TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobile-rainfe9a0c6f-a3e2-4b6d-983d-2f3c4319294d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobile-rainfe9a0c6f-a3e2-4b6d-983d-2f3c4319294d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. బయటకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారు పలు రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతోంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లను వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మొబైల్ తడిస్తే ముందుగా చేయవలసిన పని మొబైల్ ఆఫ్ చేయడం.. అయితే ఇలా చేయకుంటే మాత్రం మొబైల్ ఫోన్ షార్ట్ సర్క్యూట్ అయ్యి పేలే ప్రమాదం ఉందని కొంతమంది టెక్ నిపుణులు తెలియజేస్తున్నారు. ఫోన్ వర్షంలో తడిసిన వెంటనే ఏం చేయాలి ? ఏం చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా వర్షంలో మొబైల్ తడిస్తMOBILE;RAIN{#}Manam;Smart phoneబుల్లిపిట్ట: మొబైల్ ఫోన్ తడిచిందా? అయితే ఇలా చేయండి..!బుల్లిపిట్ట: మొబైల్ ఫోన్ తడిచిందా? అయితే ఇలా చేయండి..!MOBILE;RAIN{#}Manam;Smart phoneSat, 08 Jul 2023 13:00:00 GMTప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. బయటకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారు పలు రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతోంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లను వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మొబైల్ తడిస్తే ముందుగా చేయవలసిన పని మొబైల్ ఆఫ్ చేయడం.. అయితే ఇలా చేయకుంటే మాత్రం మొబైల్ ఫోన్ షార్ట్ సర్క్యూట్ అయ్యి పేలే ప్రమాదం ఉందని కొంతమంది టెక్ నిపుణులు తెలియజేస్తున్నారు. ఫోన్ వర్షంలో తడిసిన వెంటనే ఏం చేయాలి ? ఏం చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.


సాధారణంగా వర్షంలో మొబైల్ తడిస్తే ఫోన్ ఆఫ్ చేసిన తర్వాత దాని బ్యాటరీ, మెమొరీ కార్డ్ , సిమ్ కార్డు వంటివి తీసివేయాలి. అలా తీసి వేసిన తర్వాత ఏదైనా పొడి గుడ్డతో వాటిని బాగా తుడిచి ఆరబెట్టాలి. ఒకవేళ మొబైల్ ఫోన్ లో బ్యాటరీ తొలగించలేనిది అయితే ఫోను తుడిచి కొన్ని గంటలపాటు గాలిలో ఆరనివ్వడం మంచిది. వర్షంలో తడిసిన తర్వాత మొబైల్ ని ఆన్ చేస్తే చాలా ప్రమాదం అవుతుందట.. వెంటనే పనిచేస్తుందని చెప్పి మొబైల్ ని అసలు వాడకూడదట. ఫోన్ నీటిలో తడిసి ఉంటే దానిని తుడిచి సరిగ్గా ఆరబెట్టాలి ఆ తర్వాతే వాటిని వాడడం మంచిది.


నీటి బిందువులు లోపలే ఉండడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.  అందుకే కనీసం నాలుగు గంటలపాటు బియ్యంలో మొబైల్ ని ఉంచితే చాలా మంచిది. మొబైల్లో ఉండే తేమను గ్రహిస్తుంది బియ్యము. అందుచేతనే ఫోన్ తడిచిన వెంటనే దానిని సరిగ్గా తుడిచి బియ్యం బస్తాలో ఉంచాలి. మొబైల్ ఫోన్ పూర్తిగా ఆరే వరకు చార్జింగ్ హెడ్ ఫోన్స్ వంటివి అసలు ఉపయోగించుకోకూడదు. ఎందుకంటే ఇలాంటివి చేయడం వల్ల డిస్ప్లే మీద సింబల్స్ అలాగే కనిపిస్తూ ఉంటాయి. అయితే వర్షాకాలం రాబోతున్న తరుణంలో మొబైల్ సేఫ్టీ గా ఉండేందుకు ప్లాస్టిక్ జిప్ కవర్లు వంటివి దొరుకుతూ ఉంటాయి. వాటిని తీసుకొని అందులో సేఫ్ గా మొబైల్ ని ఉంచుకోవడం మంచిది.



RRR Telugu Movie Review Rating

ఒకప్పుడు టీమిండియా ఓపెనర్.. ఇప్పుడు సినిమా హీరో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>