Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak3bfd6b3b-61b9-4f42-a8af-ad445bcef2e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak3bfd6b3b-61b9-4f42-a8af-ad445bcef2e8-415x250-IndiaHerald.jpgఈ ఏడాది భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ కోసం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇటీవల పూర్తిస్థాయి షెడ్యూల్ ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ నేపథ్యంలో ఇక ఏ మైదానంలో ఎవరితో మ్యాచ్ ఆడబోతున్నాము అనే విషయంపై అన్ని జట్లకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇక ఐసీసీ షెడ్యూల్ ఆధారంగానే ఇక తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో అన్ని జట్లు నిమగ్నమయ్యాయి. ఇలాంటి సమయంలో అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఒక వింత విజ్ఞప్తిని ఐసిసి ముందు ఉంచింది అన్న విషయం తెలిసిందే. చెపాక్ స్టేడియంలో ఆఫ్ఘPak{#}Cricket;Audi;Chepauk;Babur;World Cup;Pakistan;Indiaపాక్ బోర్డు ఒకలా.. కెప్టెన్ మరోలా.. బాబర్ ఏమన్నాడో తెలుసా?పాక్ బోర్డు ఒకలా.. కెప్టెన్ మరోలా.. బాబర్ ఏమన్నాడో తెలుసా?Pak{#}Cricket;Audi;Chepauk;Babur;World Cup;Pakistan;IndiaSat, 08 Jul 2023 08:30:00 GMTఈ ఏడాది భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ కోసం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇటీవల పూర్తిస్థాయి షెడ్యూల్ ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ నేపథ్యంలో ఇక ఏ మైదానంలో ఎవరితో మ్యాచ్ ఆడబోతున్నాము అనే విషయంపై అన్ని జట్లకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇక ఐసీసీ షెడ్యూల్ ఆధారంగానే ఇక తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో అన్ని జట్లు నిమగ్నమయ్యాయి. ఇలాంటి సమయంలో అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఒక వింత విజ్ఞప్తిని ఐసిసి ముందు ఉంచింది అన్న విషయం తెలిసిందే.


 చెపాక్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మ్యాచ్ ను.. బెంగళూరు స్టేడియంలో  ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ వేదికలను మార్చాలి అంటూ ఒక వింత విజ్ఞప్తిని చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. కానీ అటు ఐసీసీ మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి పై స్పందించలేదు. ఈ క్రమంలోనే ఆ దేశ మాజీ ఆటగాళ్లు కూడా పాక్ క్రికెట్ బోర్డు అభ్యర్థన పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసే విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రిక్వెస్ట్ ఉంది అంటూ విమర్శలు గుర్తించారు అని చెప్పాలి. ఎక్కడైనా ఆడి గెలవగలం అని పాకిస్తాన్ ప్లేయర్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారని.. కానీ ఇప్పుడు ఇలాంటి రిక్వెస్ట్లు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతిస్తాయి అంటూ అభిప్రాయపడ్డారు.



 అయితే ఇటీవలే ఇదే విషయంపై పాకిస్తాన్ కెప్టెన్గా ఉన్న బాబర్ అజాం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఎక్కడైనా ఆడెందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ పాక్ కెప్టెన్ బాబర్ అజాం ఇటీవల వెల్లడించాడు. భారత్లో కొన్ని మైదాననాల్లో పాక్ ఆడేందుకు సుముఖంగా లేదన్న కథనాలపై ఇక ఇటీవల స్పష్టత వచ్చింది. తాము ప్రపంచ కప్ ఆడేందుకు వెళ్తున్నామని కేవలం భారత్తో మాత్రమే ఆడట్లేదు అంటూ కామెంట్ చేశాడు. వరల్డ్ కప్ లో అన్ని జట్లతో మ్యాచ్లు ఆడుతామని.. ప్రొఫెషనల్స్ గా ఆడేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ బాబర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారిపోయాయి.



RRR Telugu Movie Review Rating

చీర కట్టులో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>