MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukh-khan970bec38-656e-48d9-9b81-fe37ddd85f77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukh-khan970bec38-656e-48d9-9b81-fe37ddd85f77-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‏కు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షలాది అభిమానులు ఉన్నారు.ప్రస్తుతం జవాన్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు షారుఖ్ ఖాన్. ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తుండగా..తమిళ హీరోయిన్ నయనతార కథానాయికగా నటిస్తోంది. అట్లీ, షారుఖ్ కాంబోలో రాబోతున్న ఈ మూవీపై అభిమానుల్లో చాలా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా షారుఖ్ పై పాకిస్తాన్ నటి మహనూర్ బలోచ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. షారుఖ్ ఖాన్ అంత అందగాడు ఏం కాదని.. అతడికి అసలు నటన కూడా రాదంటూ ఆమె చెప్పుSHARUKH KHAN{#}Shahrukh Khan;Pakistan;Kollywood;netizens;atlee kumar;Jawaan;september;Industry;Heroine;bollywood;Hollywood;Hero;Cinemaషారుఖ్‏ పై పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసిన పాకిస్తాన్ నటి?షారుఖ్‏ పై పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసిన పాకిస్తాన్ నటి?SHARUKH KHAN{#}Shahrukh Khan;Pakistan;Kollywood;netizens;atlee kumar;Jawaan;september;Industry;Heroine;bollywood;Hollywood;Hero;CinemaSat, 08 Jul 2023 19:25:00 GMTబాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‏కు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షలాది అభిమానులు ఉన్నారు.ప్రస్తుతం జవాన్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు షారుఖ్ ఖాన్. ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తుండగా..తమిళ హీరోయిన్ నయనతార కథానాయికగా నటిస్తోంది. అట్లీ, షారుఖ్ కాంబోలో రాబోతున్న ఈ మూవీపై అభిమానుల్లో చాలా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా షారుఖ్ పై పాకిస్తాన్ నటి మహనూర్ బలోచ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. షారుఖ్ ఖాన్ అంత అందగాడు ఏం కాదని.. అతడికి అసలు నటన కూడా రాదంటూ ఆమె చెప్పుకొచ్చింది. కానీ అతను మాత్రం పెద్ద బిజినెస్ మెన్ అని.. తనను తాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో అతనికి బాగా తెలుసనని చెప్పుకొచ్చింది. మహనూర్ బలోచ్ చేసిన కామెంట్స్ పై షారుఖ్ అభిమానులు చాలా తీవ్రంగా మండిపడుతున్నారు.


ఇక ప్రస్తుతం మహనూర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతుండగా.. షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఆమెపై ఒక రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె షారుఖ్ ఖాన్ పై ఇలా కామెంట్స్ చేస్తుందని నెటిజన్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి.ఈ మహనూర్ బలోచ్ విషయానికి వస్తే ఈమె అమెరికాలో జన్మించిన కెనడియన్ పాకిస్థానీ నటి. ఈమె మాజీ మోడల్ అలాగే ఫిల్మ్ డైరెక్టర్.1993 వ సంవత్సరంలో మార్వి అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టింది బలోజ్. ఆ తర్వాత 2013 వ సంవత్సరంలో హాలీవుడ్ లోని టోర్న్ లో మరియమ్ పాత్రను పోషించింది. ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్ నటిస్తోన్న జవాన్ చిత్రం సెప్టెంబర్ 7 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో మంచి ఇండస్ట్రీ హిట్ ని దక్కించుకున్నాడు. ఈ సినిమా 1000 కోట్లు రాబట్టి వరుస ప్లాపులతో సతమతం అవుతున్న షారుక్ ని ఇంకా బాలీవుడ్ ని కాపాడింది.



RRR Telugu Movie Review Rating

ఆ తేది నుంచి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>