MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyanraam82983c21-8d01-4eda-9a6b-6569351de600-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyanraam82983c21-8d01-4eda-9a6b-6569351de600-415x250-IndiaHerald.jpgకళ్యాణ్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 18 సంవత్సరాల తరువాత నిజమైన హిట్ అన్నపదం ‘బింబిసార’ అతడికి పరిచయంచేసింది. అయితే ఆ ఆనందం ఎక్కువకాలం నిలబడకుండా ఆతరువాత వచ్చిన ‘అమిగోస్’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో మళ్ళీ కళ్యాణ్ రామ్ కు ఫ్లాప్ ల గండాలు మొదలయ్యాయి. ఒకవైపు సినిమాలలో హీరోగా నటిస్తూ మరొకవైపు భారీ సినిమాలను తీస్తూ నిర్మాతగా సెటిల్ అవ్వాలని కళ్యాణ్ రామ్ ప్రయత్నిస్తున్నాడు.ఈప్రయత్నాల మధ్య కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలచేసిన అతడి లేటెస్ట్ మూవీ ‘డెవిల్’ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈసినిమా ప్రాkalyanraam{#}kalyan ram;Tollywood;Hollywood;Darsakudu;Medaram;Anandam;ram pothineni;Cinema;Directorబింబిసార ను మరవలేని డెవిల్ !బింబిసార ను మరవలేని డెవిల్ !kalyanraam{#}kalyan ram;Tollywood;Hollywood;Darsakudu;Medaram;Anandam;ram pothineni;Cinema;DirectorFri, 07 Jul 2023 08:00:00 GMTకళ్యాణ్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 18 సంవత్సరాల తరువాత నిజమైన హిట్ అన్నపదం ‘బింబిసార’ అతడికి పరిచయంచేసింది. అయితే ఆ ఆనందం ఎక్కువకాలం నిలబడకుండా ఆతరువాత వచ్చిన ‘అమిగోస్’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో మళ్ళీ కళ్యాణ్ రామ్ కు ఫ్లాప్ ల గండాలు మొదలయ్యాయి. ఒకవైపు సినిమాలలో హీరోగా నటిస్తూ మరొకవైపు భారీ సినిమాలను తీస్తూ నిర్మాతగా సెటిల్ అవ్వాలని కళ్యాణ్ రామ్ ప్రయత్నిస్తున్నాడు.


ఈప్రయత్నాల మధ్య కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలచేసిన అతడి లేటెస్ట్ మూవీ ‘డెవిల్’ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈసినిమా ప్రారంభదశలో పెద్దగా హడావిడి చేయని ఈమూవీ నిర్మాతలు ఇప్పుడు విడుదలచేసిన ఈమూవీ టీజర్ ను చూసి చాలమంది షాక్ అయ్యారు. స్వాతంత్రం ముందు జరిగిన ఒక కథ అన్న విధంగా కనిపిస్తున్న ఈమూవీలో కళ్యాణ్ రామ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌‌గా కనిపించి ఒక్కసారిగా ప్రేక్షకులను ఆకాలంలోకి తీసుకు వెళ్ళే విధంగా ఈ టీజర్ ఉండటంతో అందరికీ ఈమూవీ పై ఆశక్తి పెరిగింది.


కళ్యాణ్ రామ్ పాత్రతో పాటు ఈటీజర్ లోని అన్నివిషయాలు ఆశక్తిగా కనిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ది బెస్ట్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్న సినిమాగా ఈసినిమా మారే ఆస్కారం కనిపిస్తోంది. అయితే ఈటీజర్ చివరిలో ‘A Film by Abishek pictures’ అని వేశారు కానీ ఈసినిమా దర్శకుడు పేరు వేయకపోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. నిజానికి ఈసినిమాను ప్రకటించినపుడు దర్శకుడిగా నవీన్ మేడారం ను దర్శకుడుగా ప్రకటించారు.


అతడు హాలీవుడ్ లో  ‘హ్యారీ పోటర్’ లాంటి పలుచిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో నవీన్ పనిచేశాడు అని అంటారు. మరి అలాంటి వ్యక్తి పేరు దర్శకుడుగా ఈమూవీ టీజర్ లో ఎందుకు వేయలేదు అన్న సందేహాలు కొందరికి వస్తే కళ్యాణ్ రామ్ ఈసినిమాకు ఘోస్ట్ డైరెక్టర్ గా పనిచేసాడ అంటూ మరికొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే నవీన్ ఇప్పటికీ ప్రాజెక్టులో భాగమైనట్లే కనిపిస్తోంది అంటూ ఇంత పెద్ద ప్రాజెక్టు అతను ఒక్కడే హ్యాండిల్ చేయలేడని డైరెక్షన్ బాధ్యతలను ఒక టీంకు అప్పగించి ఉంటారు అంటూ మరికొందరి ఊహ..





RRR Telugu Movie Review Rating

చీర కట్టులో ఆ అందాలను ప్రదర్శిస్తున్న శోభిత ధూళిపాల..!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>