Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/politics_latestnews/stikes723b3eef-1018-4ec0-be75-0da9cdb831bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/politics_latestnews/stikes723b3eef-1018-4ec0-be75-0da9cdb831bb-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ మధ్య ఈ యాషెస్‌ సిరీస్‌ జరుగుతుంది. ఇప్పటికే 2 టెస్టు మ్యాచులు జరగగా రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా గెలిచిన విషయం అందరికి తెలిసిందే. అయితే రెండో టెస్టులో బెయిర్‌స్టో రన్ అవుట్ పై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతుంది. బెయిర్‌స్టో స్ట్రైక్ లో ఉండగా బౌలర్ వేసిన బాల్ డాట్ అయ్యింది. అయితే ఈ బెయిర్‌స్టో బాల్ డాట్ అయ్యాక క్రీజ్ దాడి ముందుకొచ్చాడు. అయితే వికెట్ కీపర్ బాల్ ని వికెట్లకు త్రో చేయగా ఆ బాల్ వికెట్ లకు తాకింది. ఆస్ట్రేలియా అవుట్ అని అపీల్ చేయగా అంపైర్ అవుట్ అని ప్రకటించారు. ఈ రStikes{#}Qualification;Ben Stokes;England;Australia;Cricketఅలా అయితే.. అప్పుడు ఇంగ్లాండ్ చేసింది కూడా తప్పే కదా?అలా అయితే.. అప్పుడు ఇంగ్లాండ్ చేసింది కూడా తప్పే కదా?Stikes{#}Qualification;Ben Stokes;England;Australia;CricketWed, 05 Jul 2023 18:00:00 GMTఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ మధ్య ఈ యాషెస్‌ సిరీస్‌ జరుగుతుంది. ఇప్పటికే 2 టెస్టు మ్యాచులు జరగగా రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా గెలిచిన విషయం అందరికి తెలిసిందే. అయితే రెండో టెస్టులో బెయిర్‌స్టో రన్ అవుట్ పై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతుంది. బెయిర్‌స్టో స్ట్రైక్ లో ఉండగా బౌలర్ వేసిన బాల్ డాట్ అయ్యింది. అయితే ఈ బెయిర్‌స్టో బాల్ డాట్ అయ్యాక క్రీజ్ దాడి ముందుకొచ్చాడు. అయితే వికెట్ కీపర్ బాల్ ని వికెట్లకు త్రో చేయగా ఆ బాల్ వికెట్ లకు తాకింది. ఆస్ట్రేలియా అవుట్ అని అపీల్ చేయగా అంపైర్ అవుట్ అని ప్రకటించారు. ఈ రన్ అవుట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఘటనపై స్టార్ క్రికెటర్లందరూ స్పందిస్తున్నారు. అయితే ఆసీస్ జట్టు వ్యవహరించిన తీరుపై పలువురు మాజీలు సహా చాలా మంది విమర్శలు గుప్పించారు.

ఇంగ్లాండ్ అభిమానులు వరుస కామెంట్లు పెడుతున్నారు. 'ఆస్ట్రేలియా జట్టుది కపట బుద్ది అని.. గెలుపు కోసం ఎంతకైనా తెగిస్తారంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీనిపై 'ద వెస్ట్ ఆస్ట్రేలియన్' అనే పత్రిక బెన్ స్టోక్స్ ఫోటోను మార్ఫింగ్‌ చేసి  'క్రైబేబీస్' అనే శీర్షికతో ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఇప్పుడు ఆసీస్ చేసింది తప్పు అయితే అప్పుడు ఇంగ్లాండ్ కపటత్వం చూపించిందని పాత వీడియోలు షేర్ చేస్తూ ఆసీస్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. 2022లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ వేసిన బంతిని హెన్రీ నికోల్స్‌ స్ట్రెయిట్‌ షాట్‌ ఆడాడు. అయితే దురదృష్టవశాత్తూ బంతి నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న డారిల్‌ మిచెల్‌ బ్యాట్‌ను తాకి ఫీల్డర్‌ చేతుల్లోకి వెళ్లింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ ఔటిచ్చాడు. వెంటనే హెన్రీ నికోల్స్‌ నిరాశగా పెవిలియన్‌ చేరాడు. అయితే అప్పుడు ఇంగ్లాండ్ అలోచించి అప్పీల్ ను వెనక్కి తీసుకోవచ్చు. కానీ ఇంగ్లాండ్ అలా చేయలేదు. అయితే అభిమాని షేర్‌ చేసిన వీడియోపై ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. ''క్రీడాస్పూర్తి అనే పదాన్ని భుజాలపై ఎత్తుకొని వాదిస్తున్న ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఈ వీడియోపై స్పందించండి. ఇప్పుడు ఆసీస్‌ చీటింగ్‌ చేసిందని అంటున్నారు.. న్యాయంగా మీరు ఆరోజు చేసింది కూడా చీటింగ్‌ కిందే వస్తుంది. మీ కపటత్వాన్ని చాటిచెప్పే పలు వీడియోలు ఇక్కడ ఉన్నాయి.అందులో ప్రస్తుత ఆటగాళ్లలో కొందరు భాగస్వాములుగా ఉన్నారు. ఇంగ్లీష్ క్రికెట్‌ కపటత్వం, అర్హత యొక్క భావం నా దృష్టిలో వేరే విషయం.'' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం క్రికెట్ లో బెయిర్‌స్టో రన్ అవుట్ ట్రెండింగ్ అవుతుంది. మాజీలు అందరూ స్పందిస్తుండడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కుతుంది.



RRR Telugu Movie Review Rating

If this happens the price of petrol will be 15 rupees per liter

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?

ఏపీలో పవన్‌.. తెలంగాణలో బండి సంజయ్‌?

అద్భుతాలు సృష్టిస్తున్న భారత కుర్రాళ్లు?

భార్య, భర్త విడిపోతే పిల్లలు తండ్రి వద్ద ఉండొచ్చా?

కేసీఆర్‌కు ఎంఐఎం గుది బండగా మారుతోందా?

లింగమనేని ఫిట్టింగ్‌: బాబును రోడ్డున పడేస్తారా?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>