PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/yellow-media-jagan-amaravati4e139b01-74b1-41bf-b4cb-485dae307ee3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/yellow-media-jagan-amaravati4e139b01-74b1-41bf-b4cb-485dae307ee3-415x250-IndiaHerald.jpgఈరోజు అదే వార్తకు ఫాలోప్ గా కోర్టు కేసులు తేలాక చూద్దాం అని కేంద్రం రివర్సయ్యిందని ఎంత ఆనందంగా వార్తను రాసుకుందో. వేలాది ఇళ్ళని మంజూరు చేసిందన్న ఆరోజు బాధ ఈరోజు తీరిపోయుంటుంది. అంతగా అవసరమనుకుంటే రాష్ట్రప్రభుత్వమే ఇళ్ళను సొంత ఖర్చులతో నిర్మించుకోవాలని సలహా ఇచ్చిందట. ఇళ్ళనిర్మాణాల కోసం ఈనెల 8వ తేదీన జరగాల్సిన శంకుస్ధాపన ఆగిపోయిందని చెప్పింది. yellow media jagan amaravati{#}Capital;Jagan;courtఅమరావతి : ఎల్లోమీడియాది మరీ ఇంత శాడిజమా ?అమరావతి : ఎల్లోమీడియాది మరీ ఇంత శాడిజమా ?yellow media jagan amaravati{#}Capital;Jagan;courtFri, 07 Jul 2023 05:00:00 GMT


ఎల్లోమీడియా తన శాడిజమంతా బయటపెట్టుకుంటోంది. రాష్ట్రానికి మంచి జరిగే విషయాలను అయితే కనబడకుండా లోపలపేజీల్లో వేస్తోంది. అదే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జరిగిందంటే మాత్రం మొదటిపేజీల్లో అచ్చేస్తోంది. ఎల్లోమీడియా శాడిజం ఏ స్ధాయికి చేరుకున్నదంటే జగన్ కు నెగిటివ్ అంటే రాష్ట్రానికి నష్టం అన్న విషయాన్ని కూడా మరచిపోతోంది. ఎల్లోమీడియా లెక్క ఏమిటంటే జగన్ కు నెగిటివ్ అంటే తమకు, చంద్రబాబునాయుడుకు పాజిటివ్ అనే ధృక్పదంతో వ్యవహరిస్తోంది. దీన్నే అందరు శాడిజమంటారు.





‘కోర్టు కేసులు తేలాక చూద్దాం’ అనే హెడ్డింగ్ తో సెకండ్ బ్యానర్ స్టోరీని అచ్చేసింది. విషయం ఏమిటంటే ఈమధ్యనే రాజధాని అమరావతి ప్రాంతంలో ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ళ నిర్మించేందుకు కేంద్రప్రభుత్వం మొదటివిడతలో 47 వేల ఇళ్ళను మంజూరుచేసింది. రెండో ఫేజ్ లో మిగిలిన 3 వేల చిల్లర ఇళ్ళను మంజూరుచేస్తామని హామీఇచ్చింది. దీన్ని ఎల్లోమీడియా అస్సలు తట్టుకోలేకపోయింది. కోర్టులో కేసులుండగా కేంద్రం ఇళ్ళను ఎలామంజూరుచేస్తుంది ? రేపు కోర్టులో కేసు రివర్సయితే అప్పుడు మంజూరుచేసిన రు. 705 కోట్లు నష్టమే కదా ? అంటు గోలచేసింది. ఇళ్ళు కావాలని జగన్ అడిగిన నెలలోనే 47 వేల ఇళ్ళను కేంద్రం మంజూరుచేస్తుందా అంటు భోరున ఏడ్చేసేసింది.






ఈరోజు అదే వార్తకు ఫాలోప్ గా కోర్టు కేసులు తేలాక చూద్దాం అని కేంద్రం రివర్సయ్యిందని ఎంత ఆనందంగా వార్తను రాసుకుందో. వేలాది ఇళ్ళని మంజూరు చేసిందన్న ఆరోజు బాధ ఈరోజు తీరిపోయుంటుంది. అంతగా అవసరమనుకుంటే రాష్ట్రప్రభుత్వమే ఇళ్ళను సొంత ఖర్చులతో నిర్మించుకోవాలని సలహా ఇచ్చిందట. ఇళ్ళనిర్మాణాల కోసం ఈనెల 8వ తేదీన జరగాల్సిన శంకుస్ధాపన ఆగిపోయిందని చెప్పింది.





ఎల్లీమీడియా ఉద్దేశ్యంలో ఏమిటంటే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో జగన్ జనాల్లో ఎక్కడ పాతుకుపోతారో ? 2024 ఎన్నికల్లో జగనే ఎక్కడ గెలుస్తారో అనే భయం పెరిగిపోతోంది. రెండోసారి జగన్ సీఎం అయితే జరగబోయేది ఏమిటో చంద్రబాబు, ఎల్లోమీడియాకు బాగా తెలుసు. అందుకనే జనాల మైండ్ సెట్ మార్చేందుకు ఎల్లోమీడియా చేయని ప్రయత్నంలేదు. ప్రతిరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా టన్నుల కొద్దీ వార్తలు, కథనాలను వండి వారుస్తోంది. జనాలకు మంచి జరిగే వార్తలను పక్కనపెట్టేసి నెగిటివ్ వార్తలను మాత్రమే బాగా హైలైట్ చేస్తోంది. ఈరోజు వార్త కూడా ఇందులో భాగమే.





RRR Telugu Movie Review Rating

చీర కట్టులో ఆ అందాలను ప్రదర్శిస్తున్న శోభిత ధూళిపాల..!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>