Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3343cc78-4b6d-4329-90c9-aab2c544c87a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3343cc78-4b6d-4329-90c9-aab2c544c87a-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో అక్కినేని హీరోలకు ఏ మాత్రం కలిసి రావడం లేదు. నాగార్జునతో పాటు ఆయన తనయుడు నాగ చైతన్య, అఖిల్ వరుస ఫ్లాపులతో బాగా సతమతం అవుతున్నారు.నాగార్జున నుంచి చివరిగా వచ్చిన చిత్రం `ది ఘోస్ట్‌`. గత ఏడాది భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. అంతకుముందు నాగార్జున నటించిన మన్మథుడు 2, ఆఫీసర్ చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. `ది ఘోస్ట్` విడుదలై చాలా నెలలు కావొస్తున్నా.. నాగార్జున తదుపరి ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్ తో అన్నది ఇంత వరకు ప్రకటించలేదు. ఇది అక్కినేనిsocialstars lifestyle{#}nidhi;Manmadhudu;Akkineni Nagarjuna;Nijam;Venu Thottempudi;Naga Chaitanya;Chitram;naga;akhil akkineni;Love;Director;Cinemaఅక్కినేని హీరోల గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వేణుస్వామి....!!అక్కినేని హీరోల గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వేణుస్వామి....!!socialstars lifestyle{#}nidhi;Manmadhudu;Akkineni Nagarjuna;Nijam;Venu Thottempudi;Naga Chaitanya;Chitram;naga;akhil akkineni;Love;Director;CinemaSat, 08 Jul 2023 22:33:14 GMTఈ మధ్య కాలంలో అక్కినేని హీరోలకు ఏ మాత్రం కలిసి రావడం లేదు. నాగార్జునతో పాటు ఆయన తనయుడు నాగ చైతన్య, అఖిల్ వరుస ఫ్లాపులతో బాగా సతమతం అవుతున్నారు.నాగార్జున నుంచి చివరిగా వచ్చిన చిత్రం `ది ఘోస్ట్‌`. గత ఏడాది భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. అంతకుముందు నాగార్జున నటించిన మన్మథుడు 2, ఆఫీసర్ చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

`ది ఘోస్ట్` విడుదలై చాలా నెలలు కావొస్తున్నా.. నాగార్జున తదుపరి ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్ తో అన్నది ఇంత వరకు ప్రకటించలేదు. ఇది అక్కినేని అభిమానులు మరింత కలవరపెడుతోంది. నాగ చైతన్య విషయానికి వస్తే.. లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో హిట్ కొట్టాడో అనుకునేలోపే థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ రూపంలో హ్యాట్రిక్ ఫ్లాపులు వచ్చి చేరాయి. చందూ మొండేటితో నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు.

ఇక అఖిల్ కెరీర్ చాలా గందరగోళంలో సాగుతోంది. ఇప్పటికే ఈయన ఐదు చిత్రాలు చేశాడు. వీటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తప్పితే మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అఖిల్ నుంచి వచ్చిన రీసెంట్ మూవీ `ఏజెంట్‌` డబుల్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే అక్కినేని హీరోలు ఇలా వరుస ఫ్లాపులతో సతమతం అవ్వడానికి కారణం ఏంటో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి వెల్లడించాడు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ వేణు స్వామి పాపులర్ అయ్యాడు.

ఆయన చెప్పినవి కొన్ని నిజం కావడంతో వేణు స్వామిని కొందరు నమ్మడం స్టార్ట్ చేశారు. రష్మిక, నిధి అగర్వాల్‌, డింపుల్ హయాతి వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత ప్రత్యేక పూజాలు కూడా చేయించుకున్నారు. అయితే తాజాగా అక్కినేని హీరోలపై వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగార్జున కుటుంబంలో వంశ దోషం ఉందని.. అందుకే ఆ ఫ్యామిలీలో విడాకులు జరిగాయని వేణు స్వామి వెల్లడించారు. ఆ దోషం వల్లే అక్కినేని హీరోలు వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నాడు. దీంతో వేణు స్వామి వ్యాఖ్యలు కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.



RRR Telugu Movie Review Rating

'రంగబలి' మూవీ ను అన్నీ కోట్లకు కొన్న డిజిటల్ ఓటీటీ సంస్థ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>