HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/oral-health2866e9b4-afaa-4b2b-bfff-1173430b39cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/oral-health2866e9b4-afaa-4b2b-bfff-1173430b39cb-415x250-IndiaHerald.jpgమనం తీసుకునే ఆహారం వల్ల నోటిలో చెడు బ్యాక్టీరియా అనేది చాలా వేగంగా పెరుగుతుంది. ఈ చెడు బ్యాక్టీరియా ఖచ్చితంగా నోటి ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తుంది. దీంతో మనం దంతాలకు ఇంకా చిగుళ్లకు సంబంధించిన సమస్యల బారిన పడి బాగా బాధ పడాల్సి వస్తుంది. అయితే చాలా మంది కూడా ఈ సమస్యల నుండి బయటపడడానికి చాలా ఖర్చు చేస్తూ ఉంటారు.అందుకోసం అనేక రకాల చిట్కాలను వాడుతూ ఉంటారు. కానీ ఒకే ఒక సహజ సిద్ద పదార్థాన్ని ఉపయోగించి మనం ఈ సమస్యలన్నింటి నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. నోటి సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఆపిల్ సైడ్ వెనిగర్ మనకORAL HEALTH{#}Apple;Manamపళ్ళు ఆరోగ్యంగా తెల్లగా మెరిసే టిప్?పళ్ళు ఆరోగ్యంగా తెల్లగా మెరిసే టిప్?ORAL HEALTH{#}Apple;ManamTue, 04 Jul 2023 14:22:02 GMTమనం తీసుకునే ఆహారం వల్ల నోటిలో చెడు బ్యాక్టీరియా అనేది చాలా వేగంగా పెరుగుతుంది. ఈ చెడు బ్యాక్టీరియా ఖచ్చితంగా నోటి ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తుంది. దీంతో మనం దంతాలకు ఇంకా చిగుళ్లకు సంబంధించిన సమస్యల బారిన పడి బాగా బాధ పడాల్సి వస్తుంది. అయితే చాలా మంది కూడా ఈ సమస్యల నుండి బయటపడడానికి చాలా ఖర్చు చేస్తూ ఉంటారు.అందుకోసం అనేక రకాల చిట్కాలను వాడుతూ ఉంటారు. కానీ ఒకే ఒక సహజ సిద్ద పదార్థాన్ని ఉపయోగించి మనం ఈ సమస్యలన్నింటి నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. నోటి సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఆపిల్ సైడ్ వెనిగర్ మనకు చాలా బాగా సహాయపడుతుంది. ఇది మనకు మెడికల్ షాపుల్లో ఇంకా ఆన్ లైన్ లో ఎక్కువగా లభిస్తుంది. ఈ ఆపిల్ సైడ్ వెనిగర్ ను వాడడం వల్ల దంతాలు ఇంకా చిగుళ్ల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఇక ఈ ఆపిల్ సైడ్ వెనిగర్ 2 నుండి 3 శాతం ఆమ్లతత్వాన్ని కలిగి ఉంటుంది. దీని వల్ల నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియా నశించి నోటి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఇంకా దీనిని వాడడం వల్ల దంతాలపై ఉండే పాచి ఈజీగా తొలగిపోయి దంతాలు చాలా తెల్లగా మారతాయి.అలాగే నోటి దుర్వాసన సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది.మన చిగుళ్ల ఇన్ఫెక్షన్ లు, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడం తగ్గుతుంది. అలాగే దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి. అయితే ఈ ఆపిల్ సైడ్ వెనిగర్ ను ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


చాలా మంది కూడా తెలియక దీనిని నేరుగా నోట్లో పోసుకుని పుక్కిలిస్తూ ఉంటారు. కొంతమంది బ్రష్ తో దీనిని తీసుకుని దంతాలను శుభ్రం చేస్తూ ఉంటారు.కానీ ఇలా మాత్రం అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఆపిల్ సైడ్ వెనిగర్ ఆమ్లత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది.కాబట్టి దంతాలపై నేరుగా రాయడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ అనేది దెబ్బతింటుంది.కాబట్టి దీనిని నీటిలో వేసి కలిపి వాడాల్సి ఉంటుంది. 75 ఎమ్ ఎల్ వెచ్చటి నీటిలో ఒకటిన్నర లేదా రెండు స్పూన్ల ఆపిల్ సైడ్ వెనిగర్ ను వేసి కలిపి మీరు వాడాల్సి ఉంటుంది.దీనిని నీటిలో కలపడం వల్ల ఆపిల్ సైడ్ వెనిగర్  ఆమ్లత్వం తగ్గుతుంది. అందువల్ల దంతాలకు నష్టం వాటిల్లకుండా ఉంటుంది. అందుకే ఇలా తయారు చేసుకున్న నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి.ఇంకా అలాగే బ్రష్ తో ఈ నీటిని తీసుకుని దంతాలను బాగా శుభ్రం చేసుకోవచ్చు. ఈ విధంగా ఆపిల్ సైడ్ వెనిగర్ ను వాడడం వల్ల దంతాలు తెల్లగా మారడంతో పాటు చాలా ఆరోగ్యంగా తయారవుతాయి. నోటి ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడి నోటి నుండి దుర్వాసన రావడం ఈజీగా తగ్గుతుంది.



RRR Telugu Movie Review Rating

స్కంద: రిలీజ్ అయ్యేది అప్పుడే?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>