి ఎక్కువ అంటూ ఉంటారు. అందుకే టిఆర్ఎస్ ను వీడి ఎప్పుడూ ఆయన ఏ పార్టీ వైపూ మొగ్గు చూప లేదు. చాలాసార్లు భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ కూడా హరీష్ రావుని తమ పార్టీలోకి ఆహ్వానించడానికి ప్రయత్నించాయట. అసలు హరీష్ రావు చెప్పితే 20, 30 మంది ఎమ్మెల్యేలు గత ఎలక్షన్లకు ముందే బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అప్పట్లో ఈ విషయం గ్రహించిన కెసిఆర్ హరీష్ రావుని ప్రక్కన పెట్టినట్లుగా తెలుస్తుంది. గత ఎలక్షన్ లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో కూడా హరీష్ రావు ప్రమేయం లేకుండానే నHARISH RAO{#}KTR;Survey;Congress;Bharatiya Janata Party;MLA;Partyహరీశ్‌రావు అలా చేస్తే.. కేసీఆర్‌ గోవిందా?హరీశ్‌రావు అలా చేస్తే.. కేసీఆర్‌ గోవిందా?HARISH RAO{#}KTR;Survey;Congress;Bharatiya Janata Party;MLA;PartySun, 09 Jul 2023 09:00:00 GMTతెలంగాణలో హరీష్ రావ్ కి స్వామి భక్తి ఎక్కువ అంటూ ఉంటారు. అందుకే టిఆర్ఎస్ ను వీడి ఎప్పుడూ ఆయన ఏ పార్టీ వైపూ  మొగ్గు చూప లేదు. చాలాసార్లు భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ కూడా హరీష్ రావుని తమ పార్టీలోకి ఆహ్వానించడానికి ప్రయత్నించాయట. అసలు హరీష్ రావు చెప్పితే 20, 30 మంది ఎమ్మెల్యేలు గత ఎలక్షన్లకు ముందే బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది.


అప్పట్లో ఈ విషయం గ్రహించిన కెసిఆర్ హరీష్ రావుని  ప్రక్కన పెట్టినట్లుగా తెలుస్తుంది. గత ఎలక్షన్ లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో కూడా హరీష్ రావు ప్రమేయం లేకుండానే నడుపుకు వచ్చేశారు. అయితే టిఆర్ఎస్ కు సంబంధించిన కెసిఆర్ గాని, కేటీఆర్ గాని హరీష్ రావు పై బేదాభిప్రాయం తో ఉన్న సందర్భం అది. వాళ్ళిద్దరి అభిప్రాయం అలా ఉన్న సందర్భంలో కూడా, హరీష్ రావు  బయట పార్టీ వైపు కన్నెత్తి చూడలేదని తెలుస్తుంది.


ఆయన ప్లేస్ లో మరొక వ్యక్తి ఇంకా ఎవరైనా ఉంటే తప్పకుండా పక్క పార్టీలోకి వెళ్లిపోయేవారు. కానీ హరీష్ రావు పక్క పార్టీ ప్రలోభాలకు లొంగిపోయే వ్యక్తే అయితే ఏనాడో ఆయన టిఆర్ఎస్ పార్టీని చీల్చేసేవారు. కానీ ఆయన ఏనాడూ అలా చేయలేదు. కెసిఆర్ ని నమ్ముకుని ఉన్నారు ఆయన. ఆ విషయంలో కెసిఆర్ ఇంకా కేటీఆర్ ఇద్దరు కూడా హరీష్ రావు కి థాంక్స్ చెప్పాలి అని అంటున్నారు కొంత మంది రాజకీయ విశ్లేషకులు.


ఆయన నిజంగా తన ఉంటున్న పార్టీకి ద్రోహం చేయాలనుకుంటే  పార్టీ నుండి బయటికి వెళ్లి బిజెపిని ప్రోత్సహించే అవకాశం  ఉంది. కానీ ఆయన అలాంటి నమ్మక ద్రోహం  చేయలేదు. మొన్న టైమ్స్ నౌ చేసిన సర్వే ప్రకారం కూడా టిఆర్ఎస్ పార్టీ పతనం అవ్వాలంటే టిఆర్ఎస్ చీలాలి. అలా చేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఆ పని చేయలేదు హరీష్ రావు.



RRR Telugu Movie Review Rating

క్రాక్ -2 సినిమా రాబోతోందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>