Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajola32c3ce8-7297-45e3-a9aa-d7852fb38714-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajola32c3ce8-7297-45e3-a9aa-d7852fb38714-415x250-IndiaHerald.jpgఒకప్పుడు సినిమా అంటే.. నాలుగు పాటలు నాలుగు ఫైట్లు రెండు ఎమోషనల్ సీన్స్ ఉంటే చాలు సూపర్ హిట్ అనుకునేవారు. ఇక హీరోలు కూడా ఇక ఇలాంటి సీన్స్ దట్టించి కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు సినీ ప్రేక్షకుల పంథా మారిపోయింది. ఇక ప్రతి సినిమాలో కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు లేకపోయినా పరవాలేదు. కానీ కథ బలంగా ఉండి కొత్తగా ఉంటే సరిపోతుంది అని భావిస్తున్నారు. దీంతో చిన్న సినిమాలకు కూడా బ్లాక్ బస్టర్ హిKajol{#}Kajol;Comedy;Lust Stories;bollywood;Blockbuster hit;Heroine;Cinemaఏడుపుగొట్టు పాత్రలు చేసే విసిగిపోయా.. ఇక అలాంటివే చేస్తా : కాజోల్ఏడుపుగొట్టు పాత్రలు చేసే విసిగిపోయా.. ఇక అలాంటివే చేస్తా : కాజోల్Kajol{#}Kajol;Comedy;Lust Stories;bollywood;Blockbuster hit;Heroine;CinemaSat, 08 Jul 2023 09:05:00 GMTఒకప్పుడు సినిమా అంటే.. నాలుగు పాటలు నాలుగు ఫైట్లు రెండు ఎమోషనల్ సీన్స్ ఉంటే చాలు సూపర్ హిట్ అనుకునేవారు. ఇక హీరోలు కూడా ఇక ఇలాంటి సీన్స్ దట్టించి కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు సినీ ప్రేక్షకుల పంథా మారిపోయింది. ఇక ప్రతి సినిమాలో కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు లేకపోయినా పరవాలేదు. కానీ కథ బలంగా ఉండి కొత్తగా ఉంటే సరిపోతుంది అని భావిస్తున్నారు. దీంతో చిన్న సినిమాలకు కూడా బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం.


 అయితే కేవలం సినిమా ప్రేక్షకులు మాత్రమే కాదండోయ్ అటు నటీనటులు కూడా ఇలాగే తమ పంతా మార్చుకుంటున్నారు. ఒకప్పుడు కమర్షియల్ హీరోగా మారితే చాలు ఇంకేం అవసరం లేదు అనుకునేవారు. కానీ ఇప్పుడు ప్రేక్షకులను కొత్తగా ఏదో ఒక విధంగా ఎంటర్టైన్ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక వెండితెరపై కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఓటీటి వేదికగా విభిన్నమైన వెబ్ సిరీస్ లతో అలరిస్తూ ఉండడం గమనార్హం. ఇలా తమ డ్రీమ్ రోల్స్ వస్తే వెబ్ సిరీస్లలో నటించేందుకు సిద్ధమైపోతున్నారు. దీంతో ఇక వెబ్ సిరీస్ ల కారణంగా అటు తమకు తెలిసిన నటీనటులను  కొత్తగా చూడగలుగుతున్నారు ప్రేక్షకులు.


 ఇకపోతే ఇటీవల లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించి అందరిని ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ఇటీవలే తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏడుపు గొట్టు పాత్రలు చేసి విసుగు వచ్చిందని తెలిపింది కాజోల్. గ్లిజరిన్ వాడి విసిగిపోయాను. ఇకపై ఏడ్చే సీన్స్ ఉంటే కెమెరాతో దూరం నుంచి షూట్ చేయండి.. నేను వెనకకు తిరిగి ఏడుస్తున్నట్లు భుజాలు ఊపుతాను అంటూ చెప్పేశాను. నాకు ఇకపై కామెడీ పాత్రలు చేయాలని ఉంది అంటూ కాజోల్ తెలిపింది. కాగా ఆమె నటించిన ది ట్రయల్ సినిమా త్వరలో విడుదల కాబోతుంది.



RRR Telugu Movie Review Rating

లీక్ అయిన అల్లు అర్జున్,త్రివిక్రమ్ మూవీ స్టోరీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>