HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/food-eatingdeb63bea-b4c5-4ab7-9bad-cce8069fa13f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/food-eatingdeb63bea-b4c5-4ab7-9bad-cce8069fa13f-415x250-IndiaHerald.jpgసాధారణంగా వర్షాకాలంలో ఉండే చల్లని వాతావరణానికి వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది.దానితో రకరకాల మసాలా దినుసులు,కారం, ఉప్పు అధికంగా ఉన్న స్నాక్ ఐటమ్స్ తినడానికి మొగ్గు చూపుతూ ఉంటారు.ఇటువంటి ఆహారాలే కాక మన ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని ఆహారాలను కూడా దూరం పెట్టాలని ఆహార నిపుణులు చెబుతూన్నారు. దీనికి కారణం వర్షాకాలంలో మన డైజేషన్ సిస్టం స్లోగా ఉంటుంది.మరి మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఏ ఏ ఆహారాలు వర్షాకాలంలో హాని కలిగిస్తాయో మనము అవగాహన తెచ్చుకుందాం పదండి.. ఆకుకూరలు.. సాధారణంగా ఆకుకూరలు నీరు ఎక్కువగFOOD;EATING{#}Mushroom;salt;Masala;Manam;oilవర్షాకాలంలో తినకూడని ఆహారాలు ఏంటో తెలుసా..?వర్షాకాలంలో తినకూడని ఆహారాలు ఏంటో తెలుసా..?FOOD;EATING{#}Mushroom;salt;Masala;Manam;oilSun, 09 Jul 2023 06:00:00 GMTసాధారణంగా వర్షాకాలంలో ఉండే చల్లని వాతావరణానికి వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది.దానితో రకరకాల మసాలా దినుసులు,కారం, ఉప్పు అధికంగా ఉన్న స్నాక్ ఐటమ్స్ తినడానికి మొగ్గు చూపుతూ ఉంటారు.ఇటువంటి ఆహారాలే కాక మన ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని ఆహారాలను కూడా దూరం పెట్టాలని ఆహార నిపుణులు చెబుతూన్నారు. దీనికి కారణం వర్షాకాలంలో మన డైజేషన్ సిస్టం స్లోగా ఉంటుంది.మరి మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఏ ఏ ఆహారాలు వర్షాకాలంలో హాని కలిగిస్తాయో మనము అవగాహన తెచ్చుకుందాం పదండి..

ఆకుకూరలు..

సాధారణంగా ఆకుకూరలు నీరు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో పండుతో ఉంటాయి.ఈ వర్షాకాలంలో పండే ఆకుకూరలపై ఫంగస్ ఎక్కువగా ఫామ్ అయ్యి, కలుషితంగా మారుతాయి.మరియు అంతేకాక వర్షాకాలంలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది.అందువలన మనం తిన్న ఆకుకూరలు సరిగా జీర్ణం కావు.కావున ఈ సీజన్లో తక్కువగా ఆకుకూరలు వాడుకోవడం చాలా మంచిది.

పుట్టగొడుగులు..

సాధారణంగా పుట్టగొడుగులు మన ఆరోగ్యానికి ఎంతో ప్రోటీన్ ఇచ్చే ఆహారము. కానీ వర్షాకాలంలో వచ్చే పుట్టగొడుగుల పైన అధిక ఫంగస్పామ్ అయ్యి,మన శరీరానికి ఎన్నో హానికర ప్రభావాలను చూపిస్తుంది. కావున వర్షాకాలంలో పుట్టగొడుగులుతీసుకోకపోవడమే ఉత్తమం.

 డీప్ ఫ్రైడ్ ఐటమ్స్..

వర్షాకాలంలో ఉండే చల్లని వాతావరణానికి ఎక్కువగా బజ్జీలు,సమాసాలు,పూరీలు అంటూ రకరకాల డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తింటూ ఉంటారు.ఇందులో వాడే ఆయిల్ మరియు ఉప్పు,కారం ఎక్కువగా ఉండటం వల్ల,మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వక మలబద్దకం, గ్యాస్,కడుపునొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కావున ఆయిల్ లేని ఆహారాలకు ప్రిఫరెన్స్ ఇవ్వడం చాలా ఉత్తమం.

మొలకెత్తిన గింజలు..

ఈ మధ్యకాలంలో డైట్ పేరుతో మొలకెత్తిన గింజల్ని ఏదో ఒక సమయంలో తీసుకుంటూ ఉండటం అలవాటైపోయింది.కానీ వర్షాకాలంలో మొలకెత్తిన గింజలు అధిక బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది.కావున ఇవి ఈ సీజన్లో తినక పోవడమే మంచిది.

కాఫీ,టీలు..

వర్షాకాలంలో ఉండే చల్లటి వాతావరణానికి కొంతమంది వేడివేడిగా టీ,కాఫీలు అధికంగా తాగుతూ ఉంటారు.కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు.ఇందులో ఉండే కెఫిన్ వల్ల,జీర్ణక్రియ రేటు తగ్గి,అనేక సమస్యలు తలెత్తుతాయి.కావున పైన చెప్పిన ఆహారాలన్నింటికీ వర్షాకాలంలో దూరంగా ఉండటమే చాలా మంచిది.



RRR Telugu Movie Review Rating

"విరూపాక్ష" మూవీకి మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>