MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi8048c2fa-de00-4da7-9dbc-c53fe64e8087-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi8048c2fa-de00-4da7-9dbc-c53fe64e8087-415x250-IndiaHerald.jpgఈ జూలై నెలాఖరు వరకు చిన్న సినిమాల హడావిడి మాత్రమే కనిపిస్తుంది. అయితే ఈనెల 28 నుండి మళ్ళీ బాక్సాఫీస్ కు కళ వస్తుందని అంచనాలు వస్తున్నాయి. దీనికి కారణం పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ల కలయికతో వస్తున్న ‘బ్రో’ మూవీ పవన్ భగవంతుడిగా కనిపించే ఈమూవీలో తేజ్ పవన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఈమూవీకి హైలెట్ అంటున్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ పదునైన మాటలు సముద్రఖని దర్శకత్వం ఈమూవీ పై విపరీతమైన అంచనాలు పెంచుతున్నాయి. ఈమూవీకి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ మ్యానియాను తనకు అనుకూCHIRANGEEVI{#}silver screen;Samuthirakani;Athidhi;Anandam;August;festival;kalyan;Chiranjeevi;News;Cinema;srinivasబ్రో సహకారంతో భోళాశంకర్ !బ్రో సహకారంతో భోళాశంకర్ !CHIRANGEEVI{#}silver screen;Samuthirakani;Athidhi;Anandam;August;festival;kalyan;Chiranjeevi;News;Cinema;srinivasSat, 08 Jul 2023 08:00:00 GMTఈ జూలై నెలాఖరు వరకు చిన్న సినిమాల హడావిడి మాత్రమే కనిపిస్తుంది. అయితే ఈనెల 28 నుండి మళ్ళీ బాక్సాఫీస్ కు కళ వస్తుందని అంచనాలు వస్తున్నాయి. దీనికి కారణం పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ల కలయికతో వస్తున్న ‘బ్రో’ మూవీ పవన్ భగవంతుడిగా కనిపించే ఈమూవీలో తేజ్ పవన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఈమూవీకి హైలెట్ అంటున్నారు.


త్రివిక్రమ్ శ్రీనివాస్ పదునైన మాటలు సముద్రఖని దర్శకత్వం ఈమూవీ పై విపరీతమైన అంచనాలు పెంచుతున్నాయి. ఈమూవీకి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ మ్యానియాను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ‘భోళాశంకర్’ ప్రయత్నిస్తోంది. ‘బ్రో’ విడుదలైన రెండు వారాల గ్యాప్ తో విడుదల కాబోతున్న ఈసినిమాతో జూలై ఆగష్టు నెలలు రెండు మెగా ఫ్యామిలీ హీరోలకు అంకితం అవుతాయని మెగా ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు.


ఇప్పటికే విడుదలైన ‘భోళాశంకర్’ టీజర్ కు మంచి స్పందన రావడంతో ఆమూవీ పై కూడ అంచనాలు బాగా ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసుకోవడానికి ‘భోళాశంకర్’ ‘బ్రో’ మ్యానియాను వాడుకోబోతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ‘బ్రో’ ప్రదర్శించే అన్ని ధియేటర్లలోను ‘భోళాశంకర్’ ట్రైలర్ ను ప్రదర్శించి మెగా అభిమానులకు పండుగ వాతావరణాన్ని చూపెడతారని తెలుస్తోంది.


సాధారణంగా ధియేటర్లలో పవన్ సినిమా అంటే అభిమానుల హడావిడి ఒక రేంజ్ లో ఉంటుంది. అలాంటిది పవన్ సినిమాతో పాటు రాబోతున్న చిరంజీవి సినిమా ట్రైలర్ ను కూడ వెండి తెర పై ఒకేసారి చూసే అవకాశం మెగా అభిమానులకు వచ్చినప్పుడు వారి ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో అంచనాలకు కూడ అందదు. పవన్ చిరంజీవిలు ఒకే సినిమాలో కలిసి నటించాలి అన్న కోరిక మెగా అభిమానులకు తీరలేదు. అప్పుడప్పుడు పవన్ చిరంజీవి సినిమాలలో అతిధి పాత్రలో మాత్రమే కనిపించాడు. ఇప్పుడు వారిద్దరు కలిసి నటించకపోయినా వారి సినిమాలు ఒకే ధియేటర్ లో చూసే అవకాశం మెగా అభిమానులకు లభిస్తోంది అనుకోవాలి..  





RRR Telugu Movie Review Rating

చీర కట్టులో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>