DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/purandheswari287fbdf0-5412-40b2-9c98-e8117c1b28f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/purandheswari287fbdf0-5412-40b2-9c98-e8117c1b28f2-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరీ కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్ర మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు. బీజేపీ జాతీయ స్థాయి నాయకత్వం వివిధ రాష్ట్రాలకు ఇన్ చార్జిలుగా కూడా ఆమెను నియమించింది. కానీ రాష్ట్ర బీజేపీలో అధ్యక్షురాలుగా కావాలన్నది ఆమె కోరిక. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం నుంచి అధ్యక్షులను నియమిస్తే బాగుంటుందని బీజేపీ అధిష్టానానికి పురందేశ్వరీ గత కొన్ని రోజులుగా సూచించారు. ప్రధాని మోదీకి సైతం ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అయిదు రాష్ట్రాల అధ్యక్షులను బీPURANDHESWARI{#}Venkatesh;satya;Kamma;Daggubati Venkateswara Rao;venkaiah naidu;central government;News;Congress;Party;Prime Minister;Bharatiya Janata Party;Andhra Pradeshపురందేశ్వరి ఎంపిక వెనుక.. ఇంత కులరాజకీయమా?పురందేశ్వరి ఎంపిక వెనుక.. ఇంత కులరాజకీయమా?PURANDHESWARI{#}Venkatesh;satya;Kamma;Daggubati Venkateswara Rao;venkaiah naidu;central government;News;Congress;Party;Prime Minister;Bharatiya Janata Party;Andhra PradeshSat, 08 Jul 2023 23:00:00 GMTఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరీ కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్ర మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు. బీజేపీ జాతీయ స్థాయి నాయకత్వం వివిధ రాష్ట్రాలకు ఇన్ చార్జిలుగా కూడా ఆమెను నియమించింది. కానీ రాష్ట్ర బీజేపీలో అధ్యక్షురాలుగా కావాలన్నది ఆమె కోరిక. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం నుంచి అధ్యక్షులను నియమిస్తే బాగుంటుందని బీజేపీ అధిష్టానానికి పురందేశ్వరీ గత కొన్ని రోజులుగా సూచించారు. ప్రధాని మోదీకి సైతం ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది.


అయితే అయిదు రాష్ట్రాల అధ్యక్షులను బీజేపీ మార్చింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరీని నియమించారు. అంతకుముందు బీజేపీ అధ్యక్షులను మారుస్తూ నిర్ణయం తీసుకుంటుందనే వార్తలు వినిపించిన సమయంలో అందరూ సత్య కుమార్ కు బీజేపీ అధ్యక్ష పదవి ఖాయమైపోయిందనే వార్తలు వినిపించాయి. సత్యకుమార్ వెంకయ్య నాయుడు శిష్యుడు కావడం, సత్యకుమార్ ముందు నుంచి బీజేపీలో నే ఉండడం కలిసొచ్చే అంశమని అందరూ భావించారు.   కానీ బీజేపీ అధిష్టానం అందరికీ షాకిస్తూ పురందేశ్వరీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు.


పురందేశ్వరీ నియామకం వెనక పెద్ద ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో పురందేశ్వరీ కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకురాలు కావడం, ఆమెకు కాంగ్రెస్ లో ఉన్న నాయకులు టచ్ లో ఉండడం. గతంలో కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రిగా పని చేయడంతో క్షేత్ర స్థాయిలో కూడా ఆమెకు కార్యకర్తలతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఇది క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ లో ఉన్నవారందరినీ బీజేపీలో చేర్పించడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని అధిష్టానం నమ్మకం పెట్టుకుంది.


ఏపీలో బీజేపీ టీడీపీతో, జనసేనతో కలిసి వెళితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి. వారితో కలిసి ఆమె ఎలా ప్రయాణిస్తారు. ఒక వేళ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ప్రజల్లోకి పార్టీని ఎలా తీసుకెళ్లగలుగుతారనే సందేహాలు పార్టీ కార్యకర్తల్లో నెలకొన్నాయి. బీజేపీని ఆంధ్రలో గెలిపించడం అంత సులభం కాదని ఆమెకు తెలుసే.. ముందున్న సవాళ్లను ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

'రంగబలి' మూవీ ను అన్నీ కోట్లకు కొన్న డిజిటల్ ఓటీటీ సంస్థ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>