MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saamajavaragamanaac5098237-6f17-4c7c-9677-8b3404004373-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saamajavaragamanaac5098237-6f17-4c7c-9677-8b3404004373-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన పెద్ద సినిమాలన్నీ కూడా ఫ్లాప్స్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం వసూళ్లు కూడా రాబట్టలేక బోల్తా కొడుతున్నాయి. కానీ చిన్న సినిమాలు మాత్రం పెద్ద హీరోలు కూడా సాధించని కొన్ని అరుదైన రికార్డ్స్ ని కూడా నెలకొల్పుతున్నాయి. అందుకు ఉదాహరణే రీసెంట్ గా వచ్చిన శ్రీ విష్ణు హీరో గా నటించిన 'సామజవరగమనా' అనే చిత్రం. రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండి బ్లాక్ బస్టర్ మౌత్ టాక్ వచ్చింది.అయితే టాక్ కి తగ్గ వసూళ్లు మొదటి రెండు రోజులు రాలేదు కానీ. మూడవ రోజు నుండి మాత్రం వసూSAAMAJAVARAGAMANAA{#}American Samoa;Nayak;sri vishnu;Box office;Audience;Pawan Kalyan;mahesh babu;House;News;Blockbuster hit;Cinemaసామజవరగమనా: అక్కడ వసూళ్ల సునామి?సామజవరగమనా: అక్కడ వసూళ్ల సునామి?SAAMAJAVARAGAMANAA{#}American Samoa;Nayak;sri vishnu;Box office;Audience;Pawan Kalyan;mahesh babu;House;News;Blockbuster hit;CinemaThu, 06 Jul 2023 18:00:00 GMTటాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన పెద్ద సినిమాలన్నీ కూడా ఫ్లాప్స్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం వసూళ్లు కూడా రాబట్టలేక బోల్తా కొడుతున్నాయి. కానీ చిన్న సినిమాలు మాత్రం పెద్ద హీరోలు కూడా సాధించని కొన్ని అరుదైన రికార్డ్స్ ని కూడా నెలకొల్పుతున్నాయి. అందుకు  ఉదాహరణే రీసెంట్ గా వచ్చిన శ్రీ విష్ణు హీరో గా నటించిన 'సామజవరగమనా' అనే చిత్రం. రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండి బ్లాక్ బస్టర్ మౌత్ టాక్ వచ్చింది.అయితే టాక్ కి తగ్గ వసూళ్లు మొదటి రెండు రోజులు రాలేదు కానీ. మూడవ రోజు నుండి మాత్రం వసూళ్లు ఒక రేంజ్ లో పికప్ అయ్యాయి. మరీ ముఖ్యంగా స్ట్రాంగ్ పుల్ వున్న ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ చిత్రాన్ని బాగా చూసేందుకు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమాకి చాలా ప్రాంతాలలో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి.


ఈ మధ్య కాలం లో ఇలాంటి కలెక్షన్స్ అసలు ఏ సినిమాకి కూడా రాలేదు. ఇకపోతే అమెరికాలో ఇప్పటికే ఈ సినిమా ఏకంగా హాఫ్ మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ముఖ్యంగా  వర్కింగ్ డే నాడు ఈ చిత్రానికి అమెరికా లో వచ్చిన వసూళ్లు ఏకంగా 75 వేల డాలర్లు అట.ఇది గడిచిన కొద్దీ సంవత్సరాల నుండి విడుదలైన పెద్ద స్టార్ హీరోల సినిమాల వసూళ్లకంటే కూడా ఈ సినిమా వసూళ్లు చాలా ఎక్కువే అని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఇంకా మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' చిత్రాలు వర్కింగ్ రోజు కేవలం 45 వేల అమెరికన్ డాలర్లు వసూలు చేసాయి. కానీ 'సామజవరగమనా' సినిమా మాత్రం ఏకంగా 75 వేల డాలర్లు రాబట్టింది అంటే, ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.ఓవర్ సీస్ లో 30 లక్షలు బిజినెస్ చేస్తే దాదాపు 85 లక్షలు దాకా ఈ సినిమా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

ఆయన మీద ప్రేమతో కొడుక్కి ఆ పేరు పెట్టిన కాజల్ అగర్వాల్...!!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>