Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylefcfdff02-b3fe-49f8-a47c-0a4f41e1079e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylefcfdff02-b3fe-49f8-a47c-0a4f41e1079e-415x250-IndiaHerald.jpgఒకే కుటుంబం నుండి వచ్చిన వాళ్ళందరూ సూపర్ స్టార్స్ గా మారడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటాది. మెగా ఫ్యామిలీ ని తీసుకుంటే మొత్తం సూపర్ స్టార్స్ తో నిండిపోయి ఉంటుంది.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో తన కష్టం మీద మెగాస్టార్ గా ఎదిగి, తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ని సంపాదించాడు. ఆయన ఎదగడమే కాకుండా, తన కుటుంబం లో ఉన్నోళ్లను ఇండస్ట్రీ కి తీసుకొచ్చి వారికి ఒక మార్గం చూపించాడు. ముందుగా నాగబాబు ని తీసుకొచ్చాడు , అతడు హీరో ఆ సక్సెస్ కాలేదు కానీ, నిర్మాతగsocialstars lifestyle{#}Ram Charan Teja;Allu Arjun;anil ravipudi;F2;king;F3;Athadu;Nagababu;kalyan;shankar;Chiranjeevi;Tollywood;Pawan Kalyan;producer;Producer;Industry;Hero;Chitram;Director;Cinema;Successపవన్కళ్యాణ్ -అల్లుఅర్జున్ మల్టీస్టారర్ మూవీ మిస్ అవ్వడానికి కారణం అదేనా....!!పవన్కళ్యాణ్ -అల్లుఅర్జున్ మల్టీస్టారర్ మూవీ మిస్ అవ్వడానికి కారణం అదేనా....!!socialstars lifestyle{#}Ram Charan Teja;Allu Arjun;anil ravipudi;F2;king;F3;Athadu;Nagababu;kalyan;shankar;Chiranjeevi;Tollywood;Pawan Kalyan;producer;Producer;Industry;Hero;Chitram;Director;Cinema;SuccessSun, 09 Jul 2023 09:45:00 GMTఒకే కుటుంబం నుండి వచ్చిన వాళ్ళందరూ సూపర్ స్టార్స్ గా మారడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటాది. మెగా ఫ్యామిలీ ని తీసుకుంటే మొత్తం సూపర్ స్టార్స్ తో నిండిపోయి ఉంటుంది.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో తన కష్టం మీద మెగాస్టార్ గా ఎదిగి, తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ని సంపాదించాడు. ఆయన ఎదగడమే కాకుండా, తన కుటుంబం లో ఉన్నోళ్లను ఇండస్ట్రీ కి తీసుకొచ్చి వారికి ఒక మార్గం చూపించాడు. ముందుగా నాగబాబు ని తీసుకొచ్చాడు , అతడు హీరోసక్సెస్ కాలేదు కానీ, నిర్మాతగా స్థిరపడిపోయాడు, ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు, ఈయన ఎంట్రీ ఒక సునామి అనే చెప్పాలి, ప్రస్తుతం ఆయనకీ ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో కి కూడా లేదు. ఇక ఆ తర్వాత పరిచయమైనా అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ వంటి వారు ప్రస్తుతం గ్లోబల్ స్టార్స్ గా ఒక వెలుగు వెలుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఇంతమంది స్టార్స్ ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ ఏ ఇద్దరూ కూడా కలిసి ఒక పూర్తి స్థాయి మల్టిస్టార్రర్ సినిమా చెయ్యలేదు. రీసెంట్ గా చిరంజీవి , రామ్ చరణ్ కలిసి ఆచార్య చిత్రంలో నటించారు కానీ, అందులో రామ్ చరణ్ కేవలం ముఖ్య పాత్రని మాత్రమే పోషించాడు. సినిమా కూడా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అంతకు ముందు అల్లు అర్జున్ రామ్ చరణ్ 'ఎవడు' చిత్రం లో పది నిమిషాలు నిడివి ఉన్న ఒక కీలక పాత్రని పోషించాడు. కానీ వీళ్ళ కాంబినేషన్ లో కూడా పూర్తి స్థాయి మల్టీస్టార్ర్ర్ రాలేదు. ఇక పవన్ కళ్యాణ్ చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ మరియు శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలలో అతిథి పాత్రలను పోషించాడు. వీరి కాంబినేషన్ లో కూడా పూర్తి స్థాయి మల్టీస్టార్ర్ర్ రాలేదు. ఇలా ఏ ఇద్దరూ కూడా మెగా ఫ్యామిలీ లో మల్టీస్టార్ర్ర్ సినిమా చెయ్యలేదు.

అయితే గతం లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక మల్టీస్టార్రర్ ఫ్రాంచైజ్ ని ప్లాన్ చేసాడట. ఎఫ్2 మరియు ఎఫ్3 తరహాలో పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించాలని అనుకున్నాడు. ఈ ఫ్రాంచైజ్ కి డైరెక్టర్ గా అనిల్ రావిపూడి ని ఎంచుకున్నాడు. ఎప్పుడో ప్రారంభం అవ్వాల్సిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ద్వారా వాయిదా పడుతూ వెళ్ళింది. ఇక ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ని చేద్దాం అనుకున్నారు కానీ, అల్లు అర్జున్ డేట్స్ ఖాళీ లేకపోవడం తో 'వకీల్ సాబ్' చిత్రాన్ని చేసాడు. మరి భవిష్యత్తులో అయినా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ మీదకి వెళ్తుందో లేదో చూడాలి. ఒకవేళ వెళ్తే మాత్రం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.



RRR Telugu Movie Review Rating

క్రాక్ -2 సినిమా రాబోతోందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>