HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthb19eeb85-9553-4ef4-9bf7-d2ec74a568fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthb19eeb85-9553-4ef4-9bf7-d2ec74a568fe-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనం నువ్వులను కేవలం కొన్ని వంటలకు మాత్రమే ఉపయోగిస్తాం. కానీ వీటిలో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ నువ్వులు చాలా చిన్నగా ఉన్నా.. ఇవి మన ఆరోగ్యానికి చేసే మేలు మాత్రం అసలు అంతా ఇంతా కాదు. రెగ్యులర్ గా నువ్వులను తీసుకుంటే చాలా రోగాల ముప్పు తగ్గుతుంది. నువ్వుల్లో విటమిన్లు ఇంకా క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి.జ్ఞాపకశక్తిని పెంచడానికి, మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి నువ్వులు చాలా బాగా సహాయపడతాయి.ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ కొద్ది మొత్తంలో నువ్వులను తీసుకోవడం వల్ల బ్లడ్HEALTH{#}Potassium;Iron;Calcium;Sugar;Magnesium;Cholesterol;Manam;Shaktiనువ్వులు ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?నువ్వులు ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?HEALTH{#}Potassium;Iron;Calcium;Sugar;Magnesium;Cholesterol;Manam;ShaktiFri, 07 Jul 2023 17:51:34 GMTసాధారణంగా మనం నువ్వులను కేవలం కొన్ని వంటలకు మాత్రమే ఉపయోగిస్తాం. కానీ వీటిలో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ నువ్వులు చాలా చిన్నగా ఉన్నా.. ఇవి మన ఆరోగ్యానికి చేసే మేలు మాత్రం అసలు అంతా ఇంతా కాదు. రెగ్యులర్ గా నువ్వులను తీసుకుంటే చాలా రోగాల ముప్పు తగ్గుతుంది. నువ్వుల్లో విటమిన్లు ఇంకా క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి.జ్ఞాపకశక్తిని పెంచడానికి, మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి నువ్వులు చాలా బాగా సహాయపడతాయి.ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ కొద్ది మొత్తంలో నువ్వులను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.అలాగే ఈ నువ్వులు దంతాలకు కూడా మంచి మేలు చేస్తాయి. ఈ నువ్వులు దంతాలకు అంటుకున్న ఫలకాన్ని తొలగిస్తాయి. దీంతో మీ నోరు చాలా శుభ్రంగా ఉంటుంది. నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఇంకా పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి దంతాలను, ఎముకలను చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి.పిల్లలకు రోజు నువ్వులను ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


 ఇంకా జుట్టు రాలడం కూడా బాగా తగ్గుతుంది. నువ్వులు మన జుట్టును మృదువుగా ఇంకా నల్లగా మారుస్తాయి. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను ను తగ్గించడానికి ఇంకా మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి కూడా ఈ నువ్వులు ప్రయోజనకరంగా ఉంటాయి.నువ్వులలో పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు 41%, మోనోశాచురేటెడ్ కొవ్వులు 39% వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు  ఉంటాయి. ఇది రక్త ప్రసరణను పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. నువ్వుల్లో ఇతర ఖనిజాలు, పోషకాలతో పాటు ఇనుము, మెగ్నీషియం ఇంకా జింక్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను ఈజీగా తగ్గిస్తాయి. అలాగే నువ్వులు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే రక్త కణాల నిర్మాణానికి సహాయపడతాయి.ఇంకా అలాగే ఈ నువ్వుల్లో ఫైబర్ కంటెంట్ చాలా పుష్కలంగా ఉంటుంది. అందుకే జీర్ణ సమస్యలను తగ్గించుకోవడానికి కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఈ నువ్వుల్లో ఫైటో ఈస్ట్రోజెన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మహిళల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు చాలా బాగా సహాయపడుతుంది.



RRR Telugu Movie Review Rating

వర్షంలో హాట్ షో తో కృతి సనన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>