MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rana-tejaf5a89f94-6feb-4641-a6ed-8d01d385fb9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rana-tejaf5a89f94-6feb-4641-a6ed-8d01d385fb9d-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా హీరో రాణా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమధ్య ఎక్కువగా సినిమాలు చేయకపోయినా సరే ఇటీవల రానా నాయుడు వెబ్ సిరీస్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. ఇక ఈ సిరీస్ కి మిశ్రమ స్పందన లభించింది. ఇకపోతే తాజాగా రానా సినిమా ఎప్పుడు తీస్తాడు అని అభిమానులు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్న సమయంలో డైరెక్టర్ తేజ తో రాక్షస రాజు అనే సినిమాలో చేయడానికి రానా సిద్ధం అయ్యారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే నేనే రాజు నేనే మంత్రి సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.RANA; TEJA{#}Tammudu;Nene Raju Nene Mantri;Thammudu;rana daggubati;teja;Darsakudu;king;Hero;Cinema;India;Directorఫాన్స్ ను భయపెడుతున్న రానా - తేజ.. ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా..?ఫాన్స్ ను భయపెడుతున్న రానా - తేజ.. ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా..?RANA; TEJA{#}Tammudu;Nene Raju Nene Mantri;Thammudu;rana daggubati;teja;Darsakudu;king;Hero;Cinema;India;DirectorWed, 05 Jul 2023 22:00:00 GMTపాన్ ఇండియా హీరో రాణా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమధ్య ఎక్కువగా సినిమాలు చేయకపోయినా సరే ఇటీవల రానా నాయుడు వెబ్ సిరీస్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. ఇక ఈ సిరీస్ కి మిశ్రమ స్పందన లభించింది. ఇకపోతే తాజాగా రానా సినిమా ఎప్పుడు తీస్తాడు అని అభిమానులు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్న సమయంలో డైరెక్టర్ తేజ తో రాక్షస రాజు అనే సినిమాలో చేయడానికి రానా సిద్ధం అయ్యారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే నేనే రాజు నేనే మంత్రి సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

కానీ ఇటీవల తేజ రానా తమ్ముడు అభిరామ్ తో అహింసా సినిమాను తీసి డిజాస్టర్ గా నిలిచారు. మరి దీంతో రానా అభిమానులలో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ సినిమా రానాతో తీస్తే విజయం సాధిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా అహింసా సినిమా ఫలితంతో సంబంధం లేకుండా రానా అలాగే తేజ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులలో చాలా వేగంగా పాల్గొంటున్నారు. ఈ సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర పుకారు ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.

అదేమిటంటే రానా, తేజ కాంబినేషన్లో వస్తున్న రాక్షస రాజు సినిమా ఒక్క పార్ట్ కాదు.. ఏకంగా రెండు పార్ట్ లుగా తీసుకురావడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నారట. హీరో రానా కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. మరి రానా మరియు తేజ కాంబినేషన్లో సినిమా వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే రెండు పార్ట్ లకు సంబంధించిన షూటింగ్ ను ఒకేసారి పూర్తి చేస్తారట. కానీ సినిమాని మాత్రం రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని అనుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చి నిరాశ మిగిల్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు రాక్షస రాజు కూడా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో అని అభిమానులు కలవరపడుతున్నారు.



RRR Telugu Movie Review Rating

బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబమ్మ.. అదృష్టం వరించినట్టేనా..?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?

ఏపీలో పవన్‌.. తెలంగాణలో బండి సంజయ్‌?

అద్భుతాలు సృష్టిస్తున్న భారత కుర్రాళ్లు?

భార్య, భర్త విడిపోతే పిల్లలు తండ్రి వద్ద ఉండొచ్చా?

కేసీఆర్‌కు ఎంఐఎం గుది బండగా మారుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>