Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl4d8c3cf4-00fd-4f62-ad82-79b759a0aac1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl4d8c3cf4-00fd-4f62-ad82-79b759a0aac1-415x250-IndiaHerald.jpgబీసీసీఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ లీగ్ ను క్యాష్ రిచ్ లీగ్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు క్రికెట్ ప్రేక్షకులు. అయితే ప్రపంచ క్రికెట్లో ఉన్న ప్రతి ఒక్క ఆటగాడు ఐపీఎల్ లో భాగం కావాలని ఎంతో బలంగా కోరుకుంటాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఇక ప్రపంచం క్రికెట్లో ఎవరికి తెలియని అనామకులుగా ఉన్న ఎంతో మందిని అటు స్టార్ క్రికెటర్లుగా మార్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ క్రమంలోనే ఎంతోమంది క్రికెటర్లు ఇక ప్రతి ఐపీఎల్ లో అవకాIpl{#}Cricket;Audi;Bangladesh;Lucknow;Mini;Indianఐపీఎల్ కు దూరంగా ఉన్నందుకు.. ఆ ముగ్గురికి బోనస్ ఇచ్చిన క్రికెట్ బోర్డు?ఐపీఎల్ కు దూరంగా ఉన్నందుకు.. ఆ ముగ్గురికి బోనస్ ఇచ్చిన క్రికెట్ బోర్డు?Ipl{#}Cricket;Audi;Bangladesh;Lucknow;Mini;IndianTue, 04 Jul 2023 12:30:00 GMTబీసీసీఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ లీగ్ ను క్యాష్ రిచ్ లీగ్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు క్రికెట్ ప్రేక్షకులు. అయితే ప్రపంచ క్రికెట్లో ఉన్న ప్రతి ఒక్క ఆటగాడు ఐపీఎల్ లో భాగం కావాలని ఎంతో బలంగా కోరుకుంటాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఇక ప్రపంచం క్రికెట్లో ఎవరికి తెలియని అనామకులుగా ఉన్న ఎంతో మందిని అటు స్టార్ క్రికెటర్లుగా మార్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ క్రమంలోనే ఎంతోమంది క్రికెటర్లు ఇక ప్రతి ఐపీఎల్ లో అవకాశం దొరుకుతుందేమో అని తమ పేరును రిజిస్టర్ చేసుకోవడం చేస్తూ ఉంటారు.



 ఐపీఎల్ లో ఆడటం ద్వారా కోట్ల రూపాయల ఆదాయంతో పాటు ఇక మరోవైపు పాపులారిటీ కూడా సంపాదించవచ్చు అని ఆశపడుతూ ఉంటారు. కానీ కొంతమంది క్రికెటర్లు మాత్రం ఐపీఎల్ లో ఆడటం కంటే జాతీయ జట్టు తరఫున ప్రార్థన చేయడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో బంగ్లాదేశ్ కు చెందిన ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు అని చెప్పాలి. ఐపీఎల్ కంటే తమకు జాతీయ జట్టుకు ఆడటమే ముఖ్యం అంటూ ఐపీఎల్ ఆఫర్ ను వదులుకున్నారు. ఆ ముగ్గురు ఎవరో కాదు షకీబ్ అల్ హాసన్, లిటన్ దాస్, టాస్కిన్ అహ్మద్. ఇలా జాతీయ జట్టుకు ప్రాధాన్యత ఇచ్చిన ఈ ముగ్గురు క్రికెటర్లకు ఆ దేశ  క్రికెట్ బోర్డు ఇటీవల రివార్డు ప్రకటించింది.


 ఈ ముగ్గురు క్రికెటర్లకు కలిపి 65 వేల డాలర్లను రివార్డుగా  ప్రకటించింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. అంటే భారత కరెన్సీలో దాదాపు 53 లక్షల రూపాయలు రివార్డు ఇచ్చింది అని చెప్పాలి. కాగా 2023 ఐపీఎల్ మినీ వేలంలో బంగ్లా ఆల్రౌండర్ షకీబ్ అల్ హాసన్ ని 1.5 కోట్లతో కోల్కతా కొనుగోలు చేసింది. అయితే ఐర్లాండ్తో టెస్ట్ సిరీస్ కారణంగా అతను ఐపిఎల్ నుంచి తప్పుకున్నాడు. ఇక లిట్టన్ దాస్ ను 50 లక్షలకు కోల్కతా తీసుకుంటే ఐర్లాండ్తో సిరీస్ ఉన్న నేపథ్యంలో ఒకే ఒక మ్యాచ్ ఆడి మళ్లీ స్వదేశం వెళ్లిపోయాడు. అయితే క్రికెట్ బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో లక్నో ఆఫర్ ను తిరస్కరించాడు టస్కిన్ అహ్మద్.



RRR Telugu Movie Review Rating

స్కంద: రిలీజ్ అయ్యేది అప్పుడే?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>