Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-94bda556-3fae-4e9e-b5bf-0ee065f1a182-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-94bda556-3fae-4e9e-b5bf-0ee065f1a182-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు జీవితంలో మొబైల్ ఫోన్ అనేది తప్పనిసరిగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మనిషి అవసరాలను మాత్రమే తీర్చడానికి వచ్చిన మొబైల్ ఫోన్ ఇక ఇప్పుడు ఏకంగా ఆరడుగుల మనిషినే ఆడిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్నా.. తప్పనిసరిగా మొబైల్ ఫోన్ చేతిలో ఉండాల్సిందే. ఒక్క నిమిషం పాటు మొబైల్ చేతిలో లేకపోయినా ఏదో కోల్పోయాం అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా బాధపడిపోతున్నారు అని చెప్పాలి. తిండి లేకపోయినా బ్రతకగలమేమో కానీ ఫోన్ లేకపోతే మాత్రం ఉండలేము అన్న పరిస్థితుMurder {#}Smart phone;Murder.;Jagtial;Korutla;Husband;Wifeభార్య మొబైల్ ఎక్కువగా వాడుతుందని.. భర్త చేసిన పనికి అందరూ షాక్?భార్య మొబైల్ ఎక్కువగా వాడుతుందని.. భర్త చేసిన పనికి అందరూ షాక్?Murder {#}Smart phone;Murder.;Jagtial;Korutla;Husband;WifeWed, 05 Jul 2023 08:17:00 GMTఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు జీవితంలో మొబైల్ ఫోన్ అనేది తప్పనిసరిగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మనిషి అవసరాలను మాత్రమే తీర్చడానికి వచ్చిన మొబైల్ ఫోన్ ఇక ఇప్పుడు ఏకంగా ఆరడుగుల మనిషినే ఆడిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్నా.. తప్పనిసరిగా మొబైల్ ఫోన్ చేతిలో ఉండాల్సిందే. ఒక్క నిమిషం పాటు మొబైల్ చేతిలో లేకపోయినా ఏదో కోల్పోయాం అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా బాధపడిపోతున్నారు అని చెప్పాలి. తిండి లేకపోయినా బ్రతకగలమేమో కానీ ఫోన్ లేకపోతే మాత్రం ఉండలేము అన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.



 అయితే అవసరం కోసం ఫోన్ వినియోగిస్తున్న వారి కంటే.. కాలక్షేపం కోసం మొబైల్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ అయిపోతుంది అని చెప్పాలి. ఇలా మితిమీరిన మొబైల్ వాడకం అటు ఎంతో మంది జీవితాలను మార్చేస్తుంది. ఈ క్రమంలోనే బంధాలను కూడా తెంపేస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఇక పచ్చటి కాపురాల్లో మొబైల్ చిచ్చు పెట్టిన ఘటనలు కూడా ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇక ఇటీవల మొబైల్ ఫోన్ పెట్టిన చిచ్చు కారణంగా ఏకంగా ఒక ప్రాణమే గాల్లో కలిసిపోయింది. తన భార్య అతిగా ఫోన్ వాడటాన్ని సహించలేకపోయాడు భర్త. దీంతో ఆమెను భర్త కాలువలో పడేసి దారుణంగా హత్య చేశాడు.


 ఈ ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కథలాపూర్ మండలానికి చెందిన జామిర్ కు పది నెలల క్రితం కోరుట్ల కు చెందిన సాజిదాతో వివాహం జరిగింది. అయితే వీరి సంసారం మొదట్లో సాఫీగానే సాగింది. అయితే కొన్ని నెలలు గడిచాక జమీర్ సాజిదల మధ్య విభేదాలు తలెత్తాయ్. ఇందుకు కారణం సాజిదా తరచూ మొబైల్ ఎక్కువగా వాడుతూ ఉండడమే. గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతుండడంతో భార్యపై జామీర్ కి అనుమానం వచ్చింది. బంధువులతోనే   ఫోన్ మాట్లాడుతున్న అని చెప్పిన జామీర్ అనుమానం తీరలేదు. దీంతో ఇక భార్యను చంపేయాలి అని నిర్ణయించుకున్నాడు. మాయమాటలు చెప్పి కాల్వ వద్దకు  తీసుకెళ్లి అక్కడే హత్య చేశాడు. విషయం తెలుసుకున్న సాజీదా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఇక జామీర్ ఇంటిముందు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు.



RRR Telugu Movie Review Rating

Priyanka Chopra made fun of Bollywood movies

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?

ఏపీలో పవన్‌.. తెలంగాణలో బండి సంజయ్‌?

అద్భుతాలు సృష్టిస్తున్న భారత కుర్రాళ్లు?

భార్య, భర్త విడిపోతే పిల్లలు తండ్రి వద్ద ఉండొచ్చా?

కేసీఆర్‌కు ఎంఐఎం గుది బండగా మారుతోందా?

లింగమనేని ఫిట్టింగ్‌: బాబును రోడ్డున పడేస్తారా?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>