HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthe41eb6b8-63dd-40a5-9f09-65596ca6d192-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthe41eb6b8-63dd-40a5-9f09-65596ca6d192-415x250-IndiaHerald.jpgవర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చాలు కొంతమందికి నరకం కనపడుతుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన ఎన్నో రకాల వ్యాధులు వస్తాయి. ఎంతగానో వేధిస్తుంటాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్, ఆస్థమా, న్యుమోనియా, దగ్గు ఇంకా బ్రాంకైటిస్ వంటివి చాలా ఇబ్బంది పెడతాయి.ఈ జబ్బులు ఉన్న వాళ్లు చల్లని నీళ్లు తాగినా ఇంకా చల్లని వాతావరణంలో తిరిగినా ఊపిరి ఆడక చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మన ఊపిరితిత్తులను మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఇంకా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.ఇక బయట కార్బన్​ పదార్థాలు ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి చాలా HEALTH{#}Manamఊపిరితిత్తులు ఆరోగ్యంగా వుండాలంటే..?ఊపిరితిత్తులు ఆరోగ్యంగా వుండాలంటే..?HEALTH{#}ManamWed, 05 Jul 2023 17:41:00 GMTవర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చాలు కొంతమందికి నరకం కనపడుతుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన ఎన్నో రకాల  వ్యాధులు వస్తాయి. ఎంతగానో వేధిస్తుంటాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్, ఆస్థమా, న్యుమోనియా, దగ్గు ఇంకా బ్రాంకైటిస్ వంటివి చాలా ఇబ్బంది పెడతాయి.ఈ జబ్బులు ఉన్న వాళ్లు చల్లని నీళ్లు తాగినా ఇంకా చల్లని వాతావరణంలో తిరిగినా  ఊపిరి ఆడక చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మన ఊపిరితిత్తులను మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఇంకా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.ఇక బయట కార్బన్ పదార్థాలు ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి చాలా రోగాలకు కారణమవుతున్నాయి. పైగా ఈ సమస్యలకు మందులు వాడడం వల్ల మనం చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఇక ఇలా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు నాచురల్ గా లభించే వామాకును వాడడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక వాము చెట్టు  మందటి ఆకులతో ప్రతి నర్సరీలో కూడా లభిస్తుంది. ఆకు పచ్చని రంగులో ఉన్న ఈ ఆకులను ముట్టుకుంటే మంచి వామ వాసన వెదజల్లుతుంది. ఇక దీనిని నేరుగా కూడా తినొచ్చు. వామాకులో థైమాల్, కార్వకాన్ అనే రసాయన సమ్మేళనాలు కూడా ఉంటాయి.ఇవి మన ఊపిరితిత్తుల్లో శ్లేష్మాలు ఎక్కువగా తయారవ్వడానికి కారణమయ్యే హిస్టమిన్స్ ఉత్పత్తిని తగ్గించడంలో బాగా సహాయపడతాయి.


ఇంకా అంతేకాకుండా వామాకును వాడడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ల కారణంగా తలెత్తే ఇబ్బంది, చికాకు కూడా తగ్గుతుంది.అలాగే ఆస్థమా, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి సమస్యలతో బాధపడే వారు వామాకును వాడడం వల్ల ఆయా సమస్య నుండి చక్కటి ఉపశమనం కలుగుతుందని పరిశోధనల ద్వారా తెలిసింది. ఆస్థమా సమస్యతో బాధపడే వారికి ఇది చాలా చక్కగా సహాయపడుతుంది.ఇక ఇండ్లల్లో ఈ వామాకు మొక్కని తప్పకుండా ఉండాలి. వామాకును పచ్చడిగా చేసి తీసుకుంటే చాలా మంచి ఉపయోగం ఉంటుంది. ఇంకా అలాగే నీటిలో వామాకును వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు. ఇంకా వంటల్లో కూడా వామాకును వాడుకుకోవచ్చు. ఏదో ఒక రూపంలో రోజూ గుప్పెడు వామాకును ఆహారంగా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు అన్ని తగ్గు ముఖం పట్టడంతో పాటు అవి మళ్ళీ మనల్ని చేరకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే ఖచ్చితంగా మానుకోండి. ఆ అలవాటు ఉండి ఎన్ని పద్ధతులు పాటించిన ఎలాంటి ఫలితం ఉండదు.



RRR Telugu Movie Review Rating

If this happens the price of petrol will be 15 rupees per liter

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?

ఏపీలో పవన్‌.. తెలంగాణలో బండి సంజయ్‌?

అద్భుతాలు సృష్టిస్తున్న భారత కుర్రాళ్లు?

భార్య, భర్త విడిపోతే పిల్లలు తండ్రి వద్ద ఉండొచ్చా?

కేసీఆర్‌కు ఎంఐఎం గుది బండగా మారుతోందా?

లింగమనేని ఫిట్టింగ్‌: బాబును రోడ్డున పడేస్తారా?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>