PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-modi-bandi-amitshahe5ba015b-8276-4042-8a42-7146b7a6900f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-modi-bandi-amitshahe5ba015b-8276-4042-8a42-7146b7a6900f-415x250-IndiaHerald.jpgదుబ్బాకలో తాను, హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ తమ ఫేస్ వాల్యుతో గెలిచాము కానీ పార్టీ అభ్యర్ధులుగా కాదని తేల్చేశారు. ముందు తమ ఫేస్ వాల్యు తర్వాతే పార్టీ జెండాని స్పష్టంగా చెప్పేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని గెలిపించుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన మాటేమైందని ప్రశ్నించారు. మునుగోడులో కోమటిరెడ్డిని అమిత్ గెలిపించారా అంటు నిలదీశారు. తరుచుగ్ , సునీల్ బన్సల్ మొహాలు చూసి ఎవరైనా ఓట్లేస్తారా అంటు ఎదురుప్రశ్నించారు. bjp modi bandi amitshah{#}Amit Shah;raghu;sunil;Eatala Rajendar;Amith Shah;MLA;central government;Leader;Minister;Partyహైదరాబాద్ : రఘునందన్ షాట్ మామూలుగా లేదుగా ? పెద్ద షాక్హైదరాబాద్ : రఘునందన్ షాట్ మామూలుగా లేదుగా ? పెద్ద షాక్bjp modi bandi amitshah{#}Amit Shah;raghu;sunil;Eatala Rajendar;Amith Shah;MLA;central government;Leader;Minister;PartyTue, 04 Jul 2023 07:00:00 GMT


పేరుగొప్ప ఊరుదిబ్బంటే బీజేపీనే గుర్తుకొస్తోంది. తమది ఎంతో డిసిప్లిన్డ్ పార్టీ అని, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎట్టి పరిస్ధితుల్లోను సహించబోమని కమలనాదులు పదేపదే చెబుతుంటారు. అలాంటి బీజేపీలో నేతల మధ్య విభేదాలు, అసంతృప్తులు ఇపుడు రోడ్డున పడ్డాయి. నేతల మధ్య పంచాయితిచేయలేక, తీర్చలేక అగ్రనేతలకు తలబొప్పి కడుతోంది. తాజాగా దుబ్బాక ఎంఎల్ఏ రఘునదనరావు ఇచ్చిన పంచులకు పార్టీ అగ్రనేతల దిమ్మతిరిగిపోయుంటుంది.





తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కటంలేదని చాలాకాలంగా ఎంఎల్ఏ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే కారణంతో పార్టీమారినా మారిపోతారనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ఢిల్లీలోని అగ్రనేతల నుండి పిలుపొచ్చింది. ఢిల్లీకి వెళ్ళిన రఘునందన్ అగ్రనేతల ముందు మూడు ఆప్షన్లుంచారు. అవేమిటంటే తనకు బీజేపీఎల్పీ నేతగా నియమించటం, జాతీయ అధికారప్రతినిదిగా అపాయింట్ చేయటం లేకపోతే తెలంగాణా అధ్యక్షుడిని చేయటం. పార్టీకోసం కష్టపడిన తనకు అధ్యక్ష పదవి ఎందుకివ్వరని నిలదీస్తున్నారు.





దుబ్బాకలో తాను, హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ తమ ఫేస్ వాల్యుతో గెలిచాము కానీ పార్టీ అభ్యర్ధులుగా కాదని తేల్చేశారు.  ముందు తమ ఫేస్ వాల్యు తర్వాతే పార్టీ జెండాని స్పష్టంగా చెప్పేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని గెలిపించుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన మాటేమైందని ప్రశ్నించారు. మునుగోడులో కోమటిరెడ్డిని అమిత్ గెలిపించారా అంటు నిలదీశారు. తరుచుగ్ , సునీల్ బన్సల్ మొహాలు చూసి ఎవరైనా ఓట్లేస్తారా అంటు ఎదురుప్రశ్నించారు.





రెండేళ్ళుగా జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ను, శాసనసభాపక్ష నాయకుడిని కూడా పార్టీ నియమించలేకపోయిందని ఎద్దేవాచేశారు. అసలు పార్టీని నడిపే విధానం ఇదేనా అని మండిపోయారు. రఘునందన్ వ్యాఖ్యలు చూస్తుంటే పార్టీని వదిలేసేందుకు సిద్ధపడినట్లు అనుమానంగా ఉంది. పార్టీలో కంటిన్యు అవ్వాలని అనుకున్న ఏ నేత కూడా ఇలా మాట్లాడరు. నరేంద్రమోడీతో సమానస్ధాయిని అనుభవిస్తున్న అమిత్ షా ను చులకనగా మాట్లాడారంటేనే రఘునందన్ ఆలోచన ఏమిటో అర్ధమైపోతోంది. మరి రఘు తాజా వ్యాఖ్యలపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.








RRR Telugu Movie Review Rating

వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాలు ఇవే..?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>