MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/yatra-225825745-a8b9-4dd6-a6a7-d4b521ea697b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/yatra-225825745-a8b9-4dd6-a6a7-d4b521ea697b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర కథాంశంగా నాలుగేళ్ల క్రితం యాత్ర సినిమా తెరకెక్కింది.2019 అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ సినిమా విడుదలై మంచి హిట్ అయింది.దర్శకుడు మహీ వీ రాఘవ్ ఆ సినిమాని తెరకెక్కించిన తీరు ప్రశంసలను అందుకుంది. ఇక 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి చేసిన సుదీర్ఘ పాదయాత్ర ఆధారంగా మహీ వీ రాఘవ్ యాత్ర సీక్వెల్ ని చేస్తున్నారు. ఈ 'యాత్ర 2' సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్, విడుదల తేదీని నేడు చిత్ర యూనిYATRA 2{#}dr rajasekhar;Andhra Pradesh;Hanu Raghavapudi;Assembly;February;Yatra;Posters;Telangana Chief Minister;Jagan;Reddy;Cinemaఆకట్టుకుంటున్న యాత్ర 2 మోషన్ పోస్టర్?ఆకట్టుకుంటున్న యాత్ర 2 మోషన్ పోస్టర్?YATRA 2{#}dr rajasekhar;Andhra Pradesh;Hanu Raghavapudi;Assembly;February;Yatra;Posters;Telangana Chief Minister;Jagan;Reddy;CinemaSat, 08 Jul 2023 18:57:06 GMTఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర కథాంశంగా నాలుగేళ్ల క్రితం యాత్ర సినిమా తెరకెక్కింది.2019 అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ సినిమా విడుదలై మంచి హిట్ అయింది.దర్శకుడు మహీ వీ రాఘవ్ ఆ సినిమాని తెరకెక్కించిన తీరు ప్రశంసలను అందుకుంది. ఇక 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి చేసిన సుదీర్ఘ పాదయాత్ర ఆధారంగా మహీ వీ రాఘవ్ యాత్ర సీక్వెల్ ని చేస్తున్నారు. ఈ 'యాత్ర 2' సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్, విడుదల తేదీని నేడు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఇక యాత్ర మొదటి భాగం 2019 ఎన్నికలకు ముందు వస్తే.. ఈ యాత్ర-2 వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో సార్వత్రిక ఎన్నికలకు సుమారు మూడు నెలల ముందు విడుదల అవుతుంది. అంటే 2024 ఫిబ్రవరి యాత్ర 2 రానుంది. ఈ విషయాన్ని మోస్టర్ పోస్టర్ వీడియోలో మూవీ యూనిట్ తెలిపింది.


ఇక మోషన్ పోస్టర్ విషయానికి వస్తే.. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలను ఆప్యాయంగా పలుకరించే.. "నమస్తే బాబు, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ.. నమస్తే" అనే వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అవుతుంది. ప్రజలకు అభివాదం చేస్తున్నట్టుగా ఉండే చేతి విగ్రహాన్ని మోషన్ పోస్టర్‌లో బాగా చూపారు. ఆ విగ్రహంపైకి వెళ్లేందుకు వైఎస్ జగన్ మెట్లను ఎక్కుతున్నట్టుగా యానిమేటెడ్ పాత్రను మూవీ యూనిట్ బాగా చూపించింది. అంటే రాజశేఖర రెడ్డి స్థాయికి చేరేందుకు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారని చిత్ర యూనిట్ ఇందులో సింబాలిక్‍గా చెప్పింది.ఇంకా చాలా మంది జగన్ కోసం నినదిస్తున్నట్టు ఉంది.విగ్రహం అరచేతిపైకి చేరుకున్నాక వైఎస్ జగన్ ఫేమస్ డైలాగ్‍లు బ్యాక్‍గ్రౌండ్‍లో వాయిస్ ఓవర్‌గా పెట్టింది మూవీ యూనిట్. 2017 వ సంవత్సరంలో పాదయాత్ర మొదలైన సమయంలో వైఎస్ జగన్ చెప్పిన "నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి.నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని" అనే డైలాగ్ ఈ వాయిస్ ఓవర్‌లో ఉంది. ఇక ఆ తర్వాత  ఫేమస్ డైలాగ్ "నేను విన్నాను.. నేను ఉన్నాను"తో మోషన్ పోస్టర్ ముగిసింది.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

ఆ తేది నుంచి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>