Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8af477a5-5972-41cc-87a5-f19fa9475591-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8af477a5-5972-41cc-87a5-f19fa9475591-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా సితార పేరు మారుమోగిపోతంది.అతి చిన్న వయసుకే భారీగా అభిమానులను సంపాదించుకోవడంతో పాటు స్టార్ స్టేటస్ ని కూడా సంపాదించుకుంది సితార. తల్లిదండ్రులు ఇద్దరు సెలబ్రిటీలు కావడంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరిగిందని చెప్పవచ్చు. అతి చిన్న వయసులోనే ఈ రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్న సెలబ్రిటీల పిల్లల్లో సితార నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. socialstars lifestyle{#}Masala;Anandam;Parents;Newyork;sithara;mahesh babu;Father;News;Cinema;Teluguఆ విషయంలో మహేష్ ని దాటిపోయిన అతని కూతురు సితార....!!ఆ విషయంలో మహేష్ ని దాటిపోయిన అతని కూతురు సితార....!!socialstars lifestyle{#}Masala;Anandam;Parents;Newyork;sithara;mahesh babu;Father;News;Cinema;TeluguThu, 06 Jul 2023 20:50:38 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా సితార పేరు మారుమోగిపోతంది.అతి చిన్న వయసుకే భారీగా అభిమానులను సంపాదించుకోవడంతో పాటు స్టార్ స్టేటస్ ని కూడా సంపాదించుకుంది సితార. తల్లిదండ్రులు ఇద్దరు సెలబ్రిటీలు కావడంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరిగిందని చెప్పవచ్చు. అతి చిన్న వయసులోనే ఈ రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్న సెలబ్రిటీల పిల్లల్లో సితార నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక యాడ్ షూటింగ్ చేయడంతో ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో చూసిన ఘట్టమనేని అభిమానులు ఆనందం వ్యక్తం చేయడంతో పాటు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అలాగే చిన్న వయసులో యాడ్ షూట్ లో పాల్గొన్న స్టార్ కిడ్ గా ఘనత సాధించింది. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలోనూ ఎక్కడికో వెళ్లిపోయినట్లు తెలిస్తోంది. చేసింది జ్యూవెల‍్లరీ యాడ్ అయితేనే సితారకు పెద్ద మొత్తమే ఇచ్చారని తెలుస్తోంది. సూపర్‌స్టార్ మహేశ్ ఏడాది లేదా ఏడాదిన్నరకు ఒక సినిమా చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటాడు. కానీ యాడ్స్, ప్రమోషన్స్ రూపంలో మరోవైపు నుంచి గట్టిగానే సంపాదిస్తున్నాడు. పాన్ మసాలా దగ్గర నుంచి సోప్ వరకు ప్రతిదానిలోనూ యాక్ట్ చేస్తుంటాడు. కోట్లకు కోట్లు ఆర్జిస్తుంటాడు. మహేశ్ ఫ్యామిలీ అంతా కలిసి గతంలో ఒక యాడ్ లో కనిపించారు. ఆ తర్వాత కూతురు సితారకు పలు ఆఫర్స్ వచ్చాయట. కానీ ఎందుకో మహేశ్ వాటిని ఒప్పుకోలేదు. ఇప్పుడు మాత్రం జ్యూవెల్లరీ యాడ్ లో సితార నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.కొన్నాళ్ల ముందు ఈ యాడ్ షూట్ జరగ్గా.. ఆ వీడియోని న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ లో తాజాగా ప్రదర్శించారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహేశ్ కూతురు ఎదుగుదల చూసి తెగ ఆనంద పడిపోయాడు. చాలా ఆఫర్లకు ఒప్పుకోని మహేశ్ ఇలా ఈ యాడ్ కి ఎలా అంగీకరించాడా అని మీకు డౌట్ రావొచ‍్చు. అయితే ఇందులో సితార యాక్ట్ చేసినందుకు గానూ ఏకంగా రూ.కోటి ఇచ్చారట. బహుశా మహేశ్ కూడా తన తొలి యాడ్ కోసం కూడా ఇంత తీసుకుని ఉండడు. అందుకే సితార యాడ్ షూట్ కి ఒప్పుకున్నాడేమో? అన్న వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. మొత్తానికి కేవలం తండ్రి మాత్రమే కాకుండా ఇకపై సితార కూడా యాడ్లు షూటింగ్ చేస్తూ ఈ వయసుకే కోటల్లో సంపాదిస్తుందని చెప్పవచ్చు.



RRR Telugu Movie Review Rating

రూ. 100 పరీక్షతో మీ కిడ్నీలు కాపాడుకోండి!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>